‘లక్షా25వేల కోట్లకు మోదీ ఒక్క పైసా ఇవ్వలేదు’ | 18 Months On, Bihar Awaits PM's Rs 125,000 Cr Bounty: RTI Reply | Sakshi
Sakshi News home page

‘లక్షా25వేల కోట్లకు మోదీ ఒక్క పైసా ఇవ్వలేదు’

Published Tue, Mar 7 2017 1:35 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

‘లక్షా25వేల కోట్లకు మోదీ ఒక్క పైసా ఇవ్వలేదు’ - Sakshi

‘లక్షా25వేల కోట్లకు మోదీ ఒక్క పైసా ఇవ్వలేదు’

ముంబయి: భారత ప్రధాని నరేంద్రమోదీ నోట వచ్చిన అతి పెద్ద ప్యాకేజీ, అభివృద్ధి కోసం ప్రకటించిన భారీ మొత్తం ఎంతో తెలుసా.. లక్షా25వేల కోట్ల రూపాయలు. ఇది ప్రకటించింది బిహార్‌ రాష్ట్రానికి. ఈ ప్రకటన చేసి దాదాపు ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఒక్క పైసా కూడా విడుదలవ్వలేదంట. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటకొచ్చింది. ముంబయికి చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమ కారుడు అనిల్‌ గల్గాలి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్టీఐ దరఖాస్తు చేశారు.

అందులో ప్రధాని మోదీ చేసిన అతిపెద్ద హామీ ఏది అని, ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటీ అని అందులో ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఆనంద్‌ పర్మార్‌ నేరుగా సమాధానం ఇచ్చారు. ‘బిహార్‌ ఎన్నికల ప్రచారం సమయంలో ఆ రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా గుర్తించి దాని పురోభివృద్ధికై మోదీ ఆగస్టు 18, 2015న రూ.1,25,003కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దశాల వారిగా నిధులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఒక పైసా కూడా విడుదల చేయలేదని చెప్పారు’  అని అనిల్‌ గల్గాలి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement