సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పునర్నియమితులయ్యారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. హోంశాఖ స్థాయీ సంఘానికి వెంకయ్య సారథ్యం వహించడం ఇది వరుసగా అయిదోసారి. 2009-10 నుంచి 2012-13 మధ్య ఆయన నాలుగుసార్లు ఈ బాధ్యతలను నిర్వహించారు. కమిటీలో రాజ్యసభ నుంచి పదిమందికి, లోక్‌సభ నుంచి 21మందికి సభ్యులుగా స్థానం కల్పించారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ సహా పలు పార్టీల ముఖ్యనేతలు సభ్యులుగా గల ఈ కమిటీలో టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్‌కు కూడా ప్రాతినిధ్యం లభించింది.