శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భారత సైనికులు ఆదివారం మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు భారత సైనికులు మరణించినట్లు రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా ధృవీకరించారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో అక్రమంగా చొరబడ్డ ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్‌ను భారత సైన్యం చేపట్టింది. రెండు రోజుల క్రితం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్లు కల్నల్ రాజేశ్ కలియా ప్రకటించారు.
అయితే దురదష్టవశాత్తూ ఈ ఆపరేషన్‌లో పలువురు భారత సైనికులు గాయాలపాలు కాగా ముగ్గురు సైనికులు అమరవీరులయ్యారని తెలిపారు. శనివారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు స్పష్టం చేశారు. వీరు ఏప్రిల్ 4న అమాయక పౌరులను పొట్టనపెట్టుకున్నారని తెలిపారు. కాగా ఉగ్రవాదులను ఏరివేసే ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. మొత్తంగా ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు తొమ్మిదిమంది ఉగ్రవాదులు మరణించారు. (లాక్‌డౌన్: మహిళను కాల్చి చంపిన జవాను!)
Comments
Please login to add a commentAdd a comment