![Air India Will Regain Glory, Says Jayant Sinha - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/03/29/jayant-sinha.jpg.webp?itok=nJichRwp)
రాంచీ: యూపీఏ సర్కారు ‘మహారాజా’ (ఎయిరిండియా)ను బికారీ (బిచ్చగాడి)గా మార్చిందని పౌర విమానయాన మంత్రి జయంత్ సిన్హా విమర్శించారు. మహారాజాకు మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే ఎయిరిండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిందన్నారు. ఎయిరిండియాను మళ్లీ లాభాల బాట పట్టిస్తామన్నారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను విక్రయిస్తామని తెలిపారు. ఎయిరిండియా సంస్థకు ‘మహారాజా’ లోగో ఉన్న సంగతి తెలిసిందే.
ఇకనుంచి ఈ సంస్థ నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ ప్రైవేటు సంస్థ చేతిలో ఉంటుందని అన్నారు. అయితే సంస్థ ఉద్యోగులే పెద్ద మొత్తంలో వాటాలను సొంతం చేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. తద్వారా సంస్థ పురోగతి మరింత వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన వివేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాల్ని వెల్లడించారు. ‘మీ తండ్రి యశ్వంత్ సిన్హా బుధవారం బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కలిశారు కదా.. దాని పై మీ స్పందన? అని విలేకరులు అడగ్గా.. అది పూర్తిగా ఆయన సొంత వ్యవహారం. అయినా రాజకీయల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం అని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment