రూ.2 వేల నోటు : ఓ షాకింగ్‌ న్యూస్‌ | Not a single Rs 2,000 note printed in FY20 so far: Report | Sakshi
Sakshi News home page

రూ.2 వేల నోటు : ఓ షాకింగ్‌ న్యూస్‌

Published Tue, Oct 15 2019 8:26 PM | Last Updated on Tue, Oct 15 2019 8:37 PM

Not a single Rs 2,000 note printed in FY20 so far: Report - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీలో అధిక విలువ కలిగిన రూ.2 వేల నోటు ముద్రణను కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిలిపివేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదట. ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ప్రశ్నకు ప్రతిస్పందనగా 2020 ఆర్థిక సంవత్సరంలో రూ .2,000 విలువ కలిగిన కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించలేదని ఆర్‌బీఐ తెలిపింది.  ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో 6 కోట్ల రూపాయల అక్రమ నగదును స్వాధీనం  చేసుకున్న నేపథ్యంలో బ్లాక్‌మనీని అరికట్టేందుకు ఈ చర్య  చేపట్టింది.

ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు ఎన్ని ముద్రణ అయ్యాయంటూ  ఓ దినపత్రిక అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్టీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. నల్లధనాన్ని అడ్డుకట్ట వేసేందుకు రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపి వేసినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఆర్‌టీఐ సమాచారం ప్రకారం 2017లో  రూ .2 వేల కరెన్సీ నోట్లను 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. 2018లో 111.507 మిలియన్ నోట్లు మాత్రమే ముద్రించింది. అయితే 2019లో ఈ సంఖ్య మరింత దిగజారి సగానికి పైగా పడిపోయి, 46.690 మిలియన్ల రూ.2వేల నోట్లను మాత్రమే తీసుకొచ్చింది. కాగా 2016 నవంబర్‌లో మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను  అనూహ్యంగా రద్దు చేసింది.  ఆ తరువాత రూ.2 వేల నోటును  చలామణిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement