
సాక్షి, హైదరాబాద్: కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌లకు సంబంధించిన ఇండెంట్ సమాచారం తమ వద్ద లేదని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టంచేసింది. దేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతి ఎప్పుడు ఇచ్చారు? దేశ ప్రజల కోసం ఎన్ని డోసుల వ్యాక్సిన్లు ఆర్డర్ ఇచ్చారు? ఏ తేదీన ఇచ్చారు? అన్న వివరాలు కోరుతూ హైదరాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా జూన్ 18న దరఖాస్తు చేశారు. దీనికి కేంద్రం సమాధానం చూసి ఆయన అవాక్కయ్యారు. ఏ వ్యాక్సిన్‌కు, ఏ రోజున ఎంత ఆర్డర్ పెట్టారు? అన్న ప్రశ్నకు తమ వద్ద సమాచారం లేదని బదులిచ్చింది.