35 వేల లీటర్ల కిరోసిన్ పట్టివేత | 35 thousand liters kirosine seized | Sakshi
Sakshi News home page

35 వేల లీటర్ల కిరోసిన్ పట్టివేత

Published Wed, Aug 19 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

35 thousand liters kirosine seized

హైదరాబాద్: చౌక ధరల దుకాణాలకు చేరాల్సిన కిరోసిన్ పక్కదారి పడుతోంది. పరిశ్రమల్లో వృథాగా పోయే మడ్ ఆయిల్(బ్లాక్ ఆయిల్)ను ఈ కిరోసిన్‌లో కలిపి మళ్లీ అదే పరిశ్రమలతో పాటు పెట్రోల్ బంక్‌లకు తరలిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో ఇంధనం కల్తీ అయి వాహనాలు చెడిపోతున్నాయి. ఈ అక్రమ దందా నడుపుతున్న ముఠాలపై కన్నేసిన సైబరాబాద్ పోలీసులు.. రెండు లారీల్లో ఉన్న 35 వేల లీటర్ల కల్తీ కిరోసిన్‌ను పట్టుకున్నారు.

సోమవారం రాత్రి మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని బోడుప్పల్ హేమానగర్ ఎంసీ కాలనీలో ఓ గోదాంపై దాడి చేసి ఈ కల్తీ కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. గోదాం నిర్వహిస్తున్న యజమాని గోవిందరాజు, సూపర్‌వైజర్ ప్రకాశరావుతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే మంగళవారం రాజేంద్రనగర్ పరిధిలో ఏజీ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద కర్ణాటక నుంచి వస్తున్న ఓ లారీలో 42 డ్రమ్ముల్లో ఉన్న కల్తీ ఇంజిన్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement