house collapse
-
TG: మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్: మట్టిమిద్ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని వనపట్లలో చోటు చేసుకుంది. వర్షం కారణంగా తడిచిన మట్టి ఇంటి మిద్దె, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. నిద్రిస్తున్న ఆ కుటుంబం మీద పడ్డాయి. ఘటనలో గొడుగు పద్మ (26), ఆమె ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , కొడుకు (10) నెలలు విక్కీ కన్నుమూశారు. తండ్రి భాస్కర్(28)కు గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లాస్పత్రికి తరలించారు. ముగ్గురు బిడ్డలతో తల్లి ఊహించిన ప్రమాదంలో చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పేలిన గ్యాస్ సిలిండర్.. కుప్పకూలిన అయిదు ఇళ్లు
మహారాష్ట్ర రాజధానిలో ముంబైలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. చంబూరులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అయిదు ఇళ్లు కూలిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకైన సందులో ఉండటంతో శిథిలాల కింద అనేకమంది నివాసితులు చిక్కుకుపోయారు. గోల్ఫ్ క్లబ్ సమీపంలోని ఓల్డ్ బారక్‌లో ఉదయం 8 గంటలకు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి నాలుగైదు అంతస్తుల భవనాలు కుప్పకూలిపోయాయి. ధ్వంసమైన ఇళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో మెట్లు సగం కూలిపోయి, బాల్కనీలు గాలిలో వేలాడుతూ కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ప్రమాద తీవ్రత కళ్లకు అద్దం పడుతోంది. Mumbai: An incident of a house collapse due to a cylinder blast has been reported in the Chembur area of Mumbai, four people sustained injuries and have been sent to a nearby hospital. 11 people have been rescued safely, so far: BMC pic.twitter.com/kOtWmq1vaT— ANI (@ANI) November 29, 2023 అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఇప్పటి వరకు భవనాల శిథిలాల నుంచి 11 మందిని రక్షించారు. వీరిలో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అగ్నిమాపక దళం, పోలీసులు మరియు అంబులెన్స్ సేవలు ప్రమాద స్థలంలో ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు వారాల క్రితం ముబైలోని బాంద్రాలో గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగి ఎనిమిది మంది గాయపడిన విషయం విదితమే. గాయపడిన వారిలో చాలా మందికి 35 నుండి 40 శాతం వరకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఎల్పీజీ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని ముంబై అగ్నిమాపక దళం అధికారులు తెలిపారు. చదవండి: ఎంత ఘోరం.. గాజు డోర్ మీద పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి -
నరకయాతన
అనంతపురం, మడకశిర: మడకశిర పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో పాత ఇళ్ల కూల్చివేత సందర్భంగా కూలీపైకి గోడ కూలబడింది. శిథిలాల మధ్యన ఇరుక్కుపోయిన కూలీ దాదాపు మూడు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు శ్రమించి ఎట్టకేలకు అతడిని రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. అంబేద్కర్ సర్కిల్లో బుధవారం పాత భవనాల కూల్చివేత పనులకు కొందరు కూలీలు ఉపక్రమించారు. డ్రిల్లింగ్ మిషన్, సుత్తిల ద్వారా భవనాన్ని బద్దలుకొడుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మెట్లపై ఉండి పని చేస్తున్న గుడిబండ మండలం ఎస్ఎస్ గుండ్లు గ్రామానికి చెందిన నాగప్ప అనే కూలీపైకి ఒక్కసారిగా పైకప్పు పడింది. మధ్యలో ఇరుక్కుపోయిన నాగప్ప ఎటూ రాలేని పరిస్థితి. ఓ వైపు భారీ బరువు ధాటికి నొప్పితో విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేశాడు. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. జేసీబీలు, క్రేన్లు తెప్పించి తోటికూలీల సహకారంతో శిథిలాల తొలగింపు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 తర్వాత నాగప్పను సజీవంగా బయటకు తీసుకొచ్చారు. కాళ్లు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆయన్ను హిందూపురం తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారని ఎస్ఐ గోపీయాదవ్ తెలిపారు. -
విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేత
-
ఇల్లు కూలి నలుగురి మృతి
ఉత్తరప్రదేశ్: ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నానిన ఇల్లు ఒక్కసారిగా కూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
కూలిన పెంకుటిల్లు..ఒకరి మృతి
-
కూలిన పెంకుటిల్లు..ఒకరి మృతి
కనిగిరి(ప్రకాశం జిల్లా): కనిగిరి మండలకేంద్రంలోని ఎనిమిదవ వార్డులో ఓ పెంకుటిల్లు బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఖైరూన్ బీ(60) అనే వృద్ధురాలు మృతిచెందగా.. ఆమె మనవరాలు హసీనాకు తీవ్రగాయాలయ్యాయి. హసీనాను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి బాగా నాని కూలి ఉంటుందని భావిస్తున్నారు. -
రామాంతపూర్‌లో గోడ కూలి చిన్నారి మృతి
-
మధ్యప్రదేశ్‌లో ఇల్లు కూలి ఏడుగురు మృతి
-
ఢిల్లీలో కూలిన ఇల్లు ముగ్గురు మృతి
-
సెల్‌ఫోన్ పేలితే ఇల్లు కూలుతుందా...?
మదనపల్లి: సెల్‌ఫోన్ పేలితే ఇల్లు కూలుతుందా... అని మదనపల్లె పట్టణంతోపాటు జిల్లా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలోని గౌతమినగర్‌లో అన్నపూర్ణ ఇంటిలో ఆదివారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఇల్లు కూలిపోయి అన్నపూర్ణ మామ సుబ్రమణ్యం మృతి చెందాడు. సెల్ ఫోన్ పేలడంతోనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రజలు మాత్రం ఈ పేలుడుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏమి జరిగింది, గ్యాస్ సిలిండర్ పేలలేదు... షార్ట్ సర్క్యూట్ జరగడానికి కరెంటు మీటర్ బాగానే ఉంది. బాంబులు వేసినట్టు ఆనవాళ్లు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరి అంత పేలుడు ఎలా సంభవించిందన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. సోమవారం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గోడ శిథిలాలను తొలగించి పేలుడుకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. బాంబులు వేయడం వల్లే గోడ కూలిందా...? లేక ఆ ప్రదేశంలో ఇంటికి అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించేందుకు ఇంటిలో ఉంచిన మందు పదార్ధాలు పేలాయా? సుబ్రమణ్యం మాంత్రికుడు కావడంతో ఎవరైనా దుండగులు ఈ దురాగాతానికి పాల్పడ్డారా ? అన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కూలిపోయిన ఇంటిలో నాలుగేళ్ల క్రితం చనిపోయిన సుబ్రమణ్యం చిన్న కుమారుడు మంజుబాబు భార్య ఒక్కతే కాపురం ఉంటోంది. ఆమె కూడా రోజువారి కూలి పనులకు వెళ్తోంది. ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. -
గోడ కూలి తల్లీకూతుళ్ల మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం బుడ్డిప గ్రామంలో గోడ కూలి తల్లీకూతుళ్లు మృత్యువాతపడ్డారు. గ్రామంలో వందేళ్ల కింద నిర్మించిన ఓ ఇంటికి చెందిన గోడ ఆదివారం ఉదయం కూలింది. ఆ పక్కనే ఉన్న ఇంటి ప్రహరీ మీద పడిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్.లక్ష్మి(30), ఆమె ఆరేళ్ల కుమార్తె అమ్మాజీపై శిధిలాలు పడిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. -
ఇంటి పైకప్పు కూలి ఐదుగురు మృతి
డెహ్రాడూన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో ఓ ఇంటి పై కప్పు కూలిపోయి ఐదుగురు మృతిచెందారు. ఒకరు గాయాలపాలయ్యారు. చనిపోయిన ఐదుగురు అదే ఇంటి వారు కావడంతో తీవ్ర విషాదం అలుముకుంది. రాష్ట్రంలోని పౌరి జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలోని మేరా అనే గ్రామంలో ఓ కుటుంబీకులంతా తమ ఇంట్లో గాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా అర్థరాత్రి ఆ ఇంటి పైకప్పు కూలి మీదపడింది. చనిపోయిన వారిలో ఇంటి యజమాని ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు మరొకరు చనిపోగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. -
ఇల్లు కూలి చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలోని ఫగూర గ్రామంలో గురువారం అర్థరాత్రి ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో ఏడాది వయస్సు గల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. శిథిలాల కింద నుంచి చిన్నారి మృతదేహం వెలికి తీసినట్లు పోలీసులు చెప్పారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. -
ఇల్లు కూలి ఇద్దరు సజీవ సమాధి
ములుగు (మెదక్): రోడ్డు విస్తరణ పనులు ఇద్దర్ని బలితీసుకున్నాయి. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడిలో ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుతుండగా... ఓ ఇల్లు ముందు భాగం కూలిపోవడంతో ఆ ఇంటి యజమాని, అతని కూతురు సజీవ సమాధి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. ఎండీ గౌస్‌మియా, అతని కూతురు జలాల్ రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్న ఇంట్లో కిరాణ షాపు నడుపుకుంటూ అందులోనే నివసిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ముందు కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉంది. దీంతో ముందు భాగంలో ఉన్న సామాగ్రిని గౌస్‌మియా, జలాల్ తీస్తున్నారు. ఇంతలోనే జేసీబీ డ్రైవర్ వాహనాన్ని ఇంటికి తగిలించడంతో ఆ ఇల్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. గౌస్‌మియా, జలాల్పై శిధిలాలు పడిపోవడంతో వారు అక్కడే ప్రాణాలు విడిచారు. -
కాశ్మీర్ లో జలప్రళయం
-
కశ్మీర్ వరదల్లో 8మంది మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో వరద ఉధృత రూపం దాలుస్తోంది. బుద్గాం జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.జీలం నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలో , సంగం, బతిండా, శ్రీనగర్ తదితర ప్రాంతాలో జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. సహాయ సామగ్రితో కూడిన హెలికాప్టర్ కాశ్మీర్‌కు చేరినట్టు సమాచారం. మరోవైపు జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర అబ్దుల్లా వరదలు రాష్ట్రాన్ని మరోసారి ముంచెత్తడంపై విచారం వ్యక్తంచేశారు. ప్రజలకు సరైన సమాచారం అందడం లేదని ఆరోపించారు. ఆరునెలల క్రితం వరదల కారణంగా నష్టపోయిన ప్రజల పునరావాసంకోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సహాయక చర్యల్ని ఆలస్యం చేస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గత వరదల సందర్భంగా నష్టపోయిన ఆసుపత్రుల పునరుద్ధరణ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
గూడు చెదిరి... నీడ కరువై..
కూలిన ఇళ్లలో కాలం వెళ్ల దీస్తున్న బాధితులు పట్టించుకోని అధికారులు అష్టకష్టాలు పడుతున్న నిరాశ్రయులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘వేలాది ఇళ్లకు నష్టం జరిగిందంటున్నారు. వారంతా నిరాశ్రయులై ఉంటారు. తాత్కాలిక పునరావాసమేదైనా కల్పించారా..?’ ఇటీవల తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అధికారులకు అడిగిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు ఇప్పటికీ అధికారులు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. తుపాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారిలో చాలా మందికి నేటికీ నిలువ నీడ లేదు. వారెలా ఉంటున్నారో? ఎక్కడ తలదాచుకుంటున్నారో ఆరా తీసిననాథుడే కనిపించడం లేదు. దీనికి తోడుకూలిపోయిన ఇళ్ల ఎన్యుమరేషన్ కూడా సరిగా చేయడం లేదు. ఇప్పుడనేక మంది కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. హుదూద్ తుపాను బీభత్సంతో మొత్తం15,303 ఇళ్లకు నష్టం జరిగినట్టు అధికారికంగా గుర్తించారు. అధికారుల దృష్టికి రాని, రాజకీయఒత్తిళ్లతో ఎన్యుమరేషన్ చేయనివి ఇంకెన్ని ఉన్నాయో విస్మరించిన వారికే తెలియాలి. గుర్తించిన వివరాలిలా ఉన్నాయి. 15 పక్కా ఇళ్లు, 301 కచ్చా ఇళ్లు పూర్తిగా కూలిపోగా,91పక్కా ఇళ్లు, 713 కచ్చా ఇళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇక 296పక్కా ఇళ్లు, 6611 కచ్చా ఇళ్లు, 7276 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటినే ప్రభుత్వానికి నివేదించారు. పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారికి, తీవ్రంగాఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రత్యామ్నాయ ఏరచేయాలి. ముఖ్యంగా ఎక్కడో ఒక చోట దలదాచుకునే విధంగా పునరావాసం కల్పించాలి. కానీ జిల్లాలో అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆదేశాలు కూడా అమలు కాలేదు. దీంతో ఇళ్లు దెబ్బతిన్న నిరాశ్రయుల్లో కొంతమంది ఆర బయటే గడుపుతుండగా, మరికొంతమంది పరార పంచాన తలదాచుకుంటున్నారు. ఇంకొ కొంతమంది కూలిన ఇళ్లల్లోనే గోడలమాటున కాలంవెళ్లదీస్తున్నారు. ఉన్న గోడలుకూడా అనుకోకుండా కూలిపోత నివాసితుల ప్రాణాలకు ప్రమాదంవాటిల్లే అవకాశంఉం.సాధారణంగా ఇళ్లల్లో ఉన్న వారిని అప్రమత్తం చేసి, వేరొక చోటకి తరలించే ప్రయత్నంచేయాలి. కానీ ఆ దిశగా అధికారలు ఆలోచనే చేయడంలేదు. ఒక్క రోజు... వారి జీవితాలు తల్లకిందులైపోయాయి. ఒకే ఒక్క రోజు వారి బతుకులు నిట్టనిలువునా కూలిపోయాయి. హుదూద్ సృష్టించిన విలయానికి వారంతా గూడు చెదిరిన పక్షుల్లా మారారు. మంచి తిండి తినక, మంచి బట్ట కట్టుకోక కాసిన్ని డబ్బులు మిగిల్చి కట్టుకున్న ఇళ్లు గాలివానకు నేలకూలడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తుపాను వెళ్లిపోయి ఇన్ని రోజులవుతున్నా వారి కన్నీటి ధారలు ఆగడం లేదు. పునరావాసం కల్పిస్తామని చెప్పిన అధికారులు పత్తా లేకుండా పోతున్నారు. అధికార పార్టీ నేతలు స్వోత్కర్షకు, ఓదార్పులకే పరిమితమవుతున్నారు. -
కుటుంబం సజీవ దహనానికి యత్నం
-
ఇల్లు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వీపనగండ్ల మండలం కొప్పునూరులో మట్టితో నిర్మించిన ఇల్లు కూలి పోయింది. దాంతో ఇంట్లో నిద్రిస్తున్న భార్యభర్తలపై మట్టి పెళ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో భార్త మృతి చెందాడు. భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి తీవ్రగాయాలపాలైన ఆమెను వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వకి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
వర్షానికి కూలిన మిద్దె,దంపతులు మృతి
-
జమ్మూలో వరదలు: 8 మంది మృతి
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలో వరద పోటెత్తింది. ఆ వరదల కారణంగా శుక్రవారం 8 మంది మృతి చెందారని ఉన్నతాధికారులు శనివారం జమ్మూలో వెల్లడించారు. వారిలో ఐదుగురు ఇళ్లు కూలి మరణించగా, మరో ముగ్గురు నదీ నీటీ ప్రవాహా ఉధృతికి కొట్టుకుపోయారని వివరించారు. అయితే వరద సహాయ చర్యల్లో భాగంగా సైనికాధికారులు వివిధ ప్రాంతాల్లో వరదలలో కొటుకుపోతున్న 80 మందిని రక్షించారని ఉన్నతాధికారులు తెలిపారు. వరదల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిందని ఉన్నతాధికారులు గుర్తు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారి సహయ పునరావాసం అందించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పటు చేసినట్లు వివరించారు. ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు 1500 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడటంతో రైలు, బస్సు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాగా రహదారులపై పడిన కొండ చరియలను తొలగించేందుకు సైనికులు రంగంలోకి దిగారని అధికారులు వివరించారు. జమ్మూ ప్రాంతంలో వచ్చే సోమవారం వరకు ఇలానే వర్షాలు కురుస్తునే ఉంటాయని, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని జమ్మూలోని వాతావరణ శాఖ సూచించింది.