94 వెబ్ సైట్లు బ్లాక్
ముంబయి: ఉగ్రవాదుల కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్న దాదాపు వంద వెబ్ సైట్లను మహారాష్ట్ర అధికారులు బ్లాక్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపించడంతోపాటు ఈ వేడుకలు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
ఇందులో భాగంగా, మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు 94 ఆన్ లైన్ వెబ్ సైట్లను బ్లాక్ చేశారు. ఈ సైట్లు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలకు ప్రోత్సాహాన్నిచ్చేలా పనిచేస్తున్నాయని, అందుకే వాటిని నిషేధించినట్లు ఏటీఎస్ చీఫ్ వివేక ఫన్సాల్కర్ తెలిపారు.