సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి కట్టడిపై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ఉన్నతాధికారులతో గురువారం సమావేశమయ్యారు. దేశ రాజధానిలో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో అమిత్ షా తరచూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులను నియంత్రించడంతో పాటు మరణాల రేటును తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించారు.
టెస్టింగ్ సామర్థ్యం పెంపు, పెద్దసంఖ్యలో బెడ్స్ అందుబాటులోకి తేవడం పైనా ఈ సమావేశంలో సంప్రదింపులు జరిపారు. ఇక కరోనా కట్టడిపై సోమవారం అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలు పార్టీలకతీతంగా మహమ్మారి కట్టడి కోసం పనిచేయాలని ఈ భేటీలో ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తోనూ అమిత్ షా సమావేశమై కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment