‘నిజం చెప్పు.. నేనిప్పుడు గర్భవతిని కూడా..’ | a woman barges into wedding with riffile, stops husband marriage | Sakshi
Sakshi News home page

‘నిజం చెప్పు.. నేనిప్పుడు గర్భవతిని కూడా..’

Published Fri, May 12 2017 9:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

‘నిజం చెప్పు.. నేనిప్పుడు గర్భవతిని కూడా..’

‘నిజం చెప్పు.. నేనిప్పుడు గర్భవతిని కూడా..’

కాన్పూర్‌: మొత్తం ఓ ఐదు వందలమంది బంధువులు. మంగళవాయిద్యాలు. వినిపిస్తున్న బ్రాహ్మణుడి మంత్రాలు. పీటలపై నవ వధువు, వరుడి సంతోషం.. ఆసక్తిగా వేదిక ముందు కూర్చుని చూస్తున్న జనం. సరిగ్గా వధువు, వరుడు పూల దండ ఒకరికొకరు వేసుకొనే సందర్భంలోనే ఆగండి అంటూ గట్టి కేక.. కట్‌ చేస్తే వెనక్కి తిరిగి చూసిన వాళ్లకి తొలుత తుపాకీ.. ఆ తర్వాత ఆ తుపాకీని పట్టుకొని ఆవేశంగా దూసుకొస్తున్న ఓ మహిళ కనిపించింది. ‘ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు.. నేను అతడి ప్రియురాలిని.. అతడు నా ప్రియుడు.. ఇంతకుముందే మేం గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాం’ అంటూ టక్కున చెప్పేసింది.

దీంతో అంతా బిత్తర పోయారు. పెళ్లి కొడుకు నీళ్లు నములుతూ అందరివైపు బిక్క మొహం పెట్టి చూశాడు. ఓ బాలీవుడ్‌ సినిమాను తలపించే రేంజ్‌లో ఉన్న ఈ సన్నివేశం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా షివ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. దేవేంద్ర అవస్తి అనే వ్యక్తి గతంలో ప్రస్తుతం తుపాకీతో వచ్చిన మహిళతో ప్రేమ వ్యవహారం నడిపాడు. వారిద్దరు వివాహం కూడా చేసుకున్నారు. అయితే, అది రహస్య వివాహం కావడంతో ఎవరికీ తెలియకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న భార్య వెంటనే తుపాకీతో కళ్యాణమంటపానికి వచ్చి అసలు విషయం చెప్పింది. అయితే, తొలుత వరుడు ఆ విషయాన్ని కొట్టి పారేయాలని చూడటంతో నేరుగా తుపాకీని తనకే గురిపెట్టుకొని నిజం చెప్పకుంటే కాల్చుకొని చనిపోతానంది. ఇప్పుడు తను గర్బవతిని కూడా అని చెప్పింది. దీంతో పెళ్లి ఆగిపోవడమే కాకుండా పెళ్లి కొడుక్కు ఇచ్చిన డబ్బులు, విలువైన వస్తువులు వారు తీసుకొని వెళ్లి పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement