బిహార్లో మరో ఇంజనీర్ హత్య | An engineer found murdered last night in Bihar's Vaishali district | Sakshi
Sakshi News home page

బిహార్లో మరో ఇంజనీర్ హత్య

Published Tue, Dec 29 2015 8:51 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

బిహార్లో మరో ఇంజనీర్ హత్య - Sakshi

బిహార్లో మరో ఇంజనీర్ హత్య

వైశాలి: బిహార్లో గత మూడు రోజుల నుంచి దుండగులు రెచ్చిపోతున్నారు. వైశాలి జిల్లాలో ఓ ఇంజనీర్ సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని పోలీసులు మంగళవారం ఉదయం గుర్తించారు.

 కాగా, గత శనివారం దర్భంగా జిల్లాలో ఓ రహదారి నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు బ్రజేష్‌కుమార్‌, ముకేష్‌కుమార్‌లపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మరువక ముందే మరో ఇంజనీర్ హత్యకు గురవ్వడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement