ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నాందేడ్‌లోని గురుద్వారలో చిక్కుకుపోయిన సిక్కు భక్తులను మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కు పంపించింది. లాక్‌డౌన్ ప్రకటించడానికన్నా ముందు సుమారు 3000 మంది సిక్కులు ఇక్కడి గురుద్వారలో చిక్కుకుపోయారు. వీరంతా పంజాబ్, హర్యానా, తదితర ప్రదేశాలకు చెందినవారు. ఇప్పటికే లాక్‌డౌన్ వల్ల సుమారు నెలకు పైగా ఇక్కడే ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎలాగైనా తమను స్వస్థలాలకు పంపించాలంటూ అధికారులను వేడుకున్నారు. (న్యూసెన్సే!)
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సైతం వారిని వెనక్కు తీసుకురావడానికి కృషి చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం వారిని స్వస్థలాలకు పంపించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా గురువారం రాత్రి పది వాహనాల్లో 330 మంది సిక్కులను స్వస్థలాలైన పంజాబ్, హర్యానాలకు తరలించింది. మిగతావారిని సైతం తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ముందుగా దీనికోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి అనుమతి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (వెంటాడుతోంది..@30)
Comments
Please login to add a commentAdd a comment