‘వీసా’ వివాదానికి ఎయిరిండియానే కారణం | American University allegation | Sakshi
Sakshi News home page

‘వీసా’ వివాదానికి ఎయిరిండియానే కారణం

Published Thu, Jan 7 2016 6:39 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

‘వీసా’ వివాదానికి ఎయిరిండియానే కారణం - Sakshi

‘వీసా’ వివాదానికి ఎయిరిండియానే కారణం

అమెరికన్ వర్సిటీ ఆరోపణ
 
 వాషింగ్టన్: తమ సంస్థను అమెరికా ప్రభుత్వం ‘బ్లాక్‌లిస్ట్’లో ఉంచిందని ఎయిరిండియా తప్పుడు ప్రచారం చేస్తూ యూఎస్‌కు వస్తున్న తమ భారత విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందని అక్కడి నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ(ఎన్‌పీయూ) ఆరోపించింది. ఇటీవల ఆ వర్సిటీలో చేరేందుకు అమెరికా వెళ్లిన కొందరు భారత విద్యార్థులను అక్కడి అధికారులు వెనక్కి పంపడం తెలిసిందే. కొందరు విద్యార్థులు కూడా  పుకార్లు పుట్టించి తమ విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారని కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న ఎన్‌పీయూ అధ్యక్షుడు పీటర్ హిసియా విద్యార్థులకు లేఖ రావారు. ‘ముఖ్యంగా ఎయిర్‌ఇండియావల్ల  మా వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోంది. 

వర్సిటీలో చేరేందుకు వస్తున్న భారత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు’ అన్నారు.  అమెరికాకు రావాల్సిన విద్యార్థులను విమానం ఎక్కకుండా ఎయిరిండియా అడ్డుకుంటోంది. ఒకవేళ విద్యార్థులను అమెరికాలోకి అనుమతించకపోతే తిరిగి తీసుకురావల్సి వస్తుందని, ఎయిరిండియాపై ఆర్థిక భారం పెరుగుతుందని భావిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఎయిర్‌ఇండియా స్పందించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement