ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో 35 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో 17 రోజులుగా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్సపొందిన వీరు శనివారం డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో 34 మంది ఇండోర్, ఒకరు కర్గొనేకు చెందిన వారున్నారు.
'గత 17 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందాను. అందరూ నాకు అండగా నిలవడం వల్లే తిరిగి కోలుకోగలిగాను. అందరూ ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్యంగా ఉండాలి' అని డిశ్చార్జ్ అయిన కరోనా బాధితురాలు తెలిపారు.
'కరోనా వైరస్‌ను జోక్‌లా తీసుకోకండి. అధికారులు ఇచ్చే ఆదేశాలను తప్పకుండా అందరూపాటించండి. మీకుటుంబంతో కలిసి ఆరోగ్యంగా ఉండండి. నా తొమ్మిదేళ్ల కూతురు ఇంకా కరోనాతో పోరాడుతోంది' అని డిశ్చార్జ్ అయిన మరో కరోనా బాధితుడు తెలిపారు. ఇండోర్‌లో మొత్తం 892 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి డా. ప్రవీణ్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 50 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇక మధ్య ప్రదేశ్‌లో మొత్తం 1310 కేసులు నమోదవ్వగా, 69 మంది డిశ్చార్జ్ అవ్వగా, 69 మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment