
న్యూఢిల్లీ: ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్– 2020’లో 80 మంది భారతీయులకు చోటు దక్కింది. వేలాది కొత్త రికార్డులు, ప్రత్యేక కేటగిరీలు కలిగిన తాజా గిన్నిస్ పుస్తకాన్ని పెంగ్విన్ రాండ్‌సమ్ హౌస్ ప్రచురణ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారతీయుల రికార్డులు 80 చోటుదక్కించుకున్నాయి. ప్రపం చంలోనే పొడవైన జుట్టు(5.7 అడుగులు) ఉన్న యువతిగా నీలాన్షి పటేల్ (16), అతిపొట్టి(24.7 అంగుళాలు) జ్యోతి అమాజి (నాగపూర్), పొడవైన చేతివేలి గోర్లు (909.6 సెం.మీ) కలిగిన వ్యక్తిగా శ్రీధర్ (పుణె) ఇందులో స్థానం సంపాదించారు. భారత్‌లో ప్రజా రవాణా ద్వారా అత్యంత దూరం (29,119 కి.మీ) ప్రయాణించిన వారిగా జ్యోత్సా్న మిశ్రా, దుర్గా చరణ్, 736 రకాల కాగితం కప్పులు సేకరించిన వ్యక్తిగా శంకర నారాయణన్ (తమిళనాడు), పది బార్స్ కిందుగా అత్యంత వేగంగా స్కేట్ చేసిన (2.06 సెకండ్లు) వ్యక్తిగా నవీన్ కుమార్ నిలిచారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తాజా గిన్నిస్ రికార్డ్స్ పుస్తకంలో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment