kirosine
-
అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, వరంగల్ రూరల్ : అక్రమార్కులకు ఎటువంటి కష్టం లేకుండానే లక్షల విలువ చేసే రేషన్ కిరోసిన్ పక్కదారి పట్టేది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. రేషన్ సరఫరాలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు తీసుకవచ్చిన ఈ పాస్ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ పాస్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ గతంలో ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి కిరోసిన్ పంపిణీ సైతం ఈ పాస్ ద్వారా ప్రారంభమైంది. ఈ పాస్ ద్వారా రేషన్ డీలర్ల అక్రమాలకు కళ్లెం పడింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న ఆక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ–పాస్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. తొలుత బియ్యానికి ఈ పాస్ పెట్టగా తద్వారా అక్రమాలను నిరోధించి సరుకులు సక్రమంగా పంపిణీ అయ్యాయని అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కిరోసిన్‌కు అమలు చేస్తుంది. ఇప్పటికే కార్డుదారుల వివరాలను ఆధార్‌కు, మొబైల్ నంబర్‌కు అనుసంధానం చేశారు. రేషన్ కార్డుల జారీ సైతం ఆధార్‌కార్డుల ద్వారానే జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 464 రేషన్ షాపులుండగా 2,18,269 మొత్తం రేషన్ కార్డులున్నాయి. ఈ–పాస్ పనిచేసిది ఇలా... ఈ–పాస్ పరికరంలో మొదట రేషన్‌కార్డు నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత లావాదేవీల ఆప్షన్ వస్తుంది. దీంతో రేషన్ సరుకులు ఎంచుకున్న తరువాత రేషన్ కార్డు నంబర్ నమోదు చేయాలని సూచిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారో అందులో ఎంచుకోవాలి. అప్పుడు ఆ కార్డుదారుడి వేలి ముద్ర తీసుకుంటే ఆ కుటుంబానికి లీటర్ కిరోసిన్ వస్తుంది. ఈ పాస్‌తో మిగిలిన కిరోసిన్ ఈ పాస్ ద్వారా 16 మండలాల్లో మండలాల్లో బియ్యాన్ని పంపిణీ చేశారు. జిల్లాలో 464 రేషన్‌షాప్‌ల ద్వారా 2,18,269 కార్డుదారులకు సరుకుల పంపిణీ జరుగుతుంది. జిల్లాకు 21,6098 లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు. ఫిబ్రవరి నెల నుంచి ఈ పాస్ ద్వారా కిరోసిన్ పంపిణీ చేయగా 1,98,226 లీటర్ల కిరోసిన్ మిగిలింది. దీంతో ఈ మూడు నెలల్లో 1.98 లక్షల లీటర్ల కిరోసిన్ అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వానికి మిగిలింది. అక్రమాలను పూర్తిగా అరికట్టాం.. రేషన్ పంపిణీలో అక్రమాలను పూర్తిగా అరికట్టకలిగాం. తొలుత బియ్యం.. ఇప్పుడు కిరోసిన్‌కు ఈ పాస్ అమలు చేయడం జరుగుతుంది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టాం. కార్డుదారులు ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటును కల్పించాం. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, కిరోసిన్ అందరికి, అంత్యోదయ కార్డు దారులకు చక్కెరను అందిస్తున్నాం. ఎలాంటి అవకతవకలు జరగడం లేదు. –వనజాత, డీఎస్ఓ -
ముగ్గురు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం
గుంటూరు ఈస్ట్: స్వయానే తల్లే తనను మోసగించిందన్న ఆవేదనతో ఓ మహిళ ముగ్గురు పిల్లలు సహా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో మంగళవారం కలకలం రేపిన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి. సత్తెనపల్లి పాతబస్టాండు ప్రాంతానికి చెందిన చిమట రమాదేవికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. మూడో కుమార్తె అరుణకుమారి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఆమె తండ్రి శ్రీనును ఆస్తి గొడవల నేపథ్యంలో బంధువులే హత్య చేశారు. 2016లో ఆమె తల్లి రమాదేవి సుమారు రూ.7 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడు అశోక్‌కుమార్ పేరిట రిజిస్టర్ చేయించారు. ఆ సమయంలో కుమార్తెల సంతకాలూ తీసుకున్నారు. ఆస్తిలో వాటా ఇస్తానని తల్లి నమ్మించి రిజిస్ట్రేషన్ సమయంలో సంతకాలు చేయించిందని అరుణకుమారి ఆరోపిస్తోంది. మిగిలిన కుమార్తెలకు ఇచ్చినమాట ప్రకారం కొంత ఆస్తి, నగదును ఇచ్చిన తల్లి తనను మాత్రం కులాంతర వివాహం చేసుకున్నాన్న కోపంతో అన్యాయం చేసిందని ఆమె చెబుతోంది. కొద్దిరోజుల క్రితం నిలదీయగా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనని తేల్చిచెప్పడంతో అరుణకుమారి రెండు వారాల క్రితం గుంటూరు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసింది. వారు సూచనతో సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అయినా న్యాయం జరగకపోవడంతో మంగళవారం జిల్లా ఉన్నతాధికారులకు తన సమస్య చెప్పుకొందామని గుంటూరుకు వచ్చింది. అయితే ఎక్కడికెళ్లినా న్యాయం జరగదన్న నిరాశతో నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో ముగ్గురు పిల్లలతో సహా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం వారు ఆమెను నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారులు తనకు న్యాయం జరిపించాలని, లేదంటే తాను బతకనంటూ కన్నీరుమున్నీరైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై సజీవదహనం
గువాహటి: అస్సాంలోని నాగామ్ జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన ఓ బాలిక(12)పై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధులు తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని నాగామ్‌లోని ఆస్పత్రికి తరలించగా శనివారం ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనియభెటి లలున్‌గాన్ గ్రామంలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఐదుగురు కామాంధులు ఆమెను గ్యాంగ్‌రేప్ చేసి తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు బాధితురాలితో కలసి చదువుకుంటున్నవారే. బాలిక వాంగ్మూలం ఆధారంగా ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టుచేశారు. -
తల్లిపై కిరోసిన్ పోసిన కూతురు
సిద్దిపేటరూరల్ : పేగు తెంచుకొని పుట్టిన కూతురు.. కన్నపేగుపైనే నిప్పులు కురిపించింది. తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో చోటుచేసుకుంది. రాఘవాపూర్కి చెందిన గ్యార లచ్చవ్వ (55), భర్త మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. కుమారులు సిద్దిపేటలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. మూడో కూతురైన గ్యార సునీత ఇంటి దగ్గరే ఉంటూ ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. గురువారం ఉద యం తల్లి కూలీ పనికి, సునీత ఆసుపత్రికి వెళ్లారు. రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చిన కూతురుతో కుటుం బానికి సంబంధించి విషయమై లచ్చవ్వ గొడవ పడింది. గొడవ పెద్దది కావడంతో, విచక్షణ కోల్పోయిన సునీత పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని తల్లిపై కిరోసిన్ గుమ్మరిం చింది. ఆపై అగ్గిపుల్ల గీసి నిప్పంటిం చింది. ఒక్కసారిగా ఇంటినిండా మం టలు వ్యాపించాయి. కాలిన గాయాల తో లచ్చవ్వ కేకలు వేసింది. ఇరుగుపొరు గు వారు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే సగానికిపైగా కాలిపోయిన లచ్చవ్వను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది. 24 గంటలు గడిచే వరకు ఏం చెప్పలేమని వైద్యులు చెప్పారు. -
కిరోసిన్‌కు ‘పొగ’
- ఈ నెల కోటాలో కోత - జిల్లాకు ఇవ్వాల్సింది 1800 కిలోలీటర్లు.. ఇచ్చింది 1224 కిలోలీటర్లు - దానినే చౌక దుకాణాలకు సర్దుబాటు చేసిన అధికారులు - చివరిలో వచ్చే కార్డుదారులకు మొండిచేయే.. కాకినాడ సిటీ : చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై ఇస్తున్న కిరోసిన్‌కు ‘పొగ’ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్ కార్డులపై ఇస్తున్న ఒకటి రెండు లీటర్ల కిరోసిన్‌ను రెండు మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తోంది. రాష్ట్రాన్ని పొగ రహితంగా ప్రకటించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో జిల్లాకు కిరోసిన్ కేటాయింపులను ఆలస్యం చేసింది. మామూలుగా ప్రతి నెలా 20వ తేదీలోగానే చౌకదుకాణాలకు తరువాతి నెల సరుకుల కేటాయింపులు పూర్తయ్యేవి. కానీ ఈ నెలలో కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభించిన మూడు రోజులకు ప్రభుత్వం జిల్లాకు కిరోసిన్ కోటా కేటాయింపులు ఇచ్చింది. అది కూడా ఇవ్వాలిన కోటాలో కోత పెట్టింది. జిల్లాలోని మొత్తం 2,647 చౌక దుకాణాల పరిధిలో అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజన, తెల్ల కార్డుదారులు 16,11,494 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో వంటగ్యాస్ కనెక్షన్ లేనివారికి 2 లీటర్లు, ఉన్నవారికి ఒక లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. దీని ప్రకారం జిల్లాకు 1800 కిలోలీటర్ల కిరోసిన్ కావాలి. కానీ ప్రభుత్వం కోత పెట్టడంతో 1224 కిలోలీటర్ల కిరోసిన్ మాత్రమే ఇంతవరకూ వచ్చింది. అరకొర కేటాయింపులే.. చాలీచాలకుండా వచ్చిన ఆ కిరోసిన్‌ను సర్దుబాటు చేసేందుకు పౌర సరఫరాల అధికారులు తర్జనభర్జన పడ్డారు. చివరకు జిల్లాకు అరకొరగా వచ్చిన కిరోసిన్‌ను ఒక్కో చౌక దుకాణానికి 75 శాతం చొప్పున కేటాయించారు. దీని ప్రకారం హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లు రేషన్ దుకాణాలకు సరుకు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ సగంమంది రేషన్ డీలర్లకు మాత్రమే కిరోసిన్ అందించారు. మిగిలినవారికి పూర్తి స్థాయిలో ఇవ్వడానికే మరో రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు. దీనినిబట్టి కార్డుదారులకు కిరోసిన్ చేరడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 40 శాతం మంది కార్డుదారులు కిరోసిన్ లేకుండానే ఉన్న సరుకులు తీసుకుని వెళ్లిపోయారు. అరకొర కేటాయింపుల కారణంగా ముందుగా వచ్చేవారికి తప్ప చివరిలో వచ్చేవారికి కిరోసిన్ దొరకని పరిస్థితి ఏర్పడనున్నది. భారమన్న ఉద్దేశంతోనే.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని భారంగా భావిస్తున్న ప్రభుత్వం దానిని ఎలాగోలా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్రం చక్కెర సబ్సిడీని తొలగించడంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలకు ఈ నెల పంచదారను విడుదల చేయలేదు. గోదాంలలో ఉన్న అరకొర నిల్వలనే జిల్లా అధికారులు చౌక దుకాణాలకు సర్దుబాటు చేశారు. కిరోసిన్ విషయానికి వస్తే.. పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు గతంలో ఇస్తున్న 4 లీటర్ల కిరోసిన్‌ను గత నెల నుంచి 2 లీటర్లకు ప్రభుత్వం కుదించింది. తాజాగా ఈ నెల కేటాయింపుల్లోనే కోత పెట్టింది. కిరోసిన్ పంపిణీ చేపట్టాం జిల్లాలోని కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేపట్టాం. కేటాయింపులు ఆలస్యం కావడంతో పంపిణీలో జాప్యం జరిగింది. గత నెల సీబీ, ఈ నెల కేటాయించిన కోటా కలుపుకుని చౌకదుకాణాలకు కిరోసిన్‌ను సర్దుబాటు చేశాం. -
సగం కిరోసిన్‌కు ‘పొగ’
– అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కుదింపు -4 లీటర్లకు బదులు 2 లీటర్లే – ఈనెల కోటా నుంచే అమలు కాకినాడ సిటీ : పేదల సంక్షేమమే తమ లక్ష్యమని ఆర్భాటంగా ప్రచారం చేసుకునే తెలుగుదేశం ప్రభుత్వమే ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో భారం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వాలు కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి చౌకధరలలో పంపిణీ చేశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక బియ్యం, పంచదార, కిరోసిన్ మినహా మిగిలిన పామాయిల్, గోధుమపిండి, కందిపప్పులకు ఒక్కొక్కటిగా మంగళం పాడింది. తాజాగా ఈనెల కోటా నుంచి పట్టణ ప్రాంతాల్లో కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్‌లో కోత విధించింది. ఇప్పటివరకు నాలుగు లీటర్లు ఇస్తున్న కిరోసిన్‌ను 2 లీటర్లకు కుదించింది. ‘పొగరహితం’ పేరుతో త్వరలో మొత్తానికి మంగళం! జిల్లా వ్యాప్తంగా 2,647 చౌకదుకాణాల పరిదిలో 16,08,711 మంది అన్నపూర్ణ, అంత్యోదయ అన్నయోజన, తెలుపు కార్డుదారులున్నారు. గ్యాస్ లేని కార్డుదారులకు అర్బన్ ప్రాంతాల్లో 4 లీటర్లు, రూరల్ ప్రాంతాల్లో 2 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తుండగా గ్యాస్ ఉన్న కార్డుదారులకు అన్ని ప్రాంతాల్లో ఒక లీటరు ఇస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ప్రతి నెలా జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో గ్యాస్ లేనివారికి 2 లీటర్లు, గ్యాస్ ఉన్న వారికి ఒక లీటరు పంపిణీ చేస్తారు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ లేని కార్డుదారులు సుమారు 65 వేల మందికి 4 లీటర్లకు బదులు రెండు లీటర్లే అందనుంది. ఇదిలా ఉండగా కిరోసిన్ అనేది ఒక్క వంటకే కాకుండా ప్రధానంగా విద్యుత్ లేని సమయంలో దీపం వెలిగించుకోవడానికి ఉపయోగపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం అందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెబుతూ రాష్ట్రాన్ని పొగరహితంగా ప్రకటించే సాకుతో భాగం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగా సబ్సిడీపై ఇచ్చే ఒకటి, రెండు లీటర్ల కిరోసిన్‌ను కూడా రానున్న రెండు, మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ఉందన్న అనుమానం బలపడుతోంది. అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు త్వరితంగా మంజూరు చేఏందుకు చర్యలు తీసుకోవాలన్న ఆదేశం వెనుక లక్ష్యం అదేనంటున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారుల్లో వంట గ్యాస్ ఉన్న వారు 13,10,669 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ 2 లీటర్లే జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ లేని కార్డుదారులకు 4 లీటర్ల కిరోసిన్ పంపిణీ జరిగేది. ఈనెల నుంచి గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలకూ 2 లీటర్లే ఇవ్వనున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాం. -వి.రవికిరణ్, జిల్లా పౌరసఫరాల అధికారి కిరోసిన్‌లో కోత దారుణం అర్బన్ ప్రాంతాల్లో కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్‌లో కోత విధించడం దారుణం. వంట గ్యాస్ ఉన్నా కార్డుదారులు అనేక సందర్భాల్లో కిరోసిన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. విద్యుత్ లేనప్పుడు కిరోసిన్ దీపాలపై ఆధారపడే పేదలు ఉన్నారు. - పలివెల వీరబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు -
కిరోసిన్ తాగి చిన్నారి కన్నుమూత
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు విషాదంలో వినాయకపల్లి వినాయకపల్లి (శంగవరపుకోట రూరల్) : ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున కిరోసిన్ తాగి చిన్నారి మరణించిన విషాదకర సంఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వినాయకపల్లిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వినాయకపల్లిలో శిమ్మ ఎర్నాయుడు, రమణమ్మ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బాలుడి తండ్రి ఎర్నాయుడు కూలి పనికి వెళ్లిపోగా, తల్లి రమణమ్మ ఇంటి పనులు చేసుకుంటోంది. ఈ సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న సాత్విక్ (3) పొరపాటున కిరోసిన్ డబ్బా తీసి తాగేశాడు. వెంటనే తల్లి చూసి చిన్నారిని ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుడు ఎం. హరి ప్రథమ చికిత్స అందించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని కేంద్ర ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి కన్నుమూశాడు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో వినాయకపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్. కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరిహద్దులో 10వేల లీటర్ల కిరోసిన్ పట్టివేత
పరారీలో నిందితులు మరోసారి ఉలిక్కిపడ్డ సరిహద్దు ఇచ్చాపురం రూరల్ : కోట్ల రూపాయల విలువైన అక్రమ గుట్కా పట్టిన నెల రోజుల్లోనే ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం మరోసారి ఉలిక్కి పడింది. ఈ సారి గుట్టుగా సాగిస్తున్న అక్రమ కిరోసిన్ పట్టుబడటంతో అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అక్రమార్కులకు అడ్డాగా పేరుపొందిన ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిల్వ ఉన్న పది వేల లీటర్ల కిరోసిన్‌ను శనివారం విజిలెన్స్ అధికారలు పట్టుకున్నారు. వివరాలలోకి వెళ్తే...ఒడిశా నుంచి కిరోసిన్‌ను కొనుగోలు చేసి అందులో ఆంధ్రాకు సంబంధించిన నీలి కిరోసిన్ కలుపుతూ గుట్టుగా లీటర్ 45 రూపాయలకు అక్రమంగా లారీలకు అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో రూరల్ ఎస్ఐ ఎం.చిన్నంనాయుడుతో కలసి విజిలెన్స్ సీఐ సతీష్‌కుమార్ శనివారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక ఫైర్ స్టేషన్ సమీపంలో ఐదు గొదాంల్లో సోదాలు చేయగా 54 పీపాల్లో సుమారు 10వేల లీటర్లు అక్రమ కిరోసిన్ ఉన్నట్లు కనుగొన్నారు. 334 ఖాళీ పీపాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఐదు లక్షల రూపాయల విలువ గల కిరోసిన్ ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారు. సోదాలు చేసే సమయంలో పసిగట్టిన నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. -
35 వేల లీటర్ల కిరోసిన్ పట్టివేత
హైదరాబాద్: చౌక ధరల దుకాణాలకు చేరాల్సిన కిరోసిన్ పక్కదారి పడుతోంది. పరిశ్రమల్లో వృథాగా పోయే మడ్ ఆయిల్(బ్లాక్ ఆయిల్)ను ఈ కిరోసిన్‌లో కలిపి మళ్లీ అదే పరిశ్రమలతో పాటు పెట్రోల్ బంక్‌లకు తరలిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో ఇంధనం కల్తీ అయి వాహనాలు చెడిపోతున్నాయి. ఈ అక్రమ దందా నడుపుతున్న ముఠాలపై కన్నేసిన సైబరాబాద్ పోలీసులు.. రెండు లారీల్లో ఉన్న 35 వేల లీటర్ల కల్తీ కిరోసిన్‌ను పట్టుకున్నారు. సోమవారం రాత్రి మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని బోడుప్పల్ హేమానగర్ ఎంసీ కాలనీలో ఓ గోదాంపై దాడి చేసి ఈ కల్తీ కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. గోదాం నిర్వహిస్తున్న యజమాని గోవిందరాజు, సూపర్వైజర్ ప్రకాశరావుతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే మంగళవారం రాజేంద్రనగర్ పరిధిలో ఏజీ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద కర్ణాటక నుంచి వస్తున్న ఓ లారీలో 42 డ్రమ్ముల్లో ఉన్న కల్తీ ఇంజిన్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.