ఢిల్లీ : కరోనా మహమ్మరి ఎవరినీ వదలడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేదు. సామాన్యుల నుంచి ప్రధానుల వరక కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులపైనా కరోనా పంజా విసురుతోంది.
ఢిల్లీలో దాదాపు 162 మంది జర్నలిస్టులను కరోనా అనుమానంతో క్వారంటైన్‌కు తరలించారు. ఈ క్రమంలో తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. క్వారంటైన్‌లో గడపుతున్న మీడియా ప్రతినిథుల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ విభాగాలకు చెందిన జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, కెమేరామెన్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment