decommission
-
‘ఐఎస్ఎస్’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) ఫ్యూచరేంటి..? 400కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో తిరుగుతున్న ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి ఎలా కూలుస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించేందుకు సిద్ధం చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్ వెహిహికిల్(యూఎస్‌డీవీ)ని ఎలా ఉపయోగిస్తారు..?అసలు ఐఎస్ఎస్ను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతా సజావుగా జరిగి 2030లో ఐఎస్ఎస్ నింగి నుంచి మాయమైన తర్వాత అంతరిక్ష పరిశోధనల మాటేమిటి..? ఈ విషయాలన్నింటిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అసలు ఐఎస్ఎస్ ఏంటి.. ఎందుకు..?అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరప్‌లు 1998 నుంచి 2011వరకు శ్రమించి ఐఎస్ఎస్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాయి. 2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీనే ఐఎస్ఎస్ కమిషన్ అయింది. అప్పటినుంచే అది అంతరిక్షంలో వ్యోమగాములకు ఆశ్రయమిస్తూ ఎన్నో పరిశోధనలకు వేదికైంది. ప్రస్తుతం 15 దేశాలు ఐఎస్ఎస్ను నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భారీ ఖర్చుతో ఐఎస్ఎస్ను నిర్మించారు. ఆశించినట్లుగానే స్పేస్ రీసెర్చ్‌లో 24 ఏళ్లుగా ఐఎస్ఎస్ గొప్పగా సేవలందిస్తోంది.డీ కమిషన్ చేయడం ఎందుకు..?ఐఎస్ఎస్ నింగిలో పనిచేయడం ప్రారంభించి 2030నాటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి ఐఎస్ఎస్ చాలా పాతదవుతుంది. అంతరిక్ష వాతావరణ ప్రభావం వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అందులోని చాలా విడిభాగాలు పనిచేయవు. ఐఎస్ఎస్లోని పరికరాలన్నీ నెమ్మదిస్తాయి. ఐఎస్ఎస్లో వ్యోమగాములు నివసించే మాడ్యూళ్లు పనికిరాకుండా పోతాయి. అది ప్రస్తుతం తిరుగుతున్న 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్ నుంచి దానికదే కిందకు దిగడం ప్రారంభమవుతుంది. నిజానికి ఐఎస్ఎస్ను నిర్దేశిత కక్ష్యలో ఉంచడం మళ్లీ సాధ్యమే అయినప్పటికీ అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇందుకే 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయాలని నిర్ణయించారు.ఎలా కూలుస్తారు..?ఐఎస్ఎస్ను తొలుత కక్ష్యలో నుంచి తప్పించి(డీఆర్బిట్) నెమ్మదిగా భూమిపై కూల్చేస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమిపై కూల్చేయడం సాధారణ విషయం కాదు. దీనిని చాలా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ నైపుణ్యంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయరు చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్ వాహనాన్ని నాసా వాడనుంది. 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయనున్నప్పటికీ 18 నెలల ముందే డీ ఆర్బిట్ వెహికిల్ నింగిలోకి వెళ్లి ఐఎస్ఎస్తో అనుసంధానమవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి జాగ్రత్తగా భూ వాతావరణానికి తీసుకువస్తారు. భూ వాతావరణానికి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దాని శకలాలను మనుషులెవరూ ఉండని దక్షిణ పసిఫిక్ ఐలాండ్లలో పడేలా చేస్తారు. డీఆర్బిట్ వెహిహికల్ ఎలా పనిచేస్తుంది..సాధారణంగా ఐఎస్ఎస్కు వ్యోమగాములను మోసుకెళ్లి దానితో అనుసంధానమయ్యే డ్రాగన్ కాప్స్యూల్స్‌తో పోలిస్తే డీఆర్బిట్ వెహికిల్ యూఎస్‌డీవీకి ఆరు రెట్ల ఎక్కువ శక్తి కలిగిన ప్రొపల్లెంట్ ఉంటుంది. డీ ఆర్బిట్ వెహికిల్ ఐఎస్ఎస్ డీ కమిషన్‌కు 18 నెలల ముందే వెళ్లి దానితో అనుసంధానమవుతుంది. ఇంకో వారంలో ఐఎఎస్ఎస్ డీ ఆర్బిట్ అవనుందనగా యూఎస్‌డీవీలోని ఇంధనాన్ని మండించి ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమివైపు తీసుకురావడం మొదలుపెడతారు. చివరిగా భూ వాతావరణంలోకి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దీంతో ఐఎస్ఎస్ 30 ఏళ్ల ప్రస్థానం ముగిసిపోతుంది.ఐఎస్ఎస్ తర్వాత నాసా ప్లానేంటి..? పరిశోధనలు ఎలా..? ఐఎస్ఎస్ చరిత్రగా మారిన తర్వాత సొంతగా కొత్త స్పేస్ స్టేషన్లను అభివృద్ధి చేసే ప్లాన్ అమెరికాకు లేదు. ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న స్పేస్ స్టేషన్లను అద్దెకు తీసుకుని అంతరిక్ష పరిశోధనలు చేసే అవకాశముంది. ఒకవేళ 2030కల్లా ప్రైవేట్ కంపెనీల స్పేస్ స్టేషన్లు సిద్ధం కాకపోతే డీ ఆర్బిట్ వెహికిల్‌ను వాడి ఐఎస్ఎస్ జీవితకాలాన్ని పొడిగించాలన్న ప్లాన్ బీ కూడా నాసాకు ఉండటం విశేషం. -
INS Khukri: రక్షణ సేవలో 32 ఏళ్లు.. 30 సార్లు ప్రపంచాన్ని చుట్టి..
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి సేవల నుంచి నిష్క్రమించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ యుద్ధనౌక శత్రు నౌక ఎటువంటిది, ఏ దేశానికి చెందినది అనేది లెక్క చెయ్యకుండా మిసైల్ దాడులతో ధ్వంసం చేయగలదు. మజ్గావ్ డాక్లో తయారైన ఐఎన్ఎస్ ఖుక్రి 1989లో భారత నౌకాదళంలో చేరింది. 32 ఏళ్లపాటు భారత రక్షణలో పాలుపంచుకున్న ఖుక్రి వీడ్కోలు కార్యక్రమాన్ని విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాస్తమయం సమయంలో ఖుక్రి నౌకపై ఉన్న జాతీయ జెండా, నౌకాదళ పతాకాన్ని అవనతం చేసి, డీకమిషనింగ్ పెనెంట్‌ని కిందికి దించారు. అనంతరం ఖుక్రీలో పని చేసి రిటైర్ అయిన కమాండింగ్ అధికారుల్ని వైస్ అడ్మిరల్ బిస్వజిత్ అభినందించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఆర్మీ గూర్ఖా బ్రిగేడ్ లెఫ్టినెంట్ జనరల్ పీఎన్ అనంతనారాయణ్ తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా నిర్మించిన తొలి క్షిపణి కార్వెట్టి ఐఎన్ఎస్ ఖుక్రీ సేవలు ఉపసంహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాహసానికి ప్రతీక ఖుక్రి అంటే సాహసోపేతం అని అర్థం. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధ సమయంలో శత్రువుల్ని మట్టికరిపించేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి పాక్ సముద్రజలాల వైపు దూసుకెళ్లింది. అయితే.. సబ్‌మెరైన్ పీఎన్ఎస్ హన్‌గోర్‌లో పొంచి ఉన్న పాక్ సైనికులు డయ్యు సమీపంలో ఖుక్రీని టార్పెడోలతో ధ్వంసం చేశారు. ఖుక్రీతో పాటు ఆ నౌకలోని 18 మంది అధికారులు, 176 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఖుక్రి కమాండింగ్ అధికారి కెప్టెన్ మహింద్రనా«ధ్ ముల్లా తన లైఫ్ జాకెట్‌ని జూనియర్ ఆఫీసర్‌కి ఇచ్చి రక్షించి.. తాను ప్రాణాలు వదిలారు. ఖుక్రిని నాశనం చేసిన 48 గంటల్లోనే కరాచీ రేవుని భారత రక్షణ దళం స్వాధీనం చేసుకొని పాక్‌పై విజయం సాధించింది. భారత రక్షణ శాఖలో తిరుగులేని పోరాట స్ఫూర్తి రగిలించిన ఖుక్రి పేరుతో ఈ నౌకని నిర్మించారు. 1989 ఆగస్టు 23న పాత ఖుక్రి నౌకలో అసువులు బాసిన కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా సతీమణి సుధా ముల్లా దీనిని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సేవలందించింది. కీలకమైన ఆపరేషన్లు నిర్వహించింది. ఇప్పటివరకూ ఖుక్రిలో 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు. మొత్తం 6,44,897 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం 30 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చినంత. భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరానికి మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఐఎన్ఎస్ ఖుక్రి విశేషాలివీ.. పొడవు 91.1 మీటర్లు బీమ్ 10.5 మీటర్లు డ్రాట్ 4.5 మీటర్లు బరువు 1,350 టన్నులు వేగం గంటకు 25 నాటికల్ మైళ్లు సామర్థ్యం 16 నాటికల్ మైళ్ల వేగంతో ఏకధాటిగా 7,400 కిమీ దూరం ప్రయాణించగలదు ఆయుధాలు పీ–20ఎం యాంటీషిప్ మిసైల్స్– 4, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్– 2, ఏకే–176 గన్ ఒకటి, ఏకే–630 గన్స్ 2 ఎయిర్‌క్రాఫ్ట్ హల్ ధ్రువ్ హెలికాఫ్టర్– 1 -
INS Khukri: ‘సాహసిక’.. సెలవిక
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి సేవల నుంచి నిష్క్రమించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ యుద్ధనౌక శత్రు నౌక ఎటువంటిది, ఏ దేశానికి చెందినది అనేది లెక్క చెయ్యకుండా మిసైల్ దాడులతో ధ్వంసం చేయగలదు. మజ్గావ్ డాక్లో తయారైన ఐఎన్ఎస్ ఖుక్రి 1989లో భారత నౌకాదళంలో చేరింది. 32 ఏళ్లపాటు భారత రక్షణలో పాలుపంచుకున్న ఖుక్రి వీడ్కోలు కార్యక్రమాన్ని విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాస్తమయం సమయంలో ఖుక్రి నౌకపై ఉన్న జాతీయ జెండా, నౌకాదళ పతాకాన్ని అవనతం చేసి, డీకమిషనింగ్ పెనెంట్‌ని కిందికి దించారు. అనంతరం ఖుక్రీలో పని చేసి రిటైర్ అయిన కమాండింగ్ అధికారుల్ని వైస్ అడ్మిరల్ బిస్వజిత్ అభినందించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఆర్మీ గూర్ఖా బ్రిగేడ్ లెఫ్టినెంట్ జనరల్ పీఎన్ అనంతనారాయణ్ తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా నిర్మించిన తొలి క్షిపణి కార్వెట్టి ఐఎన్ఎస్ ఖుక్రీ సేవలు ఉపసంహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాహసానికి ప్రతీక ఖుక్రి అంటే సాహసోపేతం అని అర్థం. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధ సమయంలో శత్రువుల్ని మట్టికరిపించేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి పాక్ సముద్రజలాల వైపు దూసుకెళ్లింది. అయితే.. సబ్‌మెరైన్ పీఎన్ఎస్ హన్‌గోర్‌లో పొంచి ఉన్న పాక్ సైనికులు డయ్యు సమీపంలో ఖుక్రీని టార్పెడోలతో ధ్వంసం చేశారు. ఖుక్రీతో పాటు ఆ నౌకలోని 18 మంది అధికారులు, 176 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఖుక్రి కమాండింగ్ అధికారి కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా తన లైఫ్ జాకెట్‌ని జూనియర్ ఆఫీసర్‌కి ఇచ్చి రక్షించి.. తాను ప్రాణాలు వదిలారు. ఖుక్రిని నాశనం చేసిన 48 గంటల్లోనే కరాచీ రేవుని భారత రక్షణ దళం స్వాధీనం చేసుకొని పాక్‌పై విజయం సాధించింది. భారత రక్షణ శాఖలో తిరుగులేని పోరాట స్ఫూర్తి రగిలించిన ఖుక్రి పేరుతో ఈ నౌకని నిర్మించారు. 1989 ఆగస్టు 23న పాత ఖుక్రి నౌకలో అసువులు బాసిన కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా సతీమణి సుధా ముల్లా దీనిని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సేవలందించింది. కీలకమైన ఆపరేషన్లు నిర్వహించింది. ఇప్పటివరకూ ఖుక్రిలో 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు. మొత్తం 6,44,897 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం 30 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చినంత. భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరానికి మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. -
ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: భారత నావికా దళ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విరాట్’ను విచ్ఛిన్నం చేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జాతి ప్రయోజనాల రీత్యా నావికాదళ నౌకని విచ్ఛిన్నం చేయరాదని, ఈ చారిత్రక నౌకను భద్రపరచాలని కోరుతూ ఓ ప్రైవేటు కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. ఈ నౌకను ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేసి, సముద్ర మ్యూజియంగా మార్చాలని భావిస్తోన్న ఎంఎస్ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. గత ఏడాది జరిగిన వేలంపాటలో దాదాపు రూ.65కోట్లకు శ్రీరాం షిప్ బ్రేకర్స్ దీన్ని కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని అలంగ్ బీచ్‌లో ఈ నౌకను విచ్ఛిన్నంచేయనుంది. రూ. 100 కోట్లకు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు ఎన్విటెక్ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించాల్సిందిగా హోం శాఖను, నౌక ప్రస్తుత యజమానిని కోర్టు కోరింది. ఈ నౌకను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ గతంలో బాంబే హైకోర్టుని ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ కంపెనీ అభ్యర్థించింది. నౌకను కొనుగోలు చేసేందుకు ఎన్ఓసీ కోరిన ప్రైవేటు కంపెనీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా గత ఏడాది నవంబర్ 3న, జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ మిలిండ్ జాధవ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. -
నేవీకి 'అల్బాట్రాస్' బై బై
న్యూఢిల్లీ: భారతీయ నేవీ నుంచి మరో దిగ్గజం రిటైర్ కానుంది. హిందూ మహాసముద్రంపై 30 ఏళ్ల పాటు డేగ కన్ను వేసిన టుపోలెవ్-142ఎమ్ ఎయిర్‌క్రాఫ్ట్(రష్యా నుంచి కొనుగోలు చేశారు) ఈ నెలాఖరుకు విధుల్లో నుంచి తప్పుకోనుంది. టర్బోప్రొపెల్లర్తో నడిచే టుపోలెవ్-142ఎమ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, వేగవంతమైనది. రాయల్ బ్రిటీష్ నేవీలో కొద్దికాలంపాటు సేవలందించిన టుపోలెవ్-142లను ఆ తర్వాత భారత నేవీ తీసుకుని 'అల్బాట్రాస్' అని నామకరణం చేసింది. 1988లో ఎనిమిది టీయూ-142ఎమ్‌లను నేవీ ఇండక్ట్ చేసింది. యాంటీ సబ్‌మెరైన్ ఆపరేషన్లలో టీయూ-142ఎమ్‌లు ఎనలేని సేవలు అందించాయి. తమిళనాడులోని అరక్కోనం వద్ద మార్చి 29న భారత నేవీ టీయూ-142 విమానాలకు ఘనంగా వీడ్కోలు పలుకుతుందని ఓ నేవీ అధికారి చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ ప్రొపెల్లర్ జెట్ కూడా టీయూ-142 అంత ఎత్తులో ఎగరలేదని అయితే టీయూ-142ల రాడార్ వ్యవస్ధ పాతదైపోయిందని చెప్పారు. అప్పటికీ వాటిని వినియోగించదలచినా పాత వ్యవస్ధలను పునరుద్ధిరించడానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతోందని తెలిపారు. దీంతో నేవీ వాటిని విధుల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీయూ-142ల స్ధానంలో దాదాపు 3.2 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన పన్నెండు పీ-8ఐ లాంగ్ రేంజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నేవీ వినియోగించనుంది. వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటివరకూ ఎనిమిది పీ-8ఐ విమానాలను అమెరికా భారత్‌కు అందించింది. భారత నేవీ నుంచి ఐఎన్ఎస్ విరాట్ ఇప్పటికే రిటైర్ అయిన విషయం తెలిసిందే.