ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 10 వేలు దాటేసింది. ఇప్పటివరకు 11,506 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మొత్తం 485 మంది మరణించారు.తాజాగా నాందేడ్‌లోని హజుర్ సాహిబ్ గురుద్వారాలో 20 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 97 మంది శాంపిల్స్‌ని పరీక్షలకు పంపించగా 20 మందికి కరోనా వైరస్ పాటిజివ్ నిర్ధారణ అయిందని నాందేడ్ ఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. 25 మందికి నెగెటివ్ వచ్చిందన్నారు. మరో 41 మంది ఫలితాల త్వరలోనే రానున్నాయని పేర్కొన్నారు.
(చదవండి : కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం)
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 20 మంది మహారాష్ట్ర వాసులేనని స్పష్టం చేశారు. నాందేడ్ హుజూర్ సాహిబ్ గురుద్వారాను అధికారులు శుక్రవారం మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ గురుద్వారాను దర్శించుకుని పంజాబ్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్న భక్తుల్లో 296 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment