ప్రొఫెసర్ల సహజీవనంపై ఆర్టీఐ దరఖాస్తు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రొఫెసర్ల సహజీవనంపై వారి అభిప్రాయాలు చెప్పాలంటూ ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కేంద్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేశాడు. వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న తన సవతి సోదరి భర్త... సహచర ప్రొఫెసర్‌తో సహజీవనం చేస్తున్నాడని, ఈ విషయమై విచారణ చేపట్టారా అని ప్రశ్నించాడు.
తన సోదరి, ఆమె భర్త, సహజీవనం చేస్తున్న ప్రొఫెసర్ అభిప్రాయాలు చెప్పాలని కోరాడు. భర్త నుంచి విడిపోయానని, తమ వ్యక్తిగత సమాచారం కోసం సోదరుడు ప్రయత్నిస్తున్నాడంటూ అతని సోదరి అభ్యంతరం తెలిపింది. వ్యక్తిగత ఆరోపణలు, సమాచారం కోరే హక్కులేదంటూ దరఖాస్తుదారుడికి సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు సమాధానం పంపారు.