న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు అమెరికా ఆసక్తి వ్యక్తం చేసింది. మూడు స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు మొత్తం 100 స్మార్ట్‌సిటీలకూ విస్తరించనున్నట్లు అమెరికా వాణిజ్య ఉప మంత్రి బ్రూస్ ఆండ్రూస్ చెప్పారు.ఈ సిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడి పెట్టడానికి, టెక్నాలజీ అందించటానికి వచ్చిన 18 అమెరికన్ కంపెనీల ప్రతినిధి బృందానికి ఆయన సారథి. విశాఖపట్నం మాస్టర్‌ప్లాన్‌కు సహకరించటంతో పాటు అలహాబాద్, అజ్మీర్‌లకు టెక్నాలజీ అందిస్తున్నట్లు యూఎస్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(యూఎస్‌టీడీఏ) డెరైక్టర్ జాక్ చెప్పారు.