రేడియో జాకీ భార్య ఆత్మహత్య | Ahmedabad suicide: Radio jockey’s wife jumps from 10-storey building | Sakshi
Sakshi News home page

రేడియో జాకీ భార్య ఆత్మహత్య

Published Fri, Jan 22 2016 11:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

రేడియో జాకీ భార్య ఆత్మహత్య - Sakshi

రేడియో జాకీ భార్య ఆత్మహత్య

అహ్మదాబాద్: ప్రముఖ రేడియో జాకీ కునాల్ భార్య భూమి దేశాయ్(28) ఆత్మహత్య చేసుకుంది. ఆనంద్ నగర్ ఏరియాలోని 10వ అంతస్థు టెర్రస్ నుంచి దూకి ఆమె ప్రాణాలు తీసుకుంది. శ్యామల్ క్రాస్ రోడ్ లో ఉన్న పది అంతస్తుల భవనం సచిన్ టవర్ వరకు కారులో వెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వివాహం చేసుకుని మూడు నెలలు తిరగ్గకుండానే ఆమె బలవంతంగా ప్రాణం తీసుకోవడం విషాదాన్ని నింపింది.

ఓ పోటీలో బహుమతి గెలుచుకున్న దేశాయ్ కు,  ప్రముఖ ప్రయివేట్ రేడియో స్టేషన్ లో పనిచేస్తున్న ఆర్జె కునాల్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో గత ఏడాది నవంబర్ 24న  వివాహం చేసుకున్నారు. హనీమూన్ కోసం బ్యాంకాక్ కు వెళ్లి ఈ జంట జనవరి 18న తిరిగి వచ్చింది. అక్కడే వీరి మధ్య విబేధాలు తలెత్తినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే భర్త నుంచి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరే  ఉంటోంది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదని గానీ సచిన్ టవర్ దగ్గర సూసైడ్ చేసుకుంటున్నట్టుగా గురువారం మధ్యాహ్నం మెసేజ్ పెట్టి, అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకేసింది. బ్యాంకాక్ లో తమ మధ్య విభేదాలు వచ్చినట్టుగా తల్లితో దేశాయ్ చెప్పుకున్నట్టు ఆమె తరపు బంధువు ఒకరు తెలిపారు. కానీ ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

అయితే ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతేదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఆమె ఆ భవనంపైకి వెళ్లినట్టు ఎసెఎంఎస్ ద్వారా తెలుస్తోందన్నారు. అయితే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని పోలీసు అధికారి పీవీ జడేజా తెలిపారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement