శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో వరద ఉధృత రూపం దాలుస్తోంది. బుద్గాం జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.జీలం నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలో , సంగం, బతిండా, శ్రీనగర్ తదితర ప్రాంతాలో జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. సహాయ సామగ్రితో కూడిన హెలికాప్టర్ కాశ్మీర్కు చేరినట్టు సమాచారం.
మరోవైపు జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర అబ్దుల్లా వరదలు రాష్ట్రాన్ని మరోసారి ముంచెత్తడంపై విచారం వ్యక్తంచేశారు. ప్రజలకు సరైన సమాచారం అందడం లేదని ఆరోపించారు. ఆరునెలల క్రితం వరదల కారణంగా నష్టపోయిన ప్రజల పునరావాసంకోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సహాయక చర్యల్ని ఆలస్యం చేస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గత వరదల సందర్భంగా నష్టపోయిన ఆసుపత్రుల పునరుద్ధరణ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కశ్మీర్ వరదల్లో 8మంది మృతి
Published Mon, Mar 30 2015 1:05 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM
Advertisement
Advertisement