ప్రతి ప్రభుత్వ పథకానికీ కీలకంగా మారిన ఆధార్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి కేటాయింపులు పెంచింది. 2015-16 బడ్జెట్‌లో ఆధార్ ప్రాజెక్టుకు రూ. 2,039.64 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే ఈసారి ఆధార్‌కు కేటాయింపులు 23.63 శాతం పెరిగాయి. 2013-14లో ఆధార్ ప్రాజెక్టుకు రూ. 1,550 కోట్లు కేటాయించగా.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,617.73 కోట్లు కేటాయించారు.