ఆ బడా బిజినెస్మేన్ సేఫ్ | Abducted Nepal Based Industrialist Suresh Kedia Rescued from Bihar | Sakshi
Sakshi News home page

ఆ బడా బిజినెస్మేన్ సేఫ్

Published Sun, May 29 2016 2:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

ఆ బడా బిజినెస్మేన్ సేఫ్

ఆ బడా బిజినెస్మేన్ సేఫ్

బిహార్: అపహరణకు గురైన నేపాల్కు చెందిన వ్యాపార వేత్త సురేష్ కేదియా సురక్షితంగా బయటపడ్డారు. నేపాల్లోని బారా జిల్లాలో కిడ్నాప్కు గురైన ఆయన బిహార్లో బందీల చెర నుంచి బయటపడ్డాడు. గత గురువారం బారా జిల్లాలోని బిర్గంజ్ ప్రాంతంలో ఉన్న తన పరిశ్రమ వద్దకు వెళుతుండగా భారీ మొత్తంలో ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు ఆయన కారును వెంబడించారు.

అనంతరం కారు డ్రైవర్పై కాల్పులు జరిపి సురేష్ను ఎత్తుకెళ్లారు. అనంతరం వారు నేపాల్ సరిహద్దుకు ఆనుకోని ఉన్న బిహార్లోకి ప్రవేశించారు. ఆయనను మోదీహరి ప్రాంతంలో దాచిపెట్టి ఉంచేందుకు ప్రణాళిక రచించారు. అప్పటికే సురేష్ ను విడుదల చేయాలంటే 100కోట్లు కట్టాల్సిందేనని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ప్రత్యేక టీంగా ఏర్పడి అతి తక్కువ సమయంలోనే ఆయనను గుర్తించి సురక్షితంగా బయటపడేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement