దయాళ్ అమ్మాళ్కు బెయిల్ మంజూరు | 2G money laundering case: cbi court grants bail to Dayalu Ammal | Sakshi
Sakshi News home page

దయాళ్ అమ్మాళ్కు బెయిల్ మంజూరు

Published Wed, Aug 20 2014 1:25 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

2G money laundering case: cbi court grants bail to Dayalu Ammal

న్యూఢిల్లీ :  2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాళ్కు ఊరట లభించింది. ఢిల్లీ పటియాలా కోర్టు ఆమెకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ ప్రత్యేక జడ్జి ఓ.పీ. షైనీ ఈ మేరకు  బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. రూ.5లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు.. ఇద్దరి పూచీకత్తుపై బెయిల్‌కు అంగీకరించింది.

రెండు రోజుల్లో బెయిల్ బాండ్ పనులు పూర్తి చేయాలని కోర్టు ఈ సందర్భంగా దయాల్ అమ్మళ్కు సూచించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో తొమ్మిది మంది బెయిల్‌ పిటిషన్లపై మాత్రం తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌లో పెట్టింది. కేంద్ర మాజీ టెలికాం మంత్రి,  డీఎంకే నేత  రాజా డీబీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు అక్రమంగా స్పెక్ట్రమ్ లైసెన్స్‌లు కేటాయించినందుకుగాను....డీఎంకే పార్టీకి చెందిన కళైంగర్‌ టీవీకి  200 కోట్లు పెట్టుబడుల రూపంలో ముట్టాయని ఈడీ  పేర్కొంది. మొత్తం 19 మందిని దోషులుగా పేర్కొంటూ ఈడీ కోర్టుకు చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement