‘అడాగ్’లో నా పాత్ర లేదు.. గృహిణిని మాత్రమే: టీనా అంబానీ | 2G case: Tina Ambani tells court 'not actively involved in the business' | Sakshi
Sakshi News home page

‘అడాగ్’లో నా పాత్ర లేదు.. గృహిణిని మాత్రమే: టీనా అంబానీ

Published Sat, Aug 24 2013 6:49 AM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

‘అడాగ్’లో నా పాత్ర లేదు..  గృహిణిని మాత్రమే: టీనా అంబానీ - Sakshi

‘అడాగ్’లో నా పాత్ర లేదు.. గృహిణిని మాత్రమే: టీనా అంబానీ

న్యూఢిల్లీ: 2జీ సెక్ట్రం కుంభకోణంలో కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టిన మరో సాక్షి , అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కూడా కేసుకు వ్యతిరేకంగానే వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త సారథ్యం వహిస్తున్న రిలయన్స్ అడాగ్ (అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్) వ్యవహారాల్లో తనకెలాంటి పాత్ర లేదని ఆమె ప్రత్యేక కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ కేసులో గురువారం ప్రత్యేక కోర్టులో సీబీఐ సాక్షిగా హాజరైన అనిల్ అంబానీ... తన గ్రూప్‌లో ఏయే కంపెనీలున్నాయో గుర్తు లేదంటూ వాం గ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

శుక్రవారం కోర్టుకు హాజరైన టీనా అం బానీ కూడా అడాగ్‌లో ఏ కంపెనీతోనూ తనకు సంబంధం లేదని, 2008లో టెలికం స్పెక్ట్రం లెసైన్స్ దక్కించుకున్న కంపెనీల్లో ఒకటైన స్వాన్ టెలికం సంస్థ గురించి తనకేమీ తెలియదని చెప్పారు. తానో గృహిణినని, ఓ సామాజిక కార్యకర్తగా ఆసుపత్రి మాత్రం నిర్వహిస్తున్నానని వాంగ్మూలమి చ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement