Line of Control Jammu and Kashmir
-
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
కొనసాగుతున్న ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాటుకి యత్నించిన ఉగ్రవాదుల్ని కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా మట్టుబెట్టాయి. గురువారం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. సరిహద్దు వెంట చొరబాటు కార్యకలాపాల నియంత్రణకు సైన్యం, జమ్ము పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది. కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్లో ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు.. ఆపై కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయినట్లు జమ్ముకశ్మీర్ అదనపు డీజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందన్నారాయన. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు నిరోధక ఆపరేషన్లలో పోలీసు బలగాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టారు. కశ్మీర్‌కు చెందిన పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్లో బుధవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది 46 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. వారిలో 37మంది పాకిస్థానీలు కాగా.. తొమ్మిది మంది స్థానికంగా ఉన్నవారేనని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత 33 ఏళ్లలో స్థానిక ఉగ్రవాదుల కన్నా.. విదేశీ ఉగ్రవాదులు అత్యధిక సంఖ్యలో హతం కావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. -
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్‌కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్‌హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
కుప్వారాలో ఉగ్రవాదుల ఏరివేత
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భారత సైనికులు ఆదివారం మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు భారత సైనికులు మరణించినట్లు రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా ధృవీకరించారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో అక్రమంగా చొరబడ్డ ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్‌ను భారత సైన్యం చేపట్టింది. రెండు రోజుల క్రితం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్లు కల్నల్ రాజేశ్ కలియా ప్రకటించారు. అయితే దురదష్టవశాత్తూ ఈ ఆపరేషన్‌లో పలువురు భారత సైనికులు గాయాలపాలు కాగా ముగ్గురు సైనికులు అమరవీరులయ్యారని తెలిపారు. శనివారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు స్పష్టం చేశారు. వీరు ఏప్రిల్ 4న అమాయక పౌరులను పొట్టనపెట్టుకున్నారని తెలిపారు. కాగా ఉగ్రవాదులను ఏరివేసే ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. మొత్తంగా ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు తొమ్మిదిమంది ఉగ్రవాదులు మరణించారు. (లాక్డౌన్: మహిళను కాల్చి చంపిన జవాను!) -
పాక్ సైన్యం పైశాచికం.. చంపాక ముక్కలుగా నరికారు!
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో నలుగురు భారత సైన్య సిబ్బందిని పాక్ సైన్యం బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిని చంపాక చేసిన పైశాచిక చేష్టల గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయాలతో బయటపడ్డ మరో జవాన్ అందించిన వివరాల ప్రకారం వర్ణించలేని రీతిలో వారిని పాక్ ఆర్మీ హింసించిందంట. నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టరు వద్ద నలుగురు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతలో ఊహించని రీతిలో పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) వారివైపు దూసుకొచ్చింది. వారి వెంట కొందరు ఉగ్రవాదులు కూడా ఉన్నారంట. సుమారు 400 మీటర్ల సరిహద్దు దాటేసిన పాక్ సైన్యం వారిని బంధీలుగా చేసుకుంది. ఆపై చిత్ర హింసలకు గురి చేసి హతమార్చింది. ఇక వారిని చంపాక దాష్టీకానికి పాల్పడింది. వారి మృతదేహాలను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లే లక్ష్యంగా వీరు వచ్చారని భారత సైన్యం ప్రకటించింది. మేజర్ మోహకార్ ప్రఫుల్లా అంబాదాస్ (32), లాన్స్ నాయక్ గుర్మెయిల్ సింగ్ (34), లాన్స్ నాయక్ కులదీప్ సింగ్ (30), సిపాయి పర్ గత్ సింగ్ (30)లు పాక్ టీమ్ దుర్మార్గానికి బలయ్యారు. మరో జవాను తీవ్ర గాయాలతో తప్పించుకోగా, అతనికి వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన తరువాత పాక్ సైనిక పోస్టులపై భారత్ భారీ ఎత్తున ప్రతిదాడులకు దిగింది. అంబదాస్ మహారాష్ట్రలోని భందారాకు చెందినవారు కాగా.. గుర్మైల్ కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో, పర్గత్ కుటుంబం హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఉంటోంది. ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు సీఎం మెహబూబా ముఫ్తీ రాజౌరీ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పాక్ కాల్పులు జరపడం గమనార్హం. నా వార్త నిజం కాదు.. ఆర్మీ ప్రకటన... ‘మేజర్ అంబదాస్, లాన్స్‌నాయక్ గుర్మైల్, సిపాయ్ పర్గత్‌లు అసమాన ధైర్యం, నిజాయితీలున్న సైనికులు. విధి నిర్వహణలో వారి అంకితభావానికి, ప్రాణత్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ అని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే వారిని ముక్కలుగా నరికారన్న జవాన్ ప్రకటనను ఆర్మీ ఖండించింది. శరీరంపై బుల్లెట్ల గాయాలు మాత్రమే ఉన్నాయని.. నరికారన్న వార్తలో వాస్తవం లేదని అధికారులు చెబుతుండటం విశేషం. -
ఏడుగురు ఉగ్రవాదులు హతం.. జవాను మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక జవాను వీరమరణం పొందగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా, బందిపోరా, కుప్వారా జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎన్కౌంటర్ జరుగుతోంది. పలువురు ఉగ్రవాదులను భారత సైనికులపై దాడులు చేసేందుకు నియంత్రణ రేఖ వెంబడి ఉండే పాక్ బలగాలు కుట్రలు చేస్తున్నాయని, వాటిని తాము సమర్థంగా విఫలం చేశామని ఉదంపూర్ కు చెందిన కల్నల్ అధికారి ఎన్ఎన్ జోషి చెప్పారు.