టీ, స్నాక్స్‌కు రూ. 69 లక్షలు ఖర్చుపెట్టిన సీఎం  | CM Trivendra Singh Rawat spent Rs 68.59 lakh on tea, snacks, reveals RTI | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 6 2018 2:51 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

 CM Trivendra Singh Rawat spent Rs 68.59 lakh on tea, snacks, reveals RTI - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

డెహ్రాడున్‌ : అతిథులకు ఇచ్చే టీ, స్నాక్స్‌ కోసం ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సుమారు రూ.69 లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం( ఆర్‌టీఐ) దరఖాస్తు ద్వారా వెల్లడైంది. త్రివేంద్ర సింగ్‌ సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 నెలల కాలంలో అతిథులకు స్నాక్స్‌, టీ కోసం ఎంత ఖర్చైందో తెలియజేయాలని ఆర్‌టీఐ చట్టం కింద హేమంత్‌ సింగ్‌ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. త్రివేంద్ర సింగ్‌ గత ఏడాది మార్చి 18న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అప్పటి నుంచి అతిథులకు టీ, స్నాక్స్‌ కోసం రూ. 68,59,685 లు ఖర్చైనట్లు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఈ డబ్బును మంత్రులు, ప్రభుత్వ అధికారులు, అతిథుల సమావేశాల్లో ఇచ్చే టీ, స్నాక్స్‌కు  సైతం ఖర్చు చేశారని ఆర్‌టీఐ అధికారి పేర్కొన్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో మంత్రులకు టీ, స్నాక్స్‌ కోసం సుమారు రూ.9కోట్లు ఖర్చుపెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement