సాక్షి, వరంగల్ రూరల్ : అక్రమార్కులకు ఎటువంటి కష్టం లేకుండానే లక్షల విలువ చేసే రేషన్ కిరోసిన్ పక్కదారి పట్టేది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. రేషన్ సరఫరాలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు తీసుకవచ్చిన ఈ పాస్ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ పాస్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ గతంలో ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి కిరోసిన్ పంపిణీ సైతం ఈ పాస్ ద్వారా ప్రారంభమైంది. ఈ పాస్ ద్వారా రేషన్ డీలర్ల అక్రమాలకు కళ్లెం పడింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న ఆక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ–పాస్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది.
తొలుత బియ్యానికి ఈ పాస్ పెట్టగా తద్వారా అక్రమాలను నిరోధించి సరుకులు సక్రమంగా పంపిణీ అయ్యాయని అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కిరోసిన్‌కు అమలు చేస్తుంది. ఇప్పటికే కార్డుదారుల వివరాలను ఆధార్‌కు, మొబైల్ నంబర్‌కు అనుసంధానం చేశారు. రేషన్ కార్డుల జారీ సైతం ఆధార్‌కార్డుల ద్వారానే జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 464 రేషన్ షాపులుండగా 2,18,269 మొత్తం రేషన్ కార్డులున్నాయి.
ఈ–పాస్ పనిచేసిది ఇలా...
ఈ–పాస్ పరికరంలో మొదట రేషన్‌కార్డు నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత లావాదేవీల ఆప్షన్ వస్తుంది. దీంతో రేషన్ సరుకులు ఎంచుకున్న తరువాత రేషన్ కార్డు నంబర్ నమోదు చేయాలని సూచిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారో అందులో ఎంచుకోవాలి. అప్పుడు ఆ కార్డుదారుడి వేలి ముద్ర తీసుకుంటే ఆ కుటుంబానికి లీటర్ కిరోసిన్ వస్తుంది.
ఈ పాస్‌తో మిగిలిన కిరోసిన్
ఈ పాస్ ద్వారా 16 మండలాల్లో మండలాల్లో బియ్యాన్ని పంపిణీ చేశారు. జిల్లాలో 464 రేషన్‌షాప్‌ల ద్వారా 2,18,269 కార్డుదారులకు సరుకుల పంపిణీ జరుగుతుంది. జిల్లాకు 21,6098 లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు. ఫిబ్రవరి నెల నుంచి ఈ పాస్ ద్వారా కిరోసిన్ పంపిణీ చేయగా 1,98,226 లీటర్ల కిరోసిన్ మిగిలింది. దీంతో ఈ మూడు నెలల్లో 1.98 లక్షల లీటర్ల కిరోసిన్ అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వానికి మిగిలింది.
అక్రమాలను పూర్తిగా అరికట్టాం..
రేషన్ పంపిణీలో అక్రమాలను పూర్తిగా అరికట్టకలిగాం. తొలుత బియ్యం.. ఇప్పుడు కిరోసిన్‌కు ఈ పాస్ అమలు చేయడం జరుగుతుంది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టాం. కార్డుదారులు ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటును కల్పించాం. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, కిరోసిన్ అందరికి, అంత్యోదయ కార్డు దారులకు చక్కెరను అందిస్తున్నాం. ఎలాంటి అవకతవకలు జరగడం లేదు. –వనజాత, డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment