బాలికపై గ్యాంగ్‌రేప్‌.. ఆపై సజీవదహనం | Three people from the fifth grade child's death | Sakshi
Sakshi News home page

బాలికపై గ్యాంగ్‌రేప్‌.. ఆపై సజీవదహనం

Published Sun, Mar 25 2018 3:39 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

Three people from the fifth grade child's death - Sakshi

గువాహటి: అస్సాంలోని నాగామ్‌ జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన ఓ బాలిక(12)పై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధులు తర్వాత కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని నాగామ్‌లోని ఆస్పత్రికి తరలించగా శనివారం ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనియభెటి లలున్‌గాన్‌ గ్రామంలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఐదుగురు కామాంధులు ఆమెను గ్యాంగ్‌రేప్‌ చేసి తర్వాత కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు బాధితురాలితో కలసి చదువుకుంటున్నవారే. బాలిక వాంగ్మూలం ఆధారంగా ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement