తిరువనంతపురం: పర్యాటక స్వర్గధామం కేరళ అతలాకుతలమైంది. 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రంలో పెను విషాదాన్నే మిగిల్చాయి. వరదల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ వర్ష బీభత్సానికి ఇప్పటి వరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అయితే జంతువుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పెంపుడు జంతువులను జంతు ప్రేమికులు కాపాడే ప్రయత్నం చేస్తున్నా.. అటవీ జంతువులు కాపాడే నాధుడే కరువయ్యాడు. కొన్ని జింకలు సజీవంగా వరదల్లో కొట్టుకుపోతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అసలేం జరుగుతుందో తెలియక ఆ మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి.
రంగంలోకి హెచ్‌ఎస్‌ఐ
హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్(హెచ్‌ఎస్‌ఐ) జంతు సంరక్షణ సంస్థ మూగజీవులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఆ సంస్థ వాలంటీర్లు పెంపుడు జంతువులైన డాగ్స్, క్యాట్స్‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా వాటికి కావాల్సిన ఆహారాన్ని, వైద్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారీ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ మహిళా తన 25 శునకాలను కాపాడనిదే తను రాలేనని సహాయక బృందాలతో వారించడంతో.. రంగంలోకి దిగిన హెచ్‌ఎస్‌ఐ వాలంటీర్లు ఆ శునకాలను రక్షించి ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎప్పటికప్పుడు హెచ్‌ఎస్‌ఐ సంస్థ ఈ సహాయక చర్యల గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇస్తోంది. దీంతో నెటిజన్లు వీరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ( చదవండి: కేరళ విలవిల)
Comments
Please login to add a commentAdd a comment