సీఎం పదవిపై ప్రతిష్టంభన
► ఎడపాడి, పన్నీర్ వర్గాల పట్టు
► ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్ర: మంత్రి వీరమణి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలోని వైరివర్గాల విలీనం సరే... ముఖ్యమంత్రి పదవి మాటేంటి? అనే అంశంపై చర్చల్లో ప్రతిష్టంభన నెల కొంది. సీఎం సీటు తమకే దక్కాలని పన్నీర్ వర్గం, కూడదంటూ ఎడపాడి వర్గం పట్టుపడు తుండగా, రాజీ అవసరమేంటనే వాదన పన్నీర్ వర్గంలో మొదలైంది. పన్నీర్, ఎడపాడి వర్గాలు ఏకంకావడం ద్వారా అన్నాడీ ఎంకేను కాపాడుకోవాలనే ప్రయత్నాలు గురువారం ప్రారంభమయ్యాయి. విలీనంపై ఇరువ ర్గాలు ఎవరికి వారు తమ వర్గీయులతో సమా వేశమై తాజా పరిస్థితిని సమీక్షించుకున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తన వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర సీనియర్ నేతలతో 2 గంటల పాటు సమావేశమ య్యారు. ఎడపాడి వర్గం మంత్రులు, లోక్‌సభ ఉపస భాపతి తంబిదురై చర్చలు జరిపారు. పన్నీర్ సెల్వం వర్గం షరతులన్నీ ఆమోదించడమా, మానడమా అని ఎడపాడి వర్గం మీ మాంసలో పడిపోయింది. శుక్రవారం నుంచి చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది.
ఎడపాడి వర్గంలో తర్జన భర్జనలు
పన్నీర్‌సెల్వం నిబంధనల్లో ఒకటైన శశికళ కుటుంబా న్ని దూరం పెట్టడం పూర్తయింది. జయ నివాసాన్ని స్మారక భవనంగా మార్చ డం, పన్నీర్ వర్గాన్ని మంత్రి వర్గంలో చేర్చుకోవడం వరకు ఎడపాడి వర్గం సమ్మతి స్తోంది. అయితే పన్నీర్‌సెల్వంను సీఎం చేయాలన్న నిబం ధనపై ఎడపాడి వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్నీర్‌సెల్వంతో అత్యవసరంగా చేతు లు కలపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎడపాడి వర్గానికి చెందిన మరో సీనియర్ నేత నిలదీస్తున్నారు.
విలీనంపై నోరుమెదపని సీఎం
అన్నాడీఎంకేలోని 2 వర్గాలు ఏకం కావడంపై సీఎం పళనిస్వామి మాత్రం నోరు మెదపడంలేదు. ఇరు వర్గాల విలీనంపై గురువారం మీడియా ప్రతినిధులు సీఎంను ప్రశ్నించగా...‘ఇది ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ గురించి ప్రశ్నలు వద్దు’ అంటూ దాటవేశారు. మరోవైపు శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహి ష్కరింపచేయడం ధర్మయుద్ధంలో తమ తొలి విజ యమని పన్నీర్ చేసిన ప్రకటనను మంత్రి జయ కుమార్ ఖండించారు.
కేంద్రం కుట్ర: మంత్రి వీరమణి
అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రపన్నిందని మంత్రి వీరమణి ఆగ్రహం వ్యక్తం చే శారు. లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై, మంత్రి జయకుమార్ వేర్వేరుగా తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్న ర్ విద్యాసాగర్‌రావును చెన్నై రాజ్‌భవన్‌లో కలుసుకు న్నారు. గవర్నర్‌కు కలసిన అనంతరం తంబిదురై సీఎంతో రహస్య చర్చలు జరిపారు.
పన్నీర్ వర్గం నిబంధనలు
- శశికళ, దినకరన్‌లను బహిష్కరించాలి
- పన్నీర్‌ను సీఎంగాను, పళనిని డిప్యూటీ సీఎంగా ను చేయాలి
- తమ వారిలో కొందరికి మంత్రి పదవులివ్వాలి
- ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరపాలి
- ఎన్నికలు ముగిసేవరకు పార్టీని నడిపించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి
- పోయెస్ గార్డన్‌లోని జయ నివాసాన్ని స్మారక భవనంగా మార్చాలి
- కేంద్ర కేబినెట్‌లో భాగస్వాములం కావాలి
- ఈ నిబంధనలకు కట్టుబడి చర్చలు ప్రారం భించాలి