indent
-
వ్యాక్సిన్: ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం వింత సమాధానం
సాక్షి, హైదరాబాద్: కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లకు సంబంధించిన ఇండెంట్ సమాచారం తమ వద్ద లేదని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టంచేసింది. దేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతి ఎప్పుడు ఇచ్చారు? దేశ ప్రజల కోసం ఎన్ని డోసుల వ్యాక్సిన్లు ఆర్డర్ ఇచ్చారు? ఏ తేదీన ఇచ్చారు? అన్న వివరాలు కోరుతూ హైదరాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా జూన్ 18న దరఖాస్తు చేశారు. దీనికి కేంద్రం సమాధానం చూసి ఆయన అవాక్కయ్యారు. ఏ వ్యాక్సిన్‌కు, ఏ రోజున ఎంత ఆర్డర్ పెట్టారు? అన్న ప్రశ్నకు తమ వద్ద సమాచారం లేదని బదులిచ్చింది. -
రోగుల ప్రాణాలతో చెలగాటం..
సాక్షి, బలిజిపేట (విజయనగరం): ప్రభుత్వ వైద్యశాలల సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాలం చెల్లిన మాత్రలు రోగులకిస్తూ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధి అయిన డయేరియా నివారణకు మెట్రోజోల్ మాత్రలు ఇస్తుంటారు. అయితే ఎక్స్పైరీ అయిన మెట్రోజోల్ మాత్రలను సిబ్బంది అందజేస్తున్నారంటే వారికి రోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కాలం చెల్లిన మాత్రలు పీహెచ్‌సీల్లో ఉంటే వాటిని కాల్చివేయాలి. కాని సిబ్బంది అస్సలు పట్టించుకోకుండా రోగులకు ఎక్స్పైరీ అయిన మాత్రలను ఇస్తున్నారు. బలిజిపేట పీహెచ్సీలో డయేరియా రోగులకు కాలం చెల్లిన మాత్రలు ఇచ్చారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. 2018 అక్టోబర్ నాటికి ఎక్స్పైరీ అయిన మెట్రోజోల్ మాత్రలను సిబ్బంది ఇచ్చారు. ఇవేమీ తెలియని రోగులు ఆ మాత్రలు మింగేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్న రోగులు తమకేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా వచ్చే రోగులు పీహెచ్‌సీకి ఎక్కువగా గర్భిణులు, బాలింతలు, కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు, సుగర్, బీపీ రోగులు ఎక్కువగా వస్తుంటారు. వీరితో పాటు డయేరియా, వైరల్ జ్వరాల బారిన పడ్డవారు కూడా పీహెచ్‌సీని ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు కాలం చెల్లిన మాత్రలు ఇస్తున్నారంటూ బయటకు పొక్కడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలకు ఒకసారి ఇండెంట్ పీహెచ్సీ ఆధారంగా ఇండెంట్ పెడుతుంటారు. పీహెచ్‌సీలకు సంబంధించిన మందులు జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి అక్కడ నుంచి తిరిగి వస్తాయి. బలిజిపేట పీహెచ్‌సీకి మూడు నెలలకొకసారి రూ. 1.50 లక్షలతో ఇండెంట్ పెడతారు. పర్యవేక్షిస్తాం.. బలిజిపేట పిహెచ్సీలో కాలం చెల్లిన మందులు లేవు. ఒకవేళ ఉంటే అటువంటి వాటిని గుర్తించి పక్కన పెట్టస్తాం. దీనిపై పర్యవేక్షణ జరుపుతాం. – మహీపాల్, వైద్యాధికారి, బలిజిపేట పీహెచ్సీ. -
షాకింగ్: నోట్ల ముద్రణను తగ్గిస్తున్న ఆర్బీఐ?
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాగా తగ్గించిందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్లను ముద్రించడం కోసం ఆర్డరును తగ్గించింది. ముఖ్యంగా కేంద్ర బ్యాంకు సహా ఇతర వాణిజ్య బ్యాంకుల్లో కరెన్సీ ఖజానా గది పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డీమానిటైజ్ చేసిన పాత రూ.500, రూ.1000నోట్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో ...కొత్త కరెన్సీ ఖజానా గదులు ఖాళీ లేకపోవడంతో ప్రింటింగ్ ఇండెట్‌ను తగ్గించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయిదేళ్ల కనిష్ట స్థాయికి ప్రింటింగ్ ఆర్డర్లపై ఆర్బీఐకోత పెట్టిందని మింట్ రిపోర్ట్ చేసింది. విశ్వసనీయ వర్గాలకు చెందిన ఇద్దరు ప్రముఖుల ద్వారా ఈ సమాచారం అందినట్టు రిపోర్ట్ చేసింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఇండెంట్ 21 బిలియన్లు ఉండనుందని, ఇది గత ఏడాది 28 బిలియన్లతో పోలిస్తే చాలా తక్కువ అని భావిస్తున్నారు. గత ఐదేళ్లలో బ్యాంకు నోట్ల సగటు వార్షిక ఇండెంట్ 25 బిలియన్లుగా ఉంది. 50-60శాతం రద్దైన నోట్లను ఆర్బీఐకి బదలాయించినప్పటికీ తమ వద్ద చాలా తక్కువ స్థలం ఉందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. పాత రూ.500, 1000నోట్లు కుప్పలుతెప్పలుపేరుకుపోవడం, వీటిని నాశనం చేయడాకంటే ముందు లెక్కింపు పూర్తికావడంతో ఈ పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. ఇండెంట్ తగ్గింపు అనేది ఉత్పత్తి సామర్థ్యాలు, పరిమితులకు లోబడి ఆర్బీఐ సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపు చీఫ్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా చిరిగిపోయిన నోట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అయితే ప్రింటింగ్ ఇండెంట్ కోత నగదు లావాదేవీలపై మరింత భారం పెంచుతుందని చెప్పారు. అయితే ఈ అంచనాలపై వ్యాఖ్యానించేందుకు ఆర్బీఐ నిరాకరించినట్టు తెలుస్తోంది. -
వసూళ్ల రాణి
- ఇండెంట్ల ‘పంచాయతీ’ - డీపీఓ కార్యాలయంలో వసూల్ రాణి - హడలెత్తిపోతోన్న కార్యదర్శులు, గుమస్తాలు - పట్టించుకోని అధికారులు - కొత్త కలెక్టర్ సారూ... దృష్టి సారించండి సాక్షి ప్రతినిధి, కాకినాడ : వెయ్యికి పైనే గ్రామ పంచాయతీలను పర్యవేక్షించే కార్యాలయం అది. ఏడాది కాలంగా ఆ కార్యాలయం ఇన్ఛార్జీల పాలనలో నడుస్తోంది. ఎన్ని కార్యాలయాలకైనా అధికారులను నియమిస్తున్నారు గానీ ఆ కార్యాలయానికి మాత్రం శాశ్వత ప్రాతిపదికన అధికారిని నియమించే సాహసం చేయడం లేదు. ఏజెన్సీలో పనిచేయాల్సిన అధికారి టీవీఎస్‌జీ కుమార్‌ను ఇన్‌ఛార్జి డీపీఓగా గత జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ నియమించారు. అనంతరం ఆ కార్యాలయంలో దిగువ స్థాయిలో పెత్తనం మితిమీరిపోయింది. అలా అని ఆ కార్యాయంలో పనిచేసే అందరినీ ఒకే గాటన కట్టలేం. తానే అంతానంటూ పెత్తనం చెలాయిస్తున్న ఒక అధికారిణితోనే చిక్కంతా వచ్చిపడిందని సహచర ఉద్యోగులు మదనపడుతున్నారు. అందుకే ఆ సీటు వద్దకు వెళ్లాలంటే గ్రామ పంచాయతీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అలా అని వెళ్లకుండా ఉండనూ లేరు. ఎందుకంటే ఆ సీటు విలువ అటువంటిది మరి. పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు, శానిటేషన్ బడ్జెట్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్ల రెన్యువల్ వంటి ఫైళ్లు ఇలా అన్నీ ఆ అధికారిణి చేతుల మీదుగానే క్లియర్ కావాలి. దీంతో సంబంధిత ఫైళ్లు పట్టుకుని ఆమె దగ్గరకు వెళ్లడమా లేదా అనే మీమాంసలో పంచాయతీ కార్యదర్శులు, గుమస్తాలు కొట్టుమిట్టాడుతున్నారు. లంచం టార్గెట్లు నిర్దేశిస్తూ... గడచిన నెల రోజులుగా అపరిమితమైన అధికారాలతో ఆమె వసూల్ రాణి అవతారమెత్తడంతో కార్యాలయ ఉద్యోగులు ఎవరికీ చెప్పుకోలేకున్నారు. ఆ అధికారిణి వద్దకు ఫైళ్లు తీసుకు వెళ్లే పంచాయతీ ఉద్యోగులకు టార్గెట్లను నిర్వేశించమే అసలు సమస్య. అది కూడా తన బంధువు పేరుతో నిర్మిస్తున్న ఇంటికి మెటీరియల్ సరఫరా చేయాలని ఇస్తున్న మౌఖిక ఆదేశాలు కార్యాలయంలో సహచర ఉద్యోగులకు మింగుడు పడడం లేదు. అలా అని బయటపడి ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తన వద్దకు ఫైళ్లతో వచ్చే పంచాయతీ కార్యాదర్శులు, గుమస్తాలకు తలో పాతిక, రూ.50 వేలు, రూ.లక్ష ఇలా ఇండెంట్ వేస్తున్నారు. గడచిన నెల రోజులుగా ఈ తతంగమంతా డీపీఓ కార్యాలయం కేంద్రంగానే నడుస్తోంది. ఆ ఇంటి నిర్మాణానికి వసూల్ రాణి లక్ష్యంగా రూ.20 లక్షలు పెట్టుకుని దందా ప్రారంభించారని ఆ కార్యాలయంలో సిబ్బంది కోడై కూస్తున్నారు. మేజర్ పంచాయతీలపై దృష్టి.. ఆదాయంలేని చిన్నా, చితకా గ్రామ పంచాయతీలపై మాత్రం కాస్తా దయతలిచి విడిచిపెట్టేశారు. జిల్లా వ్యాప్తంగా 1069 గ్రామ పంచాయతీలుండగా, నోటిఫైడ్ పంచాయతీలు 240 వరకూ ఉన్నాయి. ప్రధానంగా ఈ 240 గ్రామ పంచాయతీలే లక్ష్యంగా గడచిన నెల రోజులుగా వసూళ్ల పర్వం నడుస్తోంది. ఇంటి నిర్మాణానికి ఇనుము, ఇసుక, ఇటుక...ఇలా మెటీరియల్ పలు నోటిఫైడ్ గ్రామ పంచాయతీల కార్యదర్శులపై ‘భారం’ వేసినట్టు జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. కోనసీమ ముఖద్వారంలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శికి రూ.50 వేలు ఇండెంట్ వేస్తే అంత ఇచ్చుకోలేమని రూ.20వేలు అని నాన్చడంతో ఆ కార్యదర్శిపై విరుచుకుపడ్డారని తెలిసింది. లేదంటే నాలుగు లారీల ఇసుక పంపించాలని హుకుం జారీ చేశారని సమాచారం. అదే సీమలో మరో నోటిఫైడ్ పంచాయతీకి రూ.30 వేలు, కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ఒక మేజర్ పంచాయతీకి రూ.75 వేలు వాటాగా వేశారంటున్నారు. వీరిలో ఇద్దరు కార్యదర్శులు రూ.20 వేలు మించి ఇవ్వలేమని చేతులెత్తేయడంతో కొన్నాళ్లు ఫైళ్లు తొక్కిపెట్టేసి చివరకు తిప్పి పంపేశారని తెలిసింది. నెల రోజులుగా ఇదే తంతు... నెల రోజులుగా నడుస్తున్న ఈ బాగోతంతో బెంబేలెత్తిపోయిన కార్యదర్శులు కాకినాడ రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. లేదంటే తమ కింద పనిచేసే గుమస్తాలను పంపిస్తున్నారు.ఆ క్రమంలో గుమస్తాలు తీసుకువచ్చిన ఫైళ్లు పక్కనబెట్టేసి కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో మెజార్టీ గ్రామ పంచాయతీల్లో ఎన్ఎమ్ఆర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి జీతాలు విడుదల డీపీఓ కార్యాలయం దయతలచాల్సిందే. వీరి వేతనాల బిల్లులు, శానిటేషన్ బిల్లులను డీపీఓ కార్యాలయం నుంచే మంజూరు చేయాలి. శాశ్వత డీపీఓ లేకపోవడంతో చక్రం తిప్పే అవకాశం ఆయాచితంగా లభించడంతో ఎంతకైనా ఈమె బరితెగిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పలు ఆరోపణలపై సస్పెన్షన్ వేటు కూడా ఆమెపై పడింది. ‘ఫిర్యాదు రాలేదు..వస్తే చర్యలు తప్పవు’ కార్యాలయంలో ఇలా వసూళ్ల దందా నడుస్తున్నట్టు ఇంతవరకు నా దృష్టికి రాలేదు. వసూళ్ల టార్గెట్ల వ్యవహారం మీరు చెబితేనే వింటున్నా. ఫిర్యాదులేమైనా వస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. టీవీఎస్జి కుమార్, ఇన్చార్జి డీపీఒ.కాకినాడ