veeramani
-
అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..
సాక్షి, వికారాబాద్: అదనపు కట్నం కోసం భర్త, అత్త పెడుతున్న వేధింపులను భరించలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ రామకృష్ణ, ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపల్లినికి చెందిన వీరమణి(30)ని మార్చి 16, 2017లో ధారూరుకి చెందిన జక్కెపల్లి లాల్కుమార్కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.20వేల నగదు, 3 తులాల బంగారం, బడి బాసండ్లు ఇచ్చారు. అయితే వీరమణికి.. కార్తీక్(6), కృతిక(3) ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకోడానికి అదనపు కట్నం తీసుకురావలంటూ అత్త లక్ష్మి, భర్త లాల్‌కుమార్ వేధించసాగారు. ఈ నేపథ్యంలో వీరమణి పుట్టింటివారు ఇంటి నిర్మాణానికి ఆగస్టు 30, 2020న రూ. 2.50 లక్షలు, 2021లో రెండోసారి రూ.3 లక్షలు ఇచ్చారు. డబ్బులు సరిపోలేవని భర్త, అత్త మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయగా మూడు నెలల క్రితం వీరమణి అమ్మ మూడోసారి రూ.2.20 లక్షలు ఇచ్చింది. ఈనెల 24న కూతురు, అల్లుడు కలిసి దసరా పండుగ సందర్భంగా ఇంటికి వచ్చారని అత్త లక్ష్మి(మృతురాలి అమ్మ) పేర్కొంది. కొత్తకారు తీసుకున్నా డబ్బులు తక్కువపడ్డాయి, రూ.50 వేలు కావాలని అల్లుడు లాలుకుమార్ అత్త, బామ్మర్ది వెంకటేశ్‌ను డిమాండు చేశాడు. ప్రస్తుతం మా దగ్గర డబ్బులు లేవని తర్వాత ఇస్తామని చెప్పడంతో కోపోద్రిక్తుడైన లాల్‌కుమార్ ఉన్నపలంగా భార్యను తీసుకుని ఇంటికి వచ్చేసాడు. అదేరోజు రాత్రి భర్త, అత్త కలిసి వీరమణిని డబ్బులు తేవాలంటూ హింసించారు. వేధింపులు భరించలేని వీరమణి బుధవారం మధ్యాహ్నం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అదేరోజు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్త, భర్త కలిసి తన కూతుర్ని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసించారని, ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురి భర్త, అత్తపై కఠిన చ్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి శవానికి గురువారం పోస్టుమార్టమ్ చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఇద్దరితో ప్రేమాయణం.. మరో యువతితో నిశ్చితార్థం.. సినీ ఫక్కీలో పోలీస్ ఎంట్రీతో షాక్! -
ఒలింపిక్ స్ఫూర్తి..థ్యాంక్యూ అమ్మమ్మా!
అమ్మమ్మలు, నానమ్మలు ఏం చేస్తారు? ఇదిగో దేశానికి ఇలాంటి వరాల మూటను అందిస్తారు. తమిళనాడు నుంచి ఒలింపిక్స్‌కు పయనమైన 23 ఏళ్ల రేవతి వీరమణి 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలే పరుగులో భారత్‌కు మెడల్ అవకాశాలపై ఆశలు రేపుతోంది. ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన రేవతిని పనిలో పెట్టు అని అందరూ ఆమె అమ్మమ్మకు సూచిస్తే ‘నా మనవరాలు చదువుకోవాలి’ అని ఇటుక బట్టీల్లో తాను శ్రమించి రేవతిని క్రీడాకారిణిని చేసిందా అమ్మమ్మ. అందుకే ‘ఇదంతా మా అమ్మమ్మ’ ఘనతే అంటోంది రేవతి. విధి జీవితంతో ఆట ఆడొచ్చు. కాని విధిని గెలిచే ఆట మనం తప్పక ఆడాలి. 2016. కోయంబత్తూరులో 32వ జూనియర్ అథ్లెటిక్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. 100 మీటర్ల పరుగు ఫైనల్. ట్రాక్ మీద ఉన్న ఆ అమ్మాయిని ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి జమాజట్టీల్లాంటి జూనియర్ అథ్లెట్లు ట్రాక్ మీద ఉన్నారు. తుపాకీ మోగింది. ఆ అమ్మాయి చిరుతలా కదిలింది. రెప్పపాటు సమయంలో 100 మీటర్లను ముగించింది. 12.2 సెకన్ల కాలంలో 100 మీటర్లను ఫినిష్ చేసిన ఆ అమ్మాయి పేరేమిటా అని అందరూ ఆరా తీశారు. రేవతి వీరమణి. ఆ తర్వాత ఆ చాంపియన్‌షిప్‌లో రేవతి 200 మీటర్లను, 4 X 100 రిలేను గెలిచి తమిళనాడును పతకాల పంటలో రెండోస్థానంలో నిలిపింది. అప్పుడే అందరూ అనుకున్నారు ఈ అమ్మాయి ఒలింపిక్స్ వరకూ వెళుతుందని. ఇవాళ అదే జరిగింది. జపాన్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో పాల్గొననుంది రేవతి. కచ్చితంగా మెడల్ సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. అమ్మమ్మ అరమ్మాళ్తో రేవతి వీరమణి ఉత్త కాళ్లతో పరిగెత్తి... రేవతిది మదురైకు ఆనుకుని ఉండే సక్కిమంగళం అనే చిన్న పల్లె. ఆమెకు ఏడేళ్ల వయసు ఉండగా తండ్రి ఉదర సంబంధమైన వ్యాధితో మరణించాడు. ఆ తర్వాత ఆరు నెలలకే తల్లి బ్రెయిన్ ఫీవర్‌తో ప్రాణాలు వదిలింది. రేవతి, రేవతి చెల్లెలు అనాథలయ్యారు. ఆ సమయంలో వారి వెనుక ఉక్కు గోడలా నిలిచి కాపాడుకుంది అమ్మమ్మ అరమ్మాళ్. ఇద్దరు మనవరాళ్లను ఆమె ప్రాణంగా పెంచుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె అతి పేదరాలు. పొలాల్లో, ఇసుక బట్టీల్లో పని చేస్తేనే పొట్ట నిండేది. ‘నువ్వు వాళ్లను ఏం పెంచుతావు. పనిలో పెట్టు’ అని బంధువులందరూ చెప్పినా ‘నా మనవరాళ్లను చదివించుకుంటాను’ అని ఆమె కష్టపడింది. రేవతిని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఇంటర్వెల్లో ఉత్త కాళ్ల మీద వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మను చూసి వెళ్లేది. ‘తూనీగలాగా పరిగెడతా ఉంది’ అనుకున్న అమ్మమ్మ పరుగులో రేవతిని ప్రోత్సహించింది. షూస్ కొనుక్కునే స్తోమత కూడా లేని రేవతి ఉత్త కాళ్లతో పల్లె రోడ్ల మీద పరుగులు తీస్తూ ప్రాక్టీసు చేసేది. ఆ సమయంలోనే మదురైకి చెందిన కోచ్ కన్నన్ దృష్టిలో పడటంతో రేవతి జీవితం మారింది. అమ్మమ్మను ఒప్పించి ఇంటర్ వరకూ ప్రాక్టీసుకు ఒప్పుకున్న అరమ్మాళ్ డిగ్రీ మదురైలో ఉండి చదువుకుంటూ రన్నింగ్‌ను సాధన చేయాలని కోచ్ చెప్పేసరికి భయపడింది. కాని కాలేజీలో సీటు ఫ్రీ హాస్టల్ ఏర్పాటు చేశాక అంగీకరించింది. మదురై పల్లెల్లో పిల్లలు చాలా వేగంగా ఆటలు ఆడతారు. వారికి జల్లికట్టు, మంజు విరాట్టు వంటి ఆటలు వేగాన్ని ఇస్తాయి. రేవతికి కూడా అలాంటి వేగం వచ్చింది. జాతీయస్థాయిలో మెడల్స్ సాధించి తమిళనాడు ప్రభుత్వ ప్రోత్సాహం అందుకుంది. అలాగే రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం పొందింది. ఆమె చెల్లెలు పోలీస్ ఆఫీసర్ అయ్యింది. గాయపడినా... ఆసియా క్రీడల్లో రేవతి 4 X 400 రిలేలో 4వ స్థానంలో వచ్చింది. వరల్డ్ ఛాంపియన్ షిప్లో కూడా పాల్గొంది. కాని ఆ తర్వాత ఆమెకు మోకాలి సమస్య వచ్చింది. ‘నేను చాలా కష్టపడాల్సి వచ్చింది దాని నుంచి బయటపడటానికి’ అని రేవతి అంది. రేవతి అమ్మమ్మ ఆ సమయంలో మనవరాలి ఆత్మస్థయిర్యం చెదరకుండా చూసుకుంది. ‘ఆమె నన్ను ఆపలేదు. వెళ్లు. పరిగెత్తు’ అంది. కోచ్‌ల సాయంతో మళ్లీ నేను మామూలు స్థితికి వచ్చాను’ అంది రేవతి. ఒలంపిక్స్ సన్నాహాల్లో భాగంగా పాటియాలాలో జరిగిన క్యాంప్‌లో 4 X 400 మిక్స్డ్ రిలేలో 54 సెకన్ల వ్యక్తిగత సమయాన్ని నమోదు చేసింది రేవతి. ∙∙ రేవతి జపాన్‌కు వెళ్లింది. ఆమె అమ్మమ్మ ఎప్పటిలాగే పొలంలో పని చేసుకుంటూ మనవరాలు తెచ్చే శుభవార్త కోసం ఎదురు చూస్తోంది. రేవతి మెడల్ తెస్తే అందులో సగం ఆమె అమ్మమ్మకే దక్కుతుంది. అమ్మమ్మ లేకపోతే ఇవాళ నేను లేను. కూతురి పెళ్లి చేసి బాధ్యతలు తీరాయి అనుకునే వయసులో నేను, నా చెల్లి ఆమె ఒడికి చేరాము. ఆమె తిరిగి మాకు అమ్మైంది. ఆమెకు చెప్పకుండా నేను ఏ పనీ చేయను. మేము కాకుండా ఆమెకు వేరే లోకం లేదు. – రేవతి -
సీఎం పదవిపై ప్రతిష్టంభన
► ఎడపాడి, పన్నీర్ వర్గాల పట్టు ► ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్ర: మంత్రి వీరమణి సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలోని వైరివర్గాల విలీనం సరే... ముఖ్యమంత్రి పదవి మాటేంటి? అనే అంశంపై చర్చల్లో ప్రతిష్టంభన నెల కొంది. సీఎం సీటు తమకే దక్కాలని పన్నీర్ వర్గం, కూడదంటూ ఎడపాడి వర్గం పట్టుపడు తుండగా, రాజీ అవసరమేంటనే వాదన పన్నీర్ వర్గంలో మొదలైంది. పన్నీర్, ఎడపాడి వర్గాలు ఏకంకావడం ద్వారా అన్నాడీ ఎంకేను కాపాడుకోవాలనే ప్రయత్నాలు గురువారం ప్రారంభమయ్యాయి. విలీనంపై ఇరువ ర్గాలు ఎవరికి వారు తమ వర్గీయులతో సమా వేశమై తాజా పరిస్థితిని సమీక్షించుకున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తన వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర సీనియర్ నేతలతో 2 గంటల పాటు సమావేశమ య్యారు. ఎడపాడి వర్గం మంత్రులు, లోక్‌సభ ఉపస భాపతి తంబిదురై చర్చలు జరిపారు. పన్నీర్ సెల్వం వర్గం షరతులన్నీ ఆమోదించడమా, మానడమా అని ఎడపాడి వర్గం మీ మాంసలో పడిపోయింది. శుక్రవారం నుంచి చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. ఎడపాడి వర్గంలో తర్జన భర్జనలు పన్నీర్‌సెల్వం నిబంధనల్లో ఒకటైన శశికళ కుటుంబా న్ని దూరం పెట్టడం పూర్తయింది. జయ నివాసాన్ని స్మారక భవనంగా మార్చ డం, పన్నీర్ వర్గాన్ని మంత్రి వర్గంలో చేర్చుకోవడం వరకు ఎడపాడి వర్గం సమ్మతి స్తోంది. అయితే పన్నీర్‌సెల్వంను సీఎం చేయాలన్న నిబం ధనపై ఎడపాడి వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్నీర్‌సెల్వంతో అత్యవసరంగా చేతు లు కలపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎడపాడి వర్గానికి చెందిన మరో సీనియర్ నేత నిలదీస్తున్నారు. విలీనంపై నోరుమెదపని సీఎం అన్నాడీఎంకేలోని 2 వర్గాలు ఏకం కావడంపై సీఎం పళనిస్వామి మాత్రం నోరు మెదపడంలేదు. ఇరు వర్గాల విలీనంపై గురువారం మీడియా ప్రతినిధులు సీఎంను ప్రశ్నించగా...‘ఇది ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ గురించి ప్రశ్నలు వద్దు’ అంటూ దాటవేశారు. మరోవైపు శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహి ష్కరింపచేయడం ధర్మయుద్ధంలో తమ తొలి విజ యమని పన్నీర్ చేసిన ప్రకటనను మంత్రి జయ కుమార్ ఖండించారు. కేంద్రం కుట్ర: మంత్రి వీరమణి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రపన్నిందని మంత్రి వీరమణి ఆగ్రహం వ్యక్తం చే శారు. లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై, మంత్రి జయకుమార్ వేర్వేరుగా తమిళనాడు ఇన్చార్జ్ గవర్న ర్ విద్యాసాగర్‌రావును చెన్నై రాజ్‌భవన్‌లో కలుసుకు న్నారు. గవర్నర్‌కు కలసిన అనంతరం తంబిదురై సీఎంతో రహస్య చర్చలు జరిపారు. పన్నీర్ వర్గం నిబంధనలు శశికళ, దినకరన్‌లను బహిష్కరించాలి పన్నీర్‌ను సీఎంగాను, పళనిని డిప్యూటీ సీఎంగా ను చేయాలి తమ వారిలో కొందరికి మంత్రి పదవులివ్వాలి ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరపాలి ఎన్నికలు ముగిసేవరకు పార్టీని నడిపించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి పోయెస్ గార్డన్‌లోని జయ నివాసాన్ని స్మారక భవనంగా మార్చాలి కేంద్ర కేబినెట్లో భాగస్వాములం కావాలి ఈ నిబంధనలకు కట్టుబడి చర్చలు ప్రారం భించాలి -
ఈ మేడమ్ మాకొద్దు!
శంషాబాద్ రూరల్ : చాలీచాలని భోజనం పెట్టడమే కాదు.. నిత్యం వేధింపులు. కాస్మొటిక్స్, యూనిఫాంలు అడిగితే.. మీ ముఖాలకు అవి అవసరమా అంటూ హేళన. అంతేకాదు.. హాస్టల్‌కు వచ్చిన సరుకులను పక్కదోవ పట్టించి సొమ్ము చేసుకోవడం.. ఇన్నాళ్లూ వీటన్నింటినీ మౌనంగా భరించిన పాల్మాకుల క స్తూర్బాగాంధీ గిరిజన బాలికల విద్యాలయం విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మాకు న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆందోళనలో విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ దేవి, అకౌంటెంట్ వీరమణిలు కుమ్మక్కై సరుకులను బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ఎక్కువ చూపి మిగిలిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. స్థానికంగా ఉన్న ఓ రేషన్ డీలరుకు ఈ సరుకులను ఎవరికీ తెలియకుండా రాత్రి వేళ విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ నెల 12న రాత్రి ఉపాధ్యాయులను అందరినీ ఇంటికి పంపించిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ దేవి విద్యార్థులను కూడా టీవీ చూడమంటూ గదిలోకి పొమ్మందని, చదువుకుంటామని కొందరు చెప్పినా వినకుండా టీవీ గదిలోకి వెళ్లగొట్టిందని ఆరోపించారు. అనంతరం హాస్టల్లో ఉన్న మూడు క్వింటాళ్ల బియ్యం, 30 లీటర్ల మంచినూనె, 30 కిలోల కందిపప్పు, 25 కిలోల చక్కెర, 63 ఖాళీ గోనె సంచులను ఓ ఆటోలో ఎక్కించిందన్నారు. విషయం పసిగట్టి అక్కడికి చేరుకుని.. సరుకులు ఎక్కడికి పంపిస్తున్నారని ప్రశ్నిస్తే స్పెషల్ ఆఫీసర్ మమ్ములను బెదిరించిందని వెల్లడించారు. అదేరోజు రాత్రి ఆందోళనకు దిగడంతో విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని భావించిన స్పెషల్ ఆఫీసర్.. సరుకులను మరుసటి రోజు తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ పాఠశాలకు తెప్పించారన్నారు. పాఠశాల నిర్వహణ తీరుపై నిలదీస్తే.. మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిందని విద్యార్థులు వాపోయారు. నీచంగా మాట్లాడుతోంది.. స్పెషల్ ఆఫీసర్ దేవి మా పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కించపరుస్తూ ఇష్టంవచ్చినట్టు తిడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ గుడ్డు ఇవ్వాల్సి ఉండగా రోజువిడిచిరోజు ఇస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజుల నుంచి కూరగాయలు వండకుండా కేవలం సాంబారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. పాఠశాల ప్రారంభం అయినప్పటినుంచి కేవలం మూడు సార్లు మాత్రమే పండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఎవరైనా తనిఖీకి వస్తే అంతా సవ్యంగా ఉందని చెప్పాలంటూ బెదిరిస్తున్నదని ఆరోపించారు. తప్పు జరిగింది క్షమించండి విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న విలేకరులు పాఠశాల వద్దకు చేరుకోవడంతో స్పెషల్ ఆఫీసర్ దేవి ‘తప్పు జరిగింది.. ఈ ఒక్కసారికి క్షమించండి’ అంటూ విద్యార్థులను వేడుకున్నారు. ‘నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను.. నన్ను వదిలేయండి’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. పాఠశాల నిర్వహణ ఎలాగో తనకు తెలియదని, అకౌంటెంట్ చెబితేనే సరుకులను బయటకి పంపించానని చెప్పారు. ‘దేవి మేడమ్ విద్యార్థుల హాజరును ఎక్కువగా చూపించాలని చెబితేనే తాను అలా చేశాన’ని అకౌంటెంట్ వీరమణి వివరణ ఇచ్చారు. ఇంతలో స్థానిక నాయకులు కొందరు రంగంలోకి దిగి విద్యార్థులకు, అధ్యాపక బృందానికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
వామ్మో.. స్వైన్‌ఫ్లూ!
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వ్యాధి పేరు వింటేనే మండలంలోని మాటూరు వాసులు హడలిపోతున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ వ్యాధిబారినపడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామానికి చెందిన శెట్టి వీరమణి (45) గత 15 రోజులుగా దగ్గు, జ్వరం, తలనొప్పితో బాధపడుతుంది. అయితే ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి 20 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలకు విహారయాత్రలకు వెళ్లారు. ఆ సమయంలో అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్సచేయించారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈనెల 14న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలు నిర్వహించిన అక్కడి వైద్యులు వీరమణికి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని నిర్ధారించారు. అయితే వెంటనే అక్కడి వైద్యులు జిల్లా వైధ్యాధికారులకు సమాచారమిచ్చారు. గ్రామాన్ని సందర్శించి జిల్లా వైద్యాధికారులు మాటూరు గ్రామంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్ఓ) రుక్మిణమ్మతో పాటు, జిల్లా వైద్యసిబ్బంది గ్రామాన్ని సందర్శించి వీరమణి కుటుంబసభ్యులకు మందులు పంపిణీచేశారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఆదివారం నుంచి గ్రామంలో క్యాంపుఏర్పాటు ఏర్పాటుచేయాలని స్థానిక వైద్యాధికారులకు ఆదేశించారు. డీఐఓ వెంకట రంగారావు, ఎస్పీహెచ్ఓ లలిత గ్రామాన్ని సందర్శించా రు. వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వరం, దగ్గు, తలనొప్పితో బాధపడేవారి వివరాలను సేకరించింది.