
కల్తీ మద్యానికి 17 మంది బలి
ఉత్తరప్రదేశ్ లో కల్తీ మద్యం 17 మందిని బలితీసుకుంది. కల్తీ మద్యాన్ని సేవించిన మరో 12 మందిపరిస్థితి విషయంగా ఉంది.
ఈ ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మృతులకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు జిల్లా మేజిస్టేట్ అజయ్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడైన శ్రీపల్ ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.