death alive
-
ఢిల్లీ హోటల్లో మంటలు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవంతి నుంచి దూకి మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఉద్యోగి కూడా ఉన్నారు. మరో 35 మందికి గాయాలపాలయ్యారు. సెంట్రల్ ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని నాలుగంతస్తుల అర్పిత్ ప్యాలెస్ హోటల్లో మంగళవారం వేకువజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హోటల్లో 53 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందరూ గాఢ నిద్రలో ఉండటంతో మంటల నుంచి తప్పించుకోవడం కష్టమైందని, అత్యవసర ద్వారం బయటి నుంచి మూసేసి ఉందన్నారు. హోటల్లో కర్రతో చేసిన ఫర్నీచర్ ఎక్కువ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు భావిస్తున్నారు. హోటల్ జనరల్ మేనేజర్‌తో పాటు మరో ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆప్ సర్కారు తన నాలుగో వార్షికోత్సవాన్ని రద్దుచేసుకుంది. ఊపిరాడకే ఎక్కువ ప్రాణనష్టం.. అర్పిత్ ప్యాలెస్ హోటల్ మొదటి అంతస్తులో మొదలైన మంటలు వేగంగా పైకి ఎగబాకాయి. షార్ట్ సర్క్యూటే నిప్పును రాజేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు వేగంగా విస్తరించడంతో నిద్రలో ఉన్న అతిథులు తప్పించుకోవడం కష్టమైంది. ఎక్కువ మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు కాలిన గాయాలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. హోటల్ గదుల్లో వాడిపడేసిన కార్బన్ డయాక్సై డ్ సిలిండర్లు కనిపించాయి. దీనినిబట్టి మంటలను ఆర్పడానికి వారు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. హోటల్ పైకప్పు నుంచి దట్టమైన పొగ వెలువడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తీసిన వీడియోలో కనిపించింది. ప్రమాదం జరిగిన సుమారు గంట తరువాత అంటే ఉదయం 4.35 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన ప్రమాదస్థలికి 24 ఫైరింజన్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరణించిన 17 మందిలో 10 మందిని గుర్తించారు. అందులో ముగ్గురు కేరళ, ఒకరు గుజరాత్, ఇద్దరు మయన్మార్ నుంచి వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. మిగిలిన నలుగురిని గుర్తించినా, వారు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియరాలేదు. ఒక వ్యక్తి జాడ గల్లంతైనట్లు డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణం.. కేరళలోని ఎర్నాకులం నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో మృతిచెందారు. 57 ఏళ్ల సోమశేఖర్ అనే వ్యక్తి తన తల్లి (84), అన్న(59), చెల్లెలు (53)తో కలసి ఘజియాబాద్‌లో బంధువు వివాహానికి హాజరయ్యేందుకు వచ్చి ఈ హోటల్లో బస చేశారు. వీరిలో సోమశేఖర్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. విశాఖ రిఫైనరీ ఉద్యోగి మృతి మల్కాపురం(విశాఖ): ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో హెచ్‌పీసీఎల్ (విశాఖ రిఫై నరీ)ఉద్యోగి చలపతిరావు(55) మృతి చెందారు. హెచ్పీసీఎల్లో అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న చలపతిరావు సోమవారం ఢిల్లీలో జరిగిన పెట్రోటెక్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వెళ్లి అర్పిత్ హోటల్లో బస చేశారు. మంగళవారం ఉదయం తిరిగి విశాఖపట్నానికి తిరిగిరావల్సి ఉండగా, ఇంతలోనే ప్రమాదం ఆయన్ని బలితీసుకుంది. ఆయన మృత దేహం బుధవారం ఉదయంకల్లా ఇక్కడికి చేరుకునే అవకాశాలున్నాయి. చలపతిరావు భార్య, పిల్లలతో విశాఖలోని ఎండాడ వద్ద నివాసముంటున్నారు. మార్చురీ వద్ద రోదిస్తూ బంధువులకు సమాచారం చేరవేస్తున్న బాధితురాలు -
30 మంది జలసమాధి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండ్య జిల్లాలో శనివారం సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు నీటి కెనాల్లో పడింది. ఈ దుర్ఘటనలో 30 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతిచెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. గల్లంతైన వారి వివరాలు తెలియరాలేదు కాబట్టి, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బెంగళూరుకు సుమారు 105 కి.మీ దూరంలోని పాండవపుర తాలూకా కానగానమారండి వద్ద మధ్యాహ్నం బస్సు అదుపు తప్పి 12 అడుగుల లోతున్న వీసీ కెనాల్లో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి నీటి నుంచి 30 మృతదేహాల్ని వెలికితీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల్లో 8 మంది పురుషులు, 13 మంది మహిళలు, 9 మంది పిల్లలున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది సమీపంలోని వాదెసముద్ర గ్రామానికి చెందినవారని స్థానికులు తెలిపారు. పిల్లలు స్కూలు ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ సాయంతో బస్సును బయటికి లాగారు. సంఘటనా స్థలం వద్ద భారీగా గుమికూడిన స్థానికులను నియంత్రించడం పోలీసులకు కష్టమైంది. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విలపించిన ముఖ్యమంత్రి ఈ ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి కుమారస్వామి అన్ని అధికారిక కార్యక్రమాలు రద్దుచేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఘటన జరిగిన తీరు తెలుసుకుని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పరారీలో డ్రైవర్.. కేసు నమోదు ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు. ఈ దుర్ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పాండవపుర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ప్రమాదానికి గురైన బస్సు మండ్యకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద 2001లో రిజిస్టరై ఉంది. 2019 వరకు బస్సుకు బీమా సదుపాయం ఉంది. బస్సు 15 ఏళ్లకు పైబడినదే కాకుండా, ఇప్పటి వరకు 8 మంది యజమానులు మారినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానిక ఆర్డీవోను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈత రావడం వల్లే బతికా.. అదృష్టం కలసిరావడంతో పాటు ఈత నేర్చుకోవడం వల్లే బతికిపోయానని గిరీశ్ అనే ప్రయాణికుడు తెలిపాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు కాలువలో పడి ఉండొచ్చని తెలిపాడు. తన గ్రామానికి చెందిన 15 మంది ఈ ప్రమాదంలో మరణించారన్నాడు. రోహిత్ అనే విద్యార్థిని గిరీశ్ కాపాడినట్లు తెలిసింది. కాలువలో పడిపోయిన బస్సును పైకి లాగుతున్న సహాయక సిబ్బంది కన్నీటిపర్యంతమైన సీఎం కుమారస్వామి -
బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై సజీవదహనం
గువాహటి: అస్సాంలోని నాగామ్ జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన ఓ బాలిక(12)పై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధులు తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని నాగామ్‌లోని ఆస్పత్రికి తరలించగా శనివారం ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనియభెటి లలున్‌గాన్ గ్రామంలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఐదుగురు కామాంధులు ఆమెను గ్యాంగ్‌రేప్ చేసి తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు బాధితురాలితో కలసి చదువుకుంటున్నవారే. బాలిక వాంగ్మూలం ఆధారంగా ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టుచేశారు. -
ఇల్లు కూలి ఇద్దరు సజీవ సమాధి
ములుగు (మెదక్): రోడ్డు విస్తరణ పనులు ఇద్దర్ని బలితీసుకున్నాయి. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడిలో ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుతుండగా... ఓ ఇల్లు ముందు భాగం కూలిపోవడంతో ఆ ఇంటి యజమాని, అతని కూతురు సజీవ సమాధి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. ఎండీ గౌస్‌మియా, అతని కూతురు జలాల్ రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్న ఇంట్లో కిరాణ షాపు నడుపుకుంటూ అందులోనే నివసిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ముందు కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉంది. దీంతో ముందు భాగంలో ఉన్న సామాగ్రిని గౌస్‌మియా, జలాల్ తీస్తున్నారు. ఇంతలోనే జేసీబీ డ్రైవర్ వాహనాన్ని ఇంటికి తగిలించడంతో ఆ ఇల్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. గౌస్‌మియా, జలాల్పై శిధిలాలు పడిపోవడంతో వారు అక్కడే ప్రాణాలు విడిచారు.