సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని వల్లూవర్ కొట్టంలో పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా గురువారం ఆందోళనలో పాల్గొన్న 600 మందిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా నటుడు సిద్ధార్థ్, గాయకుడు టిఎం కృష్ణ, విసికె చీఫ్ థోల్ తిరుమావళవన్, వెల్ఫేర్ పార్టీకి చెందిన మొహమ్మద్ గౌస్ ఇందులో ఉన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 143 కింద నిరసనకారులపై కేసు నమోదైంది.
రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సహా 38 గ్రూపులు నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికి, ఆందోళన చేపట్టినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో పౌరతసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. భీం ఆర్మీ ఆధ్వర్యంలో జామా మసీద్ నుంచి జంతర్ మంతర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. (నిరసన జ్వాలలు: మీకు సెల్యూట్ సార్.. !)
ఢిల్లీలో శుక్రవారం నాటి ఆందోళన
#WATCH Delhi: Protest at Jama Masjid against #CitizenshipAmendmentAct Bhim Army Chief Chandrashekhar Azad also present. Azad had been earlier denied permission for a protest march from Jama Masjid to Jantar Mantar pic.twitter.com/uXK1tvO4CT
— ANI (@ANI) December 20, 2019
Comments
Please login to add a commentAdd a comment