విమాన ప్రయాణికులపై జైట్లీ తన తాజా బడ్జెట్‌లో మరింత భారం పెంచారు.
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులపై జైట్లీ తన తాజా బడ్జెట్‌లో మరింత భారం పెంచారు. ఫస్ట్, బిజినెస్ క్లాస్ ప్రయాణికులపై సర్వీస్ ట్యాక్స్‌ను 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు ఊరటనిచ్చేందుకు బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించారు. పౌర విమానయాన శాఖకు మొత్తం రూ.5,360.95 కోట్లు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకు రూ. 80 కోట్లు కేటాయించారు. పౌర విమానయాన డెరైక్టరేట్ జనరల్(డీజీసీఏ)కు రూ.50 కోట్లు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి రూ. 40 కోట్లను కేటాయించారు.