ములుగు (మెదక్): రోడ్డు విస్తరణ పనులు ఇద్దర్ని బలితీసుకున్నాయి. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడిలో ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుతుండగా... ఓ ఇల్లు ముందు భాగం కూలిపోవడంతో ఆ ఇంటి యజమాని, అతని కూతురు సజీవ సమాధి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. ఎండీ గౌస్‌మియా, అతని కూతురు జలాల్ రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్న ఇంట్లో కిరాణ షాపు నడుపుకుంటూ అందులోనే నివసిస్తున్నారు.
రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ముందు కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉంది. దీంతో ముందు భాగంలో ఉన్న సామాగ్రిని గౌస్‌మియా, జలాల్ తీస్తున్నారు. ఇంతలోనే జేసీబీ డ్రైవర్ వాహనాన్ని ఇంటికి తగిలించడంతో ఆ ఇల్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. గౌస్‌మియా, జలాల్‌పై శిధిలాలు పడిపోవడంతో వారు అక్కడే ప్రాణాలు విడిచారు.
ఇల్లు కూలి ఇద్దరు సజీవ సమాధి
Published Wed, Jun 24 2015 12:11 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
Advertisement
Advertisement