న్యూఢిల్లీ: అధికారుల తిరస్కరణకు గురవుతున్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2013–14లో 60,127 తిరస్కరణకు గురికాగా, 2015–16లో వాటిసంఖ్య 64,666కు పెరిగింది. ఈ వివరాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం దాఖలైన దరఖాస్తులన్నింటికీ కావాల్సిన పూర్తి సమాచారాన్ని నిర్ణీత సమయం లోపల అందజేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే కేంద్ర సమాచార కమిషన్‌లో 12 ఖాళీలు ఉన్నట్లు వాటిని త్వరలో భర్తీ చేస్తామని కూడా ఆయన తెలిపారు.
పెరుగుతున్న ‘ఆర్టీఐ’ తిరస్కరణలు
Published Fri, Apr 7 2017 3:56 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
Advertisement