సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 13 దేశాల నుంచి 64 విమానాల ద్వారా భారతీయులను తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా మే 7వ తేది నుంచి 13 వరకు విమాన సర్వీసులను నడపనుంది. బ్రిటన్ నుంచి 7, అమెరికా నుంచి 7 విమానాల ద్వారా భారతీయలను స్వదేశానికి తరలించనుంది. 64 విమానాల ద్వారా దాదాపు 15 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానుంది. అలాగే దీనికి సంబంధించిన ప్రయాణ ఖర్చుల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. (కోవిడ్-19 కట్టడి : కేంద్రం కీలక నిర్ణయం)
అమెరికా నుంచి రూ. లక్ష
బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చేందుకు విమాన ఛార్జీని రూ. 50 వేలుగా, అమెరికా నుంచి భారత్‌కు వచ్చే విమాన ఛార్జీని రూ. లక్షగా నిర్ణయించారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే విదేశీ విమానాలను దేశంలోకి అనుమతించ లేదు. దీంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయూలు స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. తాజాగా వీరిని భారత్‌కు తీసుకురావాలని కేంద్ర నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చిన వారిని 15 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంచాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ వివరాలను వెల్లడించారు. (లాక్‌డౌన్: 14,800 మంది భారత్‌కు)
వివిధ దేశాలకు నడిపే సర్వీసులు..
- యూఏఈ- 10 విమానాలు
- ఖతార్-2
- సౌదీ అరేబియా-5
- బ్రిటన్-7
- అమెరికా-7
- సింగపూర్-5
- బంగ్లాదేశ్-7
- బెహరైన్-2
- మలేషియా-7
- కువైట్-5
- ఒమన్- 2
కూలీల ఖర్చులు రాష్ట్రాలే..
ఇక ఉపాధి నిమిత్తం దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన కూలీలను సైతం తరలిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. కూలీల తరలింపు ఖర్చును రాష్ట్రాలే భరిస్తాయని అన్నారు. గుజరాత్‌లో 21,500 మంది కూలీలు చిక్కుకున్నారని, 18 రైళ్లలో వీరందరిని స్వస్థలాలకు తరలిస్తామని లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న కూలీల వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
విమాన సర్వీసుల పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మరికొన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment