rti query
-
వ్యాక్సిన్: ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం వింత సమాధానం
సాక్షి, హైదరాబాద్: కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లకు సంబంధించిన ఇండెంట్ సమాచారం తమ వద్ద లేదని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టంచేసింది. దేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతి ఎప్పుడు ఇచ్చారు? దేశ ప్రజల కోసం ఎన్ని డోసుల వ్యాక్సిన్లు ఆర్డర్ ఇచ్చారు? ఏ తేదీన ఇచ్చారు? అన్న వివరాలు కోరుతూ హైదరాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా జూన్ 18న దరఖాస్తు చేశారు. దీనికి కేంద్రం సమాధానం చూసి ఆయన అవాక్కయ్యారు. ఏ వ్యాక్సిన్‌కు, ఏ రోజున ఎంత ఆర్డర్ పెట్టారు? అన్న ప్రశ్నకు తమ వద్ద సమాచారం లేదని బదులిచ్చింది. -
రైలు టికెట్ రద్దు: మీకో షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: వెయిట్‌లిస్ట్ చేసిన టికెట్లను రద్దు చేయడం మర్చిపోయారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. భారతీయ రైల్వే కాన్సిలేషన్ టికెట్ల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించింది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. రైల్వే ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు, లేదా రద్దు చేసుకోవడం మర్చిపోయిన టికెట్ల ద్వారా....అక్షరాల 9వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా వెయిటింగ్ లిస్టులో ఉండి రద్దు కాని టికెట్ల ద్వారా రూ. 9 వేల కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా రైల్వే సమాచార సంస్థ కేంద్రం (సీఆర్ఐఎస్) వెల్లడించింది. రాజస్థాన్ కోటాకు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్ స్వామి సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరడంతో సీఆర్ఐఎస్ ఈ వివరాలను వెల్లడించింది. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2020 మధ్య కాలంలో (మూడేళ్లు) వెయిటింగ్ లిస్టులో ఉన్న 9.5 కోట్ల మంది తమ టికెట్లను రద్దు చేసుకోలేదు. తద్వారా ఈ ప్రయాణికుల నుండి అత్యధికంగా రూ .4,335 కోట్లు సంపాదించింది. అలాగే టికెట్ల క్యాన్సిలేషన ద్వారా రూ.4335కోట్లను ఆర్జించింది. ఇలా గత మూడేళ్లలో టికెట్ రద్దు ఛార్జీలు, వెయిట్‌లిస్ట్ టికెట్లను రద్దు చేయకపోవడం వల్ల భారతీయ రైల్వే 9,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. ఆన్లైన్ ద్వారా ఐఆర్సిటిసి రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ఖచ్చితమైన పెరుగుదల ఉందని తెలిపింది. 2017- 2020 జనవరి 31 వరకు మొత్తం 145 కోట్ల మంది ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోగా, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా పాత బుకింగ్ పద్ధతిలో 74 కోట్ల మంది టికెట్లను తీసుకున్నారు. భారతీయ రైల్వేల రిజర్వేషన్ పాలసీ, రీఫండ్ పాలసీ (రద్దు చేసుకున్న టికెట్లపై ప్రయాణికులకు తిరిగి వచ్చే సొమ్ము)లో చాలా వివక్ష వుందని సుజిత్ స్వామి ఆరోపించారు. అలాగే ఆన్లైన్ బుకింగ్, కౌంటర్ బుకింగ్‌ల మధ్య చాలా వ్యత్యాసం వుందని, ఇది ప్రయాణికులపై అనవసరపు భారాన్ని మోపుతోందని వాదించారు. తద్వారా రైల్వే అన్యాయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోందంటూ స్వామి రాజస్థాన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా రైల్వే టిక్కెట్లను కాన్సిల్ చేసినపుడు, పూర్తి డబ్బులు కాకుండా.. సర్వీస్ ఛార్జీలు కోత పెట్టి, మిగతా సొమ్మును వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందన్న సంగతి తెలిసిందే. నిర్ణీత సమయానికి 48 గంటల లోపు టికెట్లను కాన్సిల్ చేసుకుంటే.. చార్జీలు ఏసీ ఫస్ట్ క్లాస్ / ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 240 + జీఎస్టీ ఏసీ 2 టైర్, ఫస్ట్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 200 + జీఎస్టీ ఏసీ 3 టైర్ / ఏసీ చైర్ కార్ / ఏసీ 3 ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కోసం రద్దు ఛార్జీ రూ. 180 + జీఎస్టీ స్లీపర్ క్లాస్ టిక్కెట్ల కోసం, రద్దు ఛార్జీ రూ. 120. సెకండ్ క్లాస్ టిక్కెట్లపై రూ. 60 -
రూ.2 వేల నోటు : ఓ షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీలో అధిక విలువ కలిగిన రూ.2 వేల నోటు ముద్రణను కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిలిపివేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదట. ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ప్రశ్నకు ప్రతిస్పందనగా 2020 ఆర్థిక సంవత్సరంలో రూ .2,000 విలువ కలిగిన కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించలేదని ఆర్బీఐ తెలిపింది. ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో 6 కోట్ల రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బ్లాక్‌మనీని అరికట్టేందుకు ఈ చర్య చేపట్టింది. ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు ఎన్ని ముద్రణ అయ్యాయంటూ ఓ దినపత్రిక అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్టీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. నల్లధనాన్ని అడ్డుకట్ట వేసేందుకు రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపి వేసినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఆర్టీఐ సమాచారం ప్రకారం 2017లో రూ .2 వేల కరెన్సీ నోట్లను 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించినట్లు ఆర్బిఐ తెలిపింది. 2018లో 111.507 మిలియన్ నోట్లు మాత్రమే ముద్రించింది. అయితే 2019లో ఈ సంఖ్య మరింత దిగజారి సగానికి పైగా పడిపోయి, 46.690 మిలియన్ల రూ.2వేల నోట్లను మాత్రమే తీసుకొచ్చింది. కాగా 2016 నవంబర్‌లో మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను అనూహ్యంగా రద్దు చేసింది. ఆ తరువాత రూ.2 వేల నోటును చలామణిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
టీ, స్నాక్స్‌కు రూ. 69 లక్షలు ఖర్చుపెట్టిన సీఎం
డెహ్రాడున్ : అతిథులకు ఇచ్చే టీ, స్నాక్స్ కోసం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సుమారు రూ.69 లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం( ఆర్టీఐ) దరఖాస్తు ద్వారా వెల్లడైంది. త్రివేంద్ర సింగ్ సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 నెలల కాలంలో అతిథులకు స్నాక్స్, టీ కోసం ఎంత ఖర్చైందో తెలియజేయాలని ఆర్టీఐ చట్టం కింద హేమంత్ సింగ్ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. త్రివేంద్ర సింగ్ గత ఏడాది మార్చి 18న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి అతిథులకు టీ, స్నాక్స్ కోసం రూ. 68,59,685 లు ఖర్చైనట్లు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఈ డబ్బును మంత్రులు, ప్రభుత్వ అధికారులు, అతిథుల సమావేశాల్లో ఇచ్చే టీ, స్నాక్స్‌కు సైతం ఖర్చు చేశారని ఆర్టీఐ అధికారి పేర్కొన్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో మంత్రులకు టీ, స్నాక్స్ కోసం సుమారు రూ.9కోట్లు ఖర్చుపెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. -
పెరుగుతున్న ‘ఆర్టీఐ’ తిరస్కరణలు
న్యూఢిల్లీ: అధికారుల తిరస్కరణకు గురవుతున్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2013–14లో 60,127 తిరస్కరణకు గురికాగా, 2015–16లో వాటిసంఖ్య 64,666కు పెరిగింది. ఈ వివరాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం దాఖలైన దరఖాస్తులన్నింటికీ కావాల్సిన పూర్తి సమాచారాన్ని నిర్ణీత సమయం లోపల అందజేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే కేంద్ర సమాచార కమిషన్‌లో 12 ఖాళీలు ఉన్నట్లు వాటిని త్వరలో భర్తీ చేస్తామని కూడా ఆయన తెలిపారు. -
‘లక్షా25వేల కోట్లకు మోదీ ఒక్క పైసా ఇవ్వలేదు’
ముంబయి: భారత ప్రధాని నరేంద్రమోదీ నోట వచ్చిన అతి పెద్ద ప్యాకేజీ, అభివృద్ధి కోసం ప్రకటించిన భారీ మొత్తం ఎంతో తెలుసా.. లక్షా25వేల కోట్ల రూపాయలు. ఇది ప్రకటించింది బిహార్ రాష్ట్రానికి. ఈ ప్రకటన చేసి దాదాపు ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఒక్క పైసా కూడా విడుదలవ్వలేదంట. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటకొచ్చింది. ముంబయికి చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమ కారుడు అనిల్ గల్గాలి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్టీఐ దరఖాస్తు చేశారు. అందులో ప్రధాని మోదీ చేసిన అతిపెద్ద హామీ ఏది అని, ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటీ అని అందులో ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్ పర్మార్ నేరుగా సమాధానం ఇచ్చారు. ‘బిహార్ ఎన్నికల ప్రచారం సమయంలో ఆ రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా గుర్తించి దాని పురోభివృద్ధికై మోదీ ఆగస్టు 18, 2015న రూ.1,25,003కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దశాల వారిగా నిధులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఒక పైసా కూడా విడుదల చేయలేదని చెప్పారు’ అని అనిల్ గల్గాలి వివరించారు. -
2000 నోటుపై అప్పుడే నిర్ణయం..
ముంబై: రెండు వేల రూపాయల నోట్లను చెలామణిలోకి తేవాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గతేడాది మే నెలలోనే నిర్ణయం తీసుకుంది. అయితే పాత పెద్ద నోట్లను రద్దు విషయం అప్పుడు ప్రస్తావనకు రాలేదని వెల్లడైంది. సమాచార హక్కు చట్టం కింద ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ సమర్పించిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. రూ.2000 నోట్లు ప్రవేశపెట్టేందుకు సెంట్రల్ బోర్డు 2016, మే 19న ఆమోదం తెలిపిందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ సమావేశంలో పాత పెద్ద నోట్ల రద్దు ప్రస్తావనే రాలేదని తెలిపింది. జూలై 7, ఆగస్టు 11న జరిగిన బోర్డు సమావేశాల్లోనూ పాత పెద్ద నోట్ల ఉపసంహరణపై ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేసింది. రఘురామ్ రాజన్ గవర్నర్ గా ఉన్నప్పుడే రూ. 2000 నోట్లు ప్రవేశపెట్టాలని ఆర్బీఐ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పదవీకాలం ముగియడంతో గతేడాది సెప్టెంబర్ 4న రాజన్ వైదొలగారు. తర్వాత రోజు ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. -
మోదీ సర్కారుపై దాడికి మరో అస్త్రం!
న్యూఢిల్లీ: కేంద్రం నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలకు మరో అస్త్రం దొరికింది. మోదీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు భారీ స్థాయిలో ఖర్చుపెట్టినట్టు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)తో వెల్లడైంది. ఈ కార్యక్రమ ప్రచారానికి రూ. 36 కోట్లు పైగా ఖర్చు చేసినట్టు తేలింది. ఐఏఎన్ వార్తా సంస్థ ఆర్టీఐ దరఖాస్తుతో ఈ సమాచారం రాబట్టింది. కేంద్రంలో మోదీ సర్కారు రేండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మే 29న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆరు గంటల పాటు భారీ ఎత్తున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీని ప్రచార నిమిత్తం ప్రింట్ మీడియాకు రూ.35.59 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ. 1.06 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. దేశంలోని అన్ని ప్రధాన ఇంగ్లీషు, ప్రాంతీయ భాషల పత్రికల్లో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్, విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ) దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సమాచారం ఇచ్చింది. -
భారత్‌పైకి ఏలియన్స్ దండయాత్ర!?
మీరు నమ్మండి.. నమ్మకపోండి. కానీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ప్రభుత్వానికి అందే వేలాది ప్రశ్నల్లో.. ప్రజలకు ఉపయోగపడేవి.. సమాచారాన్ని ఇచ్చేవే కాదు.. ప్రభుత్వ అధికారులను తికమక పెట్టే వికృతమైన వెర్రీమొర్రి ప్రశ్నలు కూడా ఎన్నో ఉంటున్నాయి. రామ్‌లీలా నాటకంలో ప్రధాని మోదీ నటించారా? మహాత్మాగాంధీ ఐక్యూ ఎంత? దేశంలోని పచ్చగా ఉన్న చెట్లు ఎన్ని, ఎండిపోయినవి ఎన్ని? రాఖీపూర్ణిమ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బూష్‌కు పంపిన లడ్డూలు ఎందుకు వెళ్లలేదు? ఇలాంటి వెర్రి ప్రశ్నలెన్నో ఆర్టీఐ ద్వారా ముందుకొచ్చాయి. కానీ తాజాగా ఆర్టీఐ ద్వారా తెరపైకి వచ్చిన ప్రశ్న మాత్రం ఈ వెర్రి ప్రశ్నల్లోనే మహా వెర్రి ప్రశ్న అని చెప్పవచ్చు. ఎందుకంటారా? ముంబైకి చెందిన అజయ్ కుమార్‌కు ఒక డౌటు వచ్చింది. దేశం మీద ఒక్కసారిగా గ్రహాంతర వాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దండయాత్రకొస్తే.. దానిని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా? అంటూ ఆయనకు సందేహం వచ్చింది. దీంతో వెంటనే ఆర్టీఐ ద్వారా ఓ ప్రశ్నాస్త్రాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంధించారు. ’గ్రహాంతర వాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దేశంపై దండయాత్రకు వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా?.. ఈ అంశం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నాకు చెప్పాలి. ప్రభుత్వం వాటిని ఓడించడానికి ఏం చేయబోతున్నది? విల్ స్మిత్ లేకుండా మనం వాటిని ఎదర్కోగలమా?’ అంటూ ఆయన ప్రశ్నించాడు. 1996నాటి సైన్స్-ఫిక్షన్ హాలీవుడ్ సినిమా ’ఇండింపెండెన్స్ డే’ సినిమాలో విల్ స్మిత్ ఎలియన్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన సాయం తీసుకోమంటూ ఉదారంగా సలహా కూడా ఇచ్చాడు. తాజాగా ట్విట్టర్ లో జర్నలిస్టు అభిమాన్యు ఘోషల్ పెట్టిన ఈ ఆర్టీఐ ప్రశ్న ఫొటోకాపీ వైరల్ గా మారిపోయింది. -
అశోకుని జనన, మరణ తేదీలు తెలపండి
న్యూఢిల్లీ: మౌర్య వంశ మూడో చక్రవర్తి అశోకుని జనన, మరణ తేదీలను వెల్లడించాలని కోరుతూ అరుణ్ కుమార్ అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్‌లో దరఖాస్తు దాఖలు చేశారు. వీటితో పాటు అశోకుని జయంతి, వర్ధంతులను ప్రభుత్వం నిర్వహించిందా? దీనికి సంబంధించి ప్రణాళిక ఏమైనా ఉందా? వంటి వివరాలను తెలపాలని కోరినట్లు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్కే మాథుర్ పేర్కొన్నారు. సంబంధిత సమాచారం ఇవ్వాల్సిందిగా కేంద్ర హోం శాఖ, సాంస్కృతిక శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శులను కోరామన్నారు. -
ప్రొఫెసర్ల సహజీవనంపై ఆర్టీఐ దరఖాస్తు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రొఫెసర్ల సహజీవనంపై వారి అభిప్రాయాలు చెప్పాలంటూ ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కేంద్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేశాడు. వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న తన సవతి సోదరి భర్త... సహచర ప్రొఫెసర్‌తో సహజీవనం చేస్తున్నాడని, ఈ విషయమై విచారణ చేపట్టారా అని ప్రశ్నించాడు. తన సోదరి, ఆమె భర్త, సహజీవనం చేస్తున్న ప్రొఫెసర్ అభిప్రాయాలు చెప్పాలని కోరాడు. భర్త నుంచి విడిపోయానని, తమ వ్యక్తిగత సమాచారం కోసం సోదరుడు ప్రయత్నిస్తున్నాడంటూ అతని సోదరి అభ్యంతరం తెలిపింది. వ్యక్తిగత ఆరోపణలు, సమాచారం కోరే హక్కులేదంటూ దరఖాస్తుదారుడికి సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు సమాధానం పంపారు. -
'ఆస్తుల వివరాలు ఇవ్వడం కుదరదు'
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తుల వివరాలిచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వివరాలు ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. సీఎం, మంత్రుల ఆస్తుల వివరాలు ఇవ్వాలని కోరుతూ ముంబైకి చెందిన అనిల్ గాల్గానీ.. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. గత ఐదేళ్లలో సీఎం, మంత్రుల ఆస్తులు వివరాల కావాలని అందులో కోరారు. ఆస్తుల వివరాలు సమర్పించని వారిపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే అనిల్ గాల్గానీ అడిగిన వివరాలిచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అడిగిన సమాచారం ఇవ్వకపోవడం పట్ల సమాచార హక్కు మాజీ ప్రధాన కమిషనర్ వజహత్ హబీబుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం మూర్కత్వంలో వ్యవహరించిందని విమర్శించారు.