
కల్తీ మద్యంతో పది మంది మృత్యువాత
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని రామ్‌నగర్ ప్రాంతంలో కల్లీ మద్యం సేవించిన ఘటనలో దాదాపు పది మంది మరణించారు. రామ్‌నగర్‌లో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మరణించారని, మంగళవారం ఉదయం మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించగా, వారిలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారని పోలీసులు తెలిపారు.
కల్తీ మద్యం సేవించి అస్వస్ధతకు గురైన వారిలో మరో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉందని, తొమ్మిది మందిని లక్నోకు తరలించామని పోలీసులు వెల్లడించారు. కాగా విధి నిర్వహణలో విఫలమైన జిల్లా ఎక్సైజ్ అధికారిపై ఎక్సైజ్ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు యూపీ డీజీపీ రంగంలోకి దిగి రామ్‌నగర్ ఎస్‌హెచ్‌ఓ రాజేష్, సర్కిల్ ఆఫీసర్ పవన్ గౌతమ్‌లను సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని యూపీ ఎక్సైజ్ మంత్రి జై ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు.