సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. సీఎం జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో భేటీ అనంతరం మోదీ నేరుగా సభకు హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాల్సిందిగా సీఎం జగన్ ప్రధానిని కోరినట్టు తెలిసింది.
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని మోదీని కోరినట్టు సమాచారం. ఇక మోదీతో భేటీకి ముందు సౌత్ బ్లాక్‌లో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బృందం 40 నిముషాలపాటు సమావేశమైంది. సీఎంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment