నేవీకి 'అల్బాట్రాస్‌' బై బై | After INS Viraat, Indian Navy's patrol aircraft 'Albatross' to be decommissioned | Sakshi
Sakshi News home page

నేవీకి 'అల్బాట్రాస్‌' బై బై

Published Wed, Mar 8 2017 9:09 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

నేవీకి 'అల్బాట్రాస్‌' బై బై

నేవీకి 'అల్బాట్రాస్‌' బై బై

న్యూఢిల్లీ: భారతీయ నేవీ నుంచి మరో దిగ్గజం రిటైర్‌ కానుంది. హిందూ మహాసముద్రంపై 30 ఏళ్ల పాటు డేగ కన్ను వేసిన టుపోలెవ్‌-142ఎమ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(రష్యా నుంచి కొనుగోలు చేశారు) ఈ నెలాఖరుకు విధుల్లో నుంచి తప్పుకోనుంది. టర్బోప్రొపెల్లర్‌తో నడిచే టుపోలెవ్‌-142ఎమ్‌ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, వేగవంతమైనది. రాయల్‌ బ్రిటీష్‌ నేవీలో కొద్దికాలంపాటు సేవలందించిన టుపోలెవ్‌-142లను ఆ తర్వాత భారత నేవీ తీసుకుని 'అల్బాట్రాస్‌' అని నామకరణం చేసింది.
 
1988లో ఎనిమిది టీయూ-142ఎమ్‌లను నేవీ ఇండక్ట్‌ చేసింది. యాంటీ సబ్‌మెరైన్‌ ఆపరేషన్లలో టీయూ-142ఎమ్‌లు ఎనలేని సేవలు అందించాయి. తమిళనాడులోని అరక్కోనం వద్ద మార్చి 29న భారత నేవీ టీయూ-142 విమానాలకు ఘనంగా వీడ్కోలు పలుకుతుందని ఓ నేవీ అధికారి చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ ప్రొపెల్లర్‌ జెట్‌ కూడా టీయూ-142 అంత ఎత్తులో ఎగరలేదని అయితే టీయూ-142ల రాడార్‌ వ్యవస్ధ పాతదైపోయిందని చెప్పారు. అప్పటికీ వాటిని వినియోగించదలచినా పాత వ్యవస్ధలను పునరుద్ధిరించడానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతోందని తెలిపారు. దీంతో నేవీ వాటిని విధుల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
 
టీయూ-142ల స్ధానంలో దాదాపు 3.2 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసిన పన్నెండు పీ-8ఐ లాంగ్‌ రేంజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నేవీ వినియోగించనుంది. వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటివరకూ ఎనిమిది పీ-8ఐ విమానాలను అమెరికా భారత్‌కు అందించింది. భారత నేవీ నుంచి ఐఎన్‌ఎస్‌ విరాట్‌ ఇప్పటికే రిటైర్‌ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement