ధన్‌బాద్: జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోషిప్‌పై పంచాయతీ శాఖలో పనిచేస్తున్న నలుగురు జూనియర్ అధికారులను శనివారం కిడ్నాప్ చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్(ఏపీ)కు చెందిన సాయి వర్ధన్ వంశీ కూడా ఉన్నారు. కిడ్నాప్ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం హేమంత్ సొరేన్ ఉద్యోగులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడిచి పెట్టాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. మరోపక్క, ఉద్యోగులను తక్షణమే విడిచి పెట్టాలనే డిమాండ్‌తో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు దిగుతామని జార్ఖండ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వివరాలు..
గిరిధ్ జిల్లాలోని పిర్టాండ్‌లో ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించేందుకు ప్రధాన మంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోషిప్‌పై పనిచేస్తున్న వంశీ సహా జూనియర్ అధికారులు శనివారం వెళ్లారు.
విధులు ముగించుకుని రాత్రి కారులో తిరిగొస్తుండగా వీరిని కారు డ్రైవర్‌తో సహా పియో గ్రామంలో మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
ఆదివారం ఉదయం మావోలు డ్రైవర్‌ను సురక్షితంగా విడిచిపెట్టారు. మిగిలిన వారిని తమ చెరలోనే ఉంచుకున్నారు.
జార్ఖండ్ మావోల చెరలో ఏపీ యువకుడు
Published Mon, Jan 27 2014 2:35 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement