NDRF services
-
మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహద్ తాలుకా కేంద్రంలోని కాజల్‌పూరలో ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవనం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద దాదాపు 51 మంది చిక్కుకొని ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం 45 ఫ్లాట్లు ఉన్న తారేక్ గార్డెన్ అపార్ట్మెంటు కుప్పకూలి పెద్ద ఎత్తున దుమ్ము పైకిలేచిన దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఏడుగురిని శిథిలాల కింది నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారి ఒకరు తెలిపారు. 10 ఏళ్ల కిందట నిర్మించిన ఈ అపార్ట్మెంటులో నివసించే వారిలో సగం మంది ప్రమాద సమయంలో వివిధ పనులపై బయటే ఉన్నట్లు తెలుస్తోంది. భవనం కూలుతున్న క్రమంలో దాదాపు 70 మంది బయటకు పరుగెత్తి ప్రాణాలను దక్కించుకున్నారని రాయ్‌గఢ్ కలెక్టర్ నిధి చౌదరి తెలిపారు. ఈ అపార్ట్మెం టులో నివసించే మరికొన్ని కుటుంబాలు కోవిడ్ కారణంగా స్వస్థలాలకు వెళ్లాయని ఆమె వెల్లడిం చారు. మొత్తం 51 మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి బయలుదేరాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఉంపన్.. కోల్‌కతా వణికెన్
కోల్‌కతా/భువనేశ్వర్/న్యూఢిల్లీ/ఢాకా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న సమయంలో పులి మీద పుట్రలా పశ్చిమబెంగాల్‌ను ఉంపన్ తుపాను గట్టి దెబ్బ తీసింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 72 మంది మరణించారు. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది. ఒక తుపాను ఈ స్థాయిలో కోల్‌కతాను ధ్వంసం చేయడం వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కోల్‌కతా అతలాకుతలమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు, వెయ్యికిపైగా సెల్ టవర్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీసుల కియాస్క్‌లు ధ్వంసమయ్యాయి. కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్లోని కొన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ ఫోన్లు మూగబోయాయి. కమ్యూనికేషన్ సదుపాయం లేక అంత పెద్ద నగరం అల్లాడిపోతోంది. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు పూర్తిగా ధ్వంసం కాగా, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరాలలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఇప్పట్నుంచే అంచనా వెయ్యలేమని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సుందర్బన్ డెల్టాలో కొన్ని కిలో మీటర్ల మేర ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. మరోవైపు తుపాను సహాయకకార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన నాలుగు అదనపు బృందాలు ఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకున్నాయి. రెండు జిల్లాలు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో ఈ అదనపు బలగాలు వచ్చాయి. ఢిల్లీలో నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో బెంగాల్, ఒడిశాలో సహాయ కార్యక్రమాలపై చర్చించినట్టు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్ చెప్పారు. ఒడిశాలో భారీగా పంట నష్టం ఉంపన్ తుపాను ఒడిశాలో కూడా తన ప్రతాపం చూపించింది. తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్, టెలికం వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. పంట నష్టం అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో 44.8 లక్షల మందిపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌ను అన్నివిధాల ఆదుకుంటామన్నారు. బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి: పెను తుపాను ఉంపన్ బంగ్లాదేశ్‌లోనూ విలయం సృష్టించింది. తీర ప్రాంతాల పల్లెలన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10 మంది వరకు మరణించారని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. గోడలు, చెట్లు కూలి మీద పడడం వల్లే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. కరోనా కంటే భయంకరమైనది : మమత కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌ను వణికించిన ఉంపన్ తుపాను కోవిడ్–19 కంటే భయంకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుపాను బీభత్సాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ‘ఉత్తర దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకోవాలి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చెయ్యాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంపన్ ప్రభావంతో అల్లాడిన ప్రాంతాలను సందర్శించాలి’ అని మమత అన్నారు. అండగా ఉంటాం: మోదీ పశ్చిమ బెంగాల్ తుపాను తీవ్రతపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను బీభత్స దృశ్యాలు చూశానని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని విధాల సహాయం అందిస్తామని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంప్రా«ర్థిస్తున్నామని, జాతియావత్తూ బెంగాల్‌కు అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్, ఒడిశాలకు కేంద్రం నుంచి పూర్తి సాయం అందుతుందని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. నేడు ప్రధాని మోదీ ఏరియల్ సర్వే ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను శక్తివంతమైన ఉంపన్ తుపాను వణికిస్తోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతాల్లో విద్యుత్, టెలికం, మౌలిక వసతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరిన వరద (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బటాలా: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి బటాలా ప్రాంతంలో జనావాసాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు తీవ్రతకు బాణాసంచా ఫ్యాక్టరీ నేలమట్టం కాగా, పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భయానక అనుభవం.. బటాలా అగ్నిప్రమాదంపై తమ భయానక అనుభవాలను స్థానికులు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయమై రాజ్‌పాల్ ఖక్కర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..‘నేను సమీపంలోని గురుద్వారాకు వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నేను నేలపై పడిపోయి స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచిచూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను’ అని తెలిపారు. సాహిబ్ సింగ్ అనే మరో వ్యక్తి స్పందిస్తూ..‘సెప్టెంబర్ 5న గురునానక్ దేవ్ 532వ వివాహ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లాను. అంతలోనే భారీ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే నేను తిరిగి స్పృహలోకి రావడానికి చాలాసేపు పట్టింది’ అని వ్యాఖ్యానించారు. మృతులకు 2 లక్షల పరిహారం బటాలా దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బటాలా అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ విచారణ చేపడతారని వెల్లడించారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి రాజేందర్ సింగ్‌కు సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50,000, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 వేలు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గురుదాస్‌పూర్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు బటాలా సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంజీవ్ భల్లా మాట్లాడుతూ.. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సెలవుపై ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెనక్కు పిలిపించామని పేర్కొన్నారు. రాష్ట్రపతి కోవింద్, రాహుల్ దిగ్భ్రాంతి బటాలా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశా>రు. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోవడంపై రాహుల్ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బటాలా దుర్ఘటనపై గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీడియోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కాలువలోకి ఎగిరిపడ్డ కార్లు.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు భవనాలు కూలిపోయాయి. దగ్గర్లోని కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు ఎగిరి సమీపంలోని కాలువలో పడిపోయాయి. పేలుడు ప్రకంపనలకు కిలోమీటర్ దూరంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. చాలామంది క్షతగాత్రుల తల, కాళ్లకు గాయాలయ్యాయి – విపుల్ ఉజ్వల్, గురుదాస్‌పూర్ డీసీపీ పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహాలను తీసుకెళ్తున్న పోలీసులు, స్థానికులు -
వరద విలయం
-
వరదలో చిక్కుకున్న సీఎం కుమార్తె అవంతిక
చెన్నై/తిరువనంతపురం/బెంగళూరు/సాక్షి ముంబై: ఏకధాటిగా కురుస్తున్న వానలతో దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర విలవిల్లాడుతున్నాయి. కేరళలో వరదలతో గత మూడు రోజుల్లో 35 మంది చనిపోగా మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడిన రెండు ఘటనల్లో సుమారు 40 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు 25 వరకు నమోదయ్యాయి. అధికార యంత్రాంగం సుమారు 64 వేల మందిని 738 సహాయక శిబిరాలకు తరలించింది. వయనాడ్ జిల్లా మెప్పడి, మలప్పురం జిల్లా నిలాంబర్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని కేరళ సీఎం విజయన్ తెలిపారు. వరద తీవ్రతకు మెప్పడిలోని పుత్తుమల టీ ప్లాంటేషన్ నామ రూపాల్లేకుండా పోయిందని, అందులో చిక్కుకున్న 40 మందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్మీ తెలిపింది. ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడగా మరో 9 మందిని రక్షించామని పేర్కొంది. ఈ ప్రాంతంలో సుమారు 70 ఇళ్లు ధ్వంసమయ్యాయని అంచనా. మలప్పురం జిల్లాలోని కొండప్రాంత కవలపర గ్రామంలోని 40 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. అయితే, నష్టం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. పలక్కడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 సెం.మీ. నుంచి 39 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. పెరియార్ నది పొంగుతుండటంతో కొచ్చి విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో కొచ్చి విమానాశ్రయాన్ని శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొచ్చికి వచ్చే విమానాలను తిరువనంతపురం విమానాశ్రయానికి మళ్లిస్తున్నారు. కొండప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. రైల్వే శాఖ పలు సర్వీసులను రద్దు చేసింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు గాను వయనాడ్, మలప్పురం, కన్నూర్, ఇడుక్కి తదితర 9 కొండ ప్రాంత జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. గత ఏడాది సంభవించిన వరదల్లో కేరళలో 400 మందికిపైగా మరణించడం తెలిసిందే. కనువిందు చేసే ప్లాంటేషన్ కనుమరుగైంది వయనాడ్ జిల్లాలో మెప్పడి సమీపంలోని పుత్తుమల టీ ప్లాంటేషన్లకు పెట్టింది పేరు. ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా. గురువారం సాయంత్రం వరకు ఈ ప్రాంతం.. లోయలు..ఎత్తైన కొండలు, చెట్లు.. కనువిందు చేసే పచ్చదనంతో కళకళలాడింది. అయితే, ఎడతెగని వర్షాలు, భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతమంతా పచ్చదనం బదులు ఇప్పుడు మట్టి, బురదతో నిండిపోయింది. కొండ శిఖరాలు సైతం చదునుగా మారాయి. చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. ఇళ్లు, భవనాలు, గుడి, మసీదు తుడిచిపెట్టుకుపోయాయి. అక్కడ అసలు జనం ఉన్న ఆనవాళ్లే కనిపించకుండాపోయాయి. రెండు కొండల మధ్య నున్న సుమారు 100 ఎకరాల భూమి, ప్లాంటేషన్లు, భవనాలు, జనంతో కళకళలాడిన ఆ లోయ బురదతో నిండిపోయింది. 4 రాష్ట్రాల్లో 83 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మహారాష్ట, కర్ణాటక, కేరళ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో 83 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు హోం శాఖ తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 173 బృందాలకు వీరు అదనమని తెలిపింది. వరదలో చిక్కుకున్న హిమాచల్ సీఎం కుమార్తె హిమాచల్ సీఎం ఠాకూర్ కుమార్తె అవంతిక వరదల్లో చిక్కుకున్నారు. ఉడిపి జిల్లా మణిపాల్ వర్సిటీలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదువుతున్న అవంతిక స్నేహితులతో కలిసి బాదామికి బయలుదేరారు. వీరి బస్సు మలప్రభ నది వరదలో చిక్కుకుంది. దీంతో అవంతిక, ఆమె స్నేహితులు బస్సు దిగి వరద నీటిలోనే ముందుకు వెళ్లారు. హొసూరులో గ్రామస్తులు వారికి ఆశ్రయం కల్పించారు. కేరళను ఆదుకోండి: రాహుల్ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధానిని కోరారు. వర్షాలకు కేరళలో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్న విషయాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కావలసిన సహాయాన్ని అందిస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు వయనాడ్ ఎంపీ ఆఫీస్ ట్విటర్ ఖాతాలో రాహుల్ పోస్ట్ చేశారు. కర్ణాటకలో 12 మంది మృతి కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 12 మంది మృతి చెందారని సీఎం యడియూరప్ప తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని 1.24 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. శుక్రవారం కొడగు జిల్లా కొరంగాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తమిళనాడులో ఐదుగురు మృతి తమిళనాడులో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో వానల ఉధృతి కొనసాగుతోంది. నీలగిరి జిల్లాలో ధారాపాతంగా కురిసిన వర్షాలకు ఐదుగురు చనిపోయారు. లోతట్టు ప్రాంతాల్లోని 1,704 మందిని 28 సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు తెలిపారు. దక్షిణ భారతంలోనే మునుపెన్నడూ లేనంతగా వర్షపాతం ఇక్కడ నమోదయింది. పర్యాటక ప్రాంతం అవలాంచిలో గత 72 గంటల్లో 2,136 మి.మీ. వర్షం కురిసింది. వయనాడ్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు మహారాష్ట్రలో మొత్తం 30 మంది మృతి మహారాష్ట్రలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 30 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. సాంగ్లి జిల్లాలో పడవ బోల్తా ప్రమాదంలో గల్లంతైన ఐదుగురి జాడ తెలియలేదని పేర్కొన్నారు. కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాల్లో ముంపుప్రాంతాల నుంచి 2.52 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కొల్హాపూర్‌లో వరద పరిస్థితి మెరుగయింది. -
వరదలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్
సాక్షి ముంబై: చిమ్మ చీకటి..చుట్టూ వరదనీరు.. విషకీటకాలు, పాముల భయం.. చిన్నారుల ఏడ్పులు.. మంచి నీరు కూడా అందని పరిస్థితి... ఇది ముంబై– కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికుల దుస్థితి. శుక్రవారం రాత్రి ముంబై నుంచి బయలు దేరిన ఈ రైలు ముంబై శివారు ప్రాంతమైన వాంగణీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపైకి వరద నీరు చేరడంతో నిలిచిపోయింది. సుమారు 17 గంటల అనంతరం రైలులో చిక్కుపోయిన 1,050 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, పోలీసులు, స్థానికుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగారు. ప్రయాణికులెవరికీ ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లాస్ నది ఉప్పొంగింది. సెంట్రల్ రైల్వే మార్గంపై బద్లాపూర్, వాంగణీ ప్రాంతాల్లోని రైల్వేట్రాక్‌లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజు టర్మినస్ నుంచి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరిన సీఎస్ఎంటీ–కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు వాంగణీ ప్రాంతంలో వరదలో చిక్కుకుంది. రాత్రంతా రైలులోనే... వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు ఒకేచోట రాత్రంతా రైల్లోనే గడపాల్సి వచ్చింది. ఓ వైపు చుట్టూ వరద నీరు, చిమ్మచీకటి.. నీరు బోగీలోకి వస్తే ఏమవుతుందోననే భయాం దోళన. మరోవైపు విష కీటకాలు, పాములు ఏమైనా లోనికి వస్తే ఎలా అనే భయం... ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్ల ద్వారా మిత్రులతోపాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఇలా ఎవరికి తెలిసిన వారికి వారు ఫోన్లు చేసి, వీడియోలు పంపి సాయం కోరారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలతోపాటు వయోవృద్ధులు, వికలాంగులు కూడా ఈ రైలులో ఉన్నారు. వీరందరూ రాత్రంతా రైలు బోగీలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు వెంట తీసుకుచ్చిన నీరు, ఆహారం, పాలు అయిపోవడంతో పిల్లల ఏడ్పులతో అందరిదీ నిస్సహాయ స్థితి. ఊరట తెచ్చిన రైల్వే సిబ్బంది ప్రకటన.. రాత్రంతా తీవ్ర ఉత్కంఠ, భయాందోళనల మధ్య గడిపిన ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ప్రకటనతో కొంత ఊరట లభించింది. రైలు సిబ్బంది, పోలీసులు ఓ బ్లూ టూత్ మైక్ ద్వారా ప్రతి బోగీలోకి వెళ్లి ‘అందరం సురక్షితంగానే ఉన్నాం. ఎవరూ భయపడవద్దు. ఎవరూ కూడా తొందరపడి రైలు దిగవద్దు’అంటూ సూచనలు చేశారు. రెస్క్యూ టీమ్ వచ్చి అందరినీ రక్షిస్తుందని ప్రకటించారు. రెస్క్యూ టీమ్ రాక.. వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంతలోనే ఎన్డీఆర్ఎఫ్, నావిక దళం బృందాలు అక్కడికి చేరుకోవడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక బృందాలు ఎనిమిది రబ్బరు బోట్లు, ఇతర సామగ్రి తమ వెంట తెచ్చాయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్ల సాయంతో ముందుగా పరిసరాలను పర్యవేక్షించారు. రబ్బరు బోట్లతో రైలు వద్దకు చేరుకునేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి, అక్కడి నుంచి రైలు వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం స్థానికుల సాయం తీసుకున్నారు. రైలు వద్దకి చేరుకున్న అనంతరం బోట్ల ద్వారా ప్రయాణికులను బృందాలుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా 17 గంటల అనంతరం రైలులోని వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 2.20 గంటలకు ముగిశాయి. అనంతరం 14 బస్సులు, మూడు టెంపోల ద్వారా వారందరినీ సురక్షిత స్థలాలకు తరలించారు. తర్వాత వారి కోసం కళ్యాణ్ నుంచి ప్రత్యేక 19 బోగీల ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. మన్మాడ్, దౌండ్ మార్గం మీదుగా ఈ రైలు కొల్హాపూర్‌కు చేరుకోనుంది. మరో 120 మందిని కాపాడిన బృందాలు ఆకస్మికంగా వరద చుట్టుముట్టడంతో బద్లాపూర్‌లోని ఓ పెట్రోల్ పంప్ భవనంపైకి చేరుకున్న 70 మందిని, షాహద్లోని ఓ రిసార్టులో ఉన్న మరో 46 మందిని ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడారని అధికారులు తెలిపారు. అలాగే, కల్యాణ్ జిల్లాలో 9 మందిని రక్షించినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. థానేలో రికార్డు స్థాయిలో శనివారం ఉదయానికి 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉల్హాస్ నగర్లో 200 మి.మీ. వాన కురిసింది. తక్షణం స్పందించిన కేంద్రం రైలు వరదలో చిక్కుకుందనే విషయం తెలిసిన వెంటనే కేంద్రం అప్రమత్తమయింది. ప్రయాణికులను రక్షించేందుకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన తెలుసుకున్న హోంమంత్రి అమిత్ షా వెంటనే ముంబై లోని రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అవసరమైన సామగ్రితో సంఘటన స్థలానికి తరలివెళ్లాలని ఆదేశించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి ఉదయం 9.40 గంటలకు చేరుకున్నాయి. అమిత్ షా విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ కూడా స్పందించి రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు, సుశిక్షితులైన 130 మంది సిబ్బంది కలిసి ఆహారం, మంచినీరు, సహాయక సామగ్రిని వెంట తీసుకుని వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖ అధికారులు వైద్య బృందాలను అక్కడికి పంపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తీసుకువచ్చిన బృందాలను అమిత్‌షా అభినందించారు. పరిమళించిన మానవత్వం.. మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులందరు సురక్షితంగా బయటికి వచ్చిన అనంతరం స్థానిక గ్రామస్తులు వారికి అవసరమైనవి సమకూర్చారు. ముఖ్యంగా పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. బద్లాపూర్‌లోని సహ్యాద్రి మంగళ కార్యాలయంలో వారందరికీ భోజనం, మంచి నీరు అందించి మానవత్వం చాటుకున్నారు. గర్భవతులు సురక్షిత స్థలాలకు: మహాలక్ష్మి రైలులోని సుమారు వెయ్యి మందిలో తొమ్మిది మంది గర్భవతులు. వీరిలో రేష్మా కాంబ్లే తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడంతో ఆమెను ముందుగా తీసుకు వచ్చారు. రైలులో ఉన్న 9 నెలల చిన్నారితోపాటు ఆమె తల్లిని కూడా ఒడ్డుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా 37 మందితో కూడిన డాక్టర్ల బృందం సాయంతో గర్భవతులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
దైవభూమిలో ఇంకా అల్లకల్లోలమే
తిరువనంతపురం: వరదబీభత్సానికి కేరళ చివురుటాకులా వణికిపోతోంది. వర్షాలు ఆగకపోవడంతో నదులు, కాలువలకు వరదపోటు తగ్గట్లేదు. పరిస్థితి రోజురోజుకూ హృదయవిదారకంగా మారుతోంది. శనివారం ఒక్కరోజే 22 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటిదాకా (ఆగస్టు 9న భారీ వర్షాలు మొదలైనప్పటినుంచి) మొత్తం మృతుల సంఖ్య 357కు చేరింది. 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. వరద పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే జరిపిన అనంతరం కేరళకు తక్షణ సాయంగా రూ.500కోట్ల సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో ఎర్నాకులం, త్రిసూర్, ఇడుక్కి, పత్తనంతిట్ట, చెంగనూర్ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తిరువనంతపురం, కొల్లాం, కాసార్గోడ్ జిల్లాల్లో వరద ఉధృతి తగ్గడంతో సహాయకకార్యక్రమాలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కేరళలో మరో 24 గంటలపాటు భారీవర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలువా, చలకుడి, చెంగనూర్, అలప్పుజ, పత్తనంతిట్ట ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం తీవ్రస్థాయిలో ఉంది. చాలాచోట్ల సహాయక కార్యక్రమాల్లో ఆలస్యంపై బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీస వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. చాలాచోట్ల రోడ్డు, రవాణా వ్యవస్థతోపాటు ప్రభుత్వ కార్యకాలాపాలు కూడా స్తంభించాయి. మోదీ, విజయన్ ఏరియల్ సర్వే వరద బాధితులు, కేరళ ప్రజలు అధైర్యపడవద్దని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రూ. 500కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించడంతోపాటు ఆహారధాన్యాలు, ఔషధాలు, ఇతర సహాయాన్ని కేంద్రం నుంచే అందిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేల ఆర్థిక సాయం కేంద్రం తరపున అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన తీవ్రంగా వరద బారిన పడిన అలువా, త్రిసూర్ ప్రాంతాల్లో ఎరియల్ సర్వే చేశారు. మోదీతోపాటు కేరళ గవర్నర్ పి. సదాశివం, సీఎం విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్, ఇతర అధికారులు కూడా హెలికాప్టర్లో ఉన్నారు. ప్రాణ, ఆస్తినష్టం దురదృష్టకరమని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని కేరళ ప్రభుత్వానికి, ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు ప్రధాని సూచించారు. ఏరియల్ సర్వే అనంతరం కొచ్చిలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మొత్తం 357 మంది చనిపోయినట్లు నివేదిక ఇచ్చింది. 3.53 లక్షల మందిని 2వేలకు పైగా పునారావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొంది. కాగా, ఆగస్టు 12న కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రకటించిన రూ.100కోట్ల సాయానికి అదనంగా మరో రూ. 500 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు సమీక్ష అనంతరం ప్రధాని మోదీ వెల్లడించారు. పరిస్థితి గంభీరంగానే: విజయన్ సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. అయితే సకాలంలో స్పందించి తీసుకున్న చర్యల కారణంగా పరిస్థితి కొంతైనా నియంత్రణలో ఉంది. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెల్లమెల్లగా కుదురుకుంటున్నాయి’ అని అన్నారు. ‘ఇప్పటివరకున్న లెక్కల ప్రకారం.. రాష్ట్రానికి రూ.19,512 కోట్ల నష్టం జరిగింది. కేంద్రం నుంచి రూ.2వేల కోట్ల సాయం కావాలని ప్రధానిని అడిగాం. రూ.500కోట్ల తక్షణసాయాన్ని మోదీ ప్రకటించారు’ అని విజయన్ ట్వీట్ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో కమ్యూనిస్టు ప్రభుత్వం విఫలమైందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సహాయక కార్యక్రమాలు సరిగ్గా కొనసాగడం లేదని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల విమర్శించారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైనందున.. ఈ బాధ్యతను పూర్తిగా ఆర్మీకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అతిపెద్ద ఆపరేషన్ రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ 58 బృందాలు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్‌ను కేరళ వరద ప్రభావ ప్రాంతాల్లో జరుపుతోంది. ఇప్పటివరకు దాదాపు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మొత్తం 55 బృందాలు రాష్ట్రంలోని వివిధ తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. మరో మూడు బృందాలు కూడా వీలైనంత త్వరగా వీరితో జతకలవనున్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 2006లో ఎన్డీఆర్ఎఫ్ స్థాపించిన తర్వాత ఒక రాష్ట్రంలో ఇన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగటం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు. ఒక్కో బృందంలో 35–40 మంది సభ్యులుంటారు. ఆగస్టు 8 నుంచి కొనసాగుతున్న సహాయ కార్యక్రమాల్లో మొత్తం 194 మందిని, 12 పశువులను ఈ బృందాలు రక్షించాయన్నారు. మొత్తం 10, 647 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. త్రిసూర్‌లో 15, పత్తనంతిట్టలో 13, అలప్పుజలో 11, ఎర్నాకులంలో 5, ఇడుక్కి 4, మల్లపురంలో 3, వయాంద్, కోజికోడ్‌లలో రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొచ్చిలోని కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడ ఈ కార్యక్రమాలను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఠి 234.4 సెం.మీ వర్షం కొచ్చి: వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో జూన్ 1 నుంచి ఈ నెల 18 వరకు 234.4 సె.మీ వర్షపాతం(సాధారణం కన్నా 42 శాతం అధికం) నమోదైనట్లు తిరువనంతపురంలోని వాతావారణ విభాగం(ఐఎండీ) విభాగం వెల్లడించింది. ఢిల్లీ వార్షిక సగటు వర్షపాతానికి ఇది ఐదు రెట్లు. ఇడుక్కి జిల్లాలో సాధారణం కన్నా 70 శాతం అధికంగా వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఈ ఏడాది లోటువర్షపాతం నమోదుకాకపోవడం గమనార్హం. ప్లీజ్..మోదీకి చెప్పండి కేరళలో వరదల దెబ్బకు సామాన్యులే కాదు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ స్థిమితంగా ఉండే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు. సాక్షాత్తు శాసనసభా సభ్యుడే తన రాష్ట్రంలోని దుస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘వరదల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సరిపడ సంఖ్యలో పడవలు లేకపోవడంతో పేద మత్స్యకారుల పడవలను వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని హెలికాప్టర్లు పంపి మమ్మల్ని కాపాడాలని దయచేసి ప్రధాని మోదీకి చెప్పండి’ అని చెంగన్నూర్ ఎమ్మెల్యే సాజి చెరియాన్ ఓ టీవీ చానెల్లో అభ్యర్థించారు. కేరళ పోరాటస్ఫూర్తికి సెల్యూట్: మోదీ ఆహారధాన్యాలు, ఔషధాలు, ఇతర సహాయక వస్తువులను కేంద్రం తరపున అందజేస్తామని మోదీ భరోసా ఇచ్చారు. రోడ్డు రవాణా వ్యవస్థను త్వరగా పునర్వ్యవస్థీకరించాలన్నారు. సామాజిక భద్రత, ఫసల్ బీమా యోజనల్లో రిజిస్టర్ చేసుకున్న వారందరికీ న్యాయం జరిగేలా బీమా కంపెనీలు క్యాంపులు ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించింది. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్‌లో భాగంగా ఇళ్లు ఇవ్వడంలో ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇతర ప్రభుత్వ పథకాల కింద కేరళకు సాయం ఎక్కువ అందిస్తామని సీఎం విజయన్‌కు మోదీ హామీనిచ్చారు. ‘ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉన్న కేరళ ప్రజల పోరాట స్ఫూర్తికి సెల్యూట్. భారతజాతి మొత్తం కేరళ వెంటే ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. కేరళ త్వరగా సాధారణ స్థితికి రావాలని అభిలషిస్తున్నాను. కేరళకు కేంద్రం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుంది’ అని ప్రధాని ట్వీటర్లో పేర్కొన్నారు. శనివారం కేరళలోని వరద ప్రాంతం అలువాలో విలపిస్తున్న మహిళ సమీక్షాసమావేశంలో మోదీ, విజయన్ -
వరదల్లో జంతువుల పరిస్థితి దారుణం
తిరువనంతపురం: పర్యాటక స్వర్గధామం కేరళ అతలాకుతలమైంది. 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రంలో పెను విషాదాన్నే మిగిల్చాయి. వరదల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ వర్ష బీభత్సానికి ఇప్పటి వరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అయితే జంతువుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పెంపుడు జంతువులను జంతు ప్రేమికులు కాపాడే ప్రయత్నం చేస్తున్నా.. అటవీ జంతువులు కాపాడే నాధుడే కరువయ్యాడు. కొన్ని జింకలు సజీవంగా వరదల్లో కొట్టుకుపోతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అసలేం జరుగుతుందో తెలియక ఆ మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. రంగంలోకి హెచ్ఎస్ఐ హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్(హెచ్ఎస్ఐ) జంతు సంరక్షణ సంస్థ మూగజీవులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఆ సంస్థ వాలంటీర్లు పెంపుడు జంతువులైన డాగ్స్, క్యాట్స్‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా వాటికి కావాల్సిన ఆహారాన్ని, వైద్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారీ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ మహిళా తన 25 శునకాలను కాపాడనిదే తను రాలేనని సహాయక బృందాలతో వారించడంతో.. రంగంలోకి దిగిన హెచ్ఎస్ఐ వాలంటీర్లు ఆ శునకాలను రక్షించి ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎప్పటికప్పుడు హెచ్ఎస్ఐ సంస్థ ఈ సహాయక చర్యల గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తోంది. దీంతో నెటిజన్లు వీరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ( చదవండి: కేరళ విలవిల) -
కేరళ వరదలు: జంతువుల పరిస్థితి దారుణం
-
ప్రధాని మోదీ ఏరియల్ సర్వే రద్దు
కొచ్చి: వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టదలచిన ఏరియల్ సర్వే రద్దయ్యింది. ప్రతికూల వాతావరణం కారణంగా మోదీ తన ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్నారు. శనివారం ఉదయం కొచ్చి చేరుకున్న మోదీ.. ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. కేరళలోని భారీ ముంపునకు గురైన ఎర్నాకులం, ఆలపుజ్జా, పాతనమ్‌తిట్టా తదితర ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే షెడ్యూల్ ఖరారైంది. కాగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా మోదీ ఏరియల్ పర్యటనను ప్రస్తుతానికి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం తిరువంతపురం నుంచి కొచ్చికి వెళ్లిన మోదీ అక్కడి నుంచి ఏరియల్ సర్వేలో పాల్గొనాల్సి ఉండగా భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సర్వే చేసేందుకు టేకాఫ్ అయిన హెలికాప్టర్ కొన్ని క్షణాల్లోనే కిందకు దిగిపోయింది.దాంతో కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో గవర్నర్ పి సదాశివంతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేరళలోని వరద బీభత్సానికి శుక్రవారం సాయంత్రం వరకూ 173 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల వ్యవధిలో 106 మంది ప్రాణాలు కోల్పోవడం వరదల తీవ్రతకు అద్దంపడుతోంది. నిరాశ్రయులైన సుమారు 3 లక్షల మంది 2 వేల సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా, పాతనమ్‌తిట్టా, ఆలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల్లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. -
క్షణమొక యుగంలా..
పాలక్కడ్: దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుపడ్డ కేరళలో ఇప్పుడంతా జల విలయమే. మలయాళ సీమ మరుభూమిని తలపిస్తోంది. చిరుజల్లులతో దేశ, విదేశీ పర్యాటకులకు ఎల్లప్పుడూ ఆహ్లాదాన్ని పంచే ఆ రాష్ట్రం కుంభవృష్టితో చిగురుటాకులా వణికిపోతుంది. ఎప్పుడూ ఏ వైపు వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సహాయక బృందాలు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్న అక్కడి ప్రజల దుస్థితిని స్వయంగా చూడడమే కాకుండా.. వరద ఉగ్రరూపం నుంచి తృటిలో తప్పించుకున్న పీటీఐ జర్నలిస్టు మనోజ్ రామ్మోహన్ ప్రత్యక్ష అనుభవం ఇది. కేరళలోని వేలాది మంది ప్రజలు ఇలా ప్రాణాలు అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాలని ప్రార్థిస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆ కష్టాలు ఆయన మాటల్లోనే.. క్షణాల్లో చుట్టుముట్టిన వరద ‘ఆగస్టు 9న మా తల్లిదండ్రులు నివసిస్తున్న పాలక్కడ్ పట్టణాన్ని ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. విషయం తెలియగానే నేను ఢిల్లీ నుంచి ఇంటికి ఫోన్ చేశారు. కింది అంతస్తు నీటితో నిండిపోయిందని, పై అంతస్తులో తలదాచుకున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో సామాగ్రి, వంట సామాన్లు, బట్టలు కొట్టుకుపోయాయి. వంటగది మొత్తం చిందరవందరైంది. అన్ని గదుల్లో నీరే. అదృష్టవశాత్తూ మొదటి అంతస్తులో ఆహారపదార్థాలు ఉండడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికప్పుడు నేను ఢిల్లీ నుంచి బయల్దేరి ఎలాగోలా కొయంబత్తూరు చేరుకున్నా. అక్కడి నుంచి గంటసేపు ప్రయాణించి ఎలాగోలా పాలక్కడ్ చేరుకున్నా. ఆ రోజు ఆకాశం కొద్దిగా తెరిపినిచ్చింది. అయితే మళ్లీ ఆకాశానికి చిల్లుపడ్డట్లు భారీ వర్షం. దీంతో సమీపంలోని కాలువ ఉప్పొంగి అనేక ఇళ్లను ముంచెత్తింది. దీంతో మాలో ఆందోళన మొదలైంది. తరువాతి రోజు కూడా నింగినేలా ఏకమైనట్లు ఒకటే వాన. మా ఇంటి ముందు భాగం మొత్తం మునిగిపోయింది. కేవలం రెండు కొబ్బరి చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కరెంటు లేదు.. ఫోన్లు మూగబోయాయి. కేవలం చుట్టుపక్కల జనం ఇచ్చే సమాచారంపైనే ఆధారపడ్డాం. ఒకవైపు పాములు, విష పురుగుల భయం, మరోవైపు ఆగకుండా కురుస్తున్న వర్షం ఇక ఆలస్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని గ్రహించి నా స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మమ్మల్ని రక్షించేందుకు కొందరు యువకులు ముందుకొచ్చారు. వరద నీటిలో మా తల్లిదండ్రుల్ని ఆ యువకులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారిద్దరిని సురక్షిత ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉంచి నేను ఢిల్లీ బయల్దేరాను. అయితే కొందరు స్థానికులు మాత్రం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడలేదు. వరద తగ్గుముఖం పడుతుందని వారు ఎదురుచూస్తున్నారు. అయితే సమీపంలోని మలంపుజా డ్యాంలో నీటి ప్రవాహం పెరిగితే ముప్పు తప్పదని స్థానిక ప్రజలు ఆందోళనతో ఉన్నారు’ గర్భిణిని కాపాడారిలా.. ఇళ్ల పైకప్పులు, కొండ ప్రాంతాలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలు కాపాడుతున్నాయి. పడవలు వెళ్లే వీలులేని ప్రాంతాల నుంచి ప్రజలను హెలికాప్లర్ల ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు తాడు కట్టి నేవీ హెలికాప్టర్ ద్వారా ఇంటి నుంచి బయటికి లాగిన దృశ్యాలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. గాల్లో చాలాసేపు ప్రమాదకరంగా వేలాడటంతో ఆమె ఉమ్మనీటి సంచి పగిలింది. వెంటనే ఆ మహిళను నేవీ ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆలువాలో కోళ్లను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న యువకులు -
కేరళ విలవిల
తిరువనంతపురం: పర్యాటక స్వర్గధామం కేరళ అతలాకుతలమైంది. 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు, వరదలు రాష్ట్రంలో పెను విషాదాన్నే మిగిల్చాయి. వరదల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో పరిస్థితి మరింత నిరాశాజనకంగా మారింది. 24 గంటల వ్యవధిలో 106 మంది ప్రాణాలు కోల్పోవడం వరదల తీవ్రతకు అద్దంపడుతోంది. శుక్రవారం సాయంత్రం మృతుల సంఖ్య 173కు పెరిగింది. మే 29 నుంచి రాష్ట్రంలో వర్ష సంబంధ ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 324కు చేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. తాజా వరదల్లో ప్రతి జిల్లాలో మౌలిక వసతులు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు శతాబ్ద కాలంలో ఇంతటి పెను విపత్తును ఎరుగని కేరళ పర్యాటకం రూపంలో భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అయితే దెబ్బతిన్న రోడ్లు, కొండచరియలు వారి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తున్నాయి. నదులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాదకరంగానే ఉన్నాయి. నిరాశ్రయులైన సుమారు 3 లక్షల మంది 2 వేల సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా, పాతనమ్‌తిట్టా, ఆలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల్లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి కొచ్చి చేరుకున్న ప్రధాని మోదీ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు అలువా, కాలడీ, పెరుంబవూర్, మువాత్తుపుజా, చాలాకుడీ తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు కూడా తమ పడవలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన వయానాడ్ జిల్లాకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పలు రైలు సేవలను రద్దు లేదా రీషెడ్యూల్ చేయగా, కొచ్చి మెట్రో సేవలు శుక్రవారం యథావిధిగా కొనసాగాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భీకర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పాతనమ్‌తిట్టా, తిరువనంతపురం, కొల్లాం, ఆలపుజ్జా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్ తదితర ప్రాంతాల్లో గంటకు 60 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అంచనావేసింది. మరోవైపు, విదేశాల్లో ఉన్న కేరళీయులు తమవారి క్షేమం కోసం పరితపిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న తమ కుటుంబీకులు, బంధువులను ఆదుకోవాలని టీవీల్లో అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు. ఆరేళ్ల బిడ్డతో వరదల్లో చిక్కుకున్న ఓ మహిళ..‘ఆహారం, నీరు లేదు. సాయం చేయండి..ప్లీజ్’ అని వేడుకుంటున్న వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా వ్యాపించింది. ఆసుపత్రులు జలమయం.. రోగులకు అవస్థలు ఎర్నాకులం జిల్లాలోని చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లకు కొరత ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఫలితంగా రోగులను సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లోకి వరద నీరు చేరడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సహాయక శిబిరాల్లోనూ ఆహారం, నీటికి కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. వరద ప్రభావం ఎక్కువగాలేని తిరువనంతపురం సహా కొన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయి. తిరువనంతపురం జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూలైన్లలో బారులుతీరారు. 3 వేల లీటర్ల డీజిల్, వేయి లీటర్ల పెట్రోల్‌ను రిజర్వులో ఉంచుకోవాలని అధికారులు అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలను సూచించారు. మరోవైపు, పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దేశీయ విమాన సంస్థలతో సమావేశమై ప్రయాణ చార్జీలు తగ్గించి కేరళకు అదనపు విమానాలను నడపాలని కోరింది. మళ్లీ భేటీ అయిన ఎన్సీఎంసీ.. ఇప్పటి వరకు సుమారు 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 44 మందిని కాపాడామని కేరళలో సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టతరమవుతోందని తెలిపింది. ప్రస్తుతం 51 బృందాలు సేవలందిస్తున్నాయని, మరో రెండు బృందాలు త్వరలోనే అక్కడికి వెళ్తాయని ఢిల్లీలో ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) వరుసగా రెండోరోజు శుక్రవారం సమావేశమై కేరళలో వరద పరిస్థితిని సమీక్షించింది. ఈ భేటీలో కేరళ, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అదనపు వనరులను సమకూర్చుకోవాలని సహాయక చర్యలు చేపడుతున్న దళాలకు కమిటీ సూచించింది. ఇప్పటి వరకు కేంద్రం 339 మోటార్ పడవలు, 2800 లైఫ్ జాకెట్లు, 1400 తేలియాడే బెల్టులు, 27 లైట్ టవర్స్, వేయి రెయిన్కోట్లు పంపించినట్లు ఎన్సీఎంసీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే లక్ష ఆహార పొట్లాలు పంపిణీచేశామని, మరో లక్ష పొట్లాలు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పాలపొడిని పంపేందుకు కూడా ఏర్పాట్లుచేశామని వెల్లడించారు. రైల్వే శాఖ 1.20 లక్షల నీటి సీసాలను పంపింది. మరో 1.20లక్షల బాటిళ్లను పంపేందుకు సిద్ధంగా ఉంచింది. సుమారు 3 లక్షల తాగునీటి బాటిళ్లతో ప్రత్యేక రైలు నేడు కాయంకుళం చేరుకోనుంది. కేరళకు 100 మెట్రిక్ టన్నుల ఆహారపదార్థాల పొట్లాలను పంపేందుకు శిశు, సంక్షేమ శాఖ వైమానిక దళం, కేరళ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇంతటి భారీస్థాయి వర్షాలు గతంలో పడిన సంవత్సరం 1924 వరద ముప్పులో ఉన్న జిల్లాలు : 13 రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు : 9 గేట్లు ఎత్తేసిన డ్యాంలు: 27 కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతాలు: 211 ధ్వంసమైన రోడ్లు: 10,000 కి.మీ దెబ్బతిన్న ఇళ్లు: సుమారు 20,000 ఆస్తినష్టం అంచనా: రూ.8316 కోట్లు ఇడుక్కి డ్యాం నుంచి సెకన్‌కు విడుదలవుతోన్న నీరు: 15 లక్షల లీటర్లు వరద సాయానికి కేటాయించిన ఓనం నిధులు: రూ. 30 కోట్లు శుక్రవారం రాష్ట్రంలో కాపాడింది: 80,000 ఆలువాలోనే: 71,000 నిరాశ్రయులు: 3,00,000 సహాయక శిబిరాలు: 2,000 సహాయక బృందాలు: 51 కేంద్రం పంపినవి.. మోటార్ పడవలు: 339 లైఫ్ జాకెట్లు: 2800 లైట్ టవర్స్: 27 రెయిన్కోట్లు: 1000 తేలియాడే బెల్టులు: 1400 ఆహార పొట్లాలు: 1,00,000 రైల్వేశాఖ ఇచ్చిన నీటి సీసాలు: 1,20,000 పాలక్కడ్‌లో కొండచరియలు విరిగిపడిన అనంతరం కొనసాగుతున్న సహాయకచర్యలు ఇంటి పైకప్పు నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులు కోజికోడ్‌లో వరదనీటిలో పెట్రోల్ పంప్ -
‘ఎన్డీఆర్ఎఫ్’ ఎంతో గర్వకారణం
♦ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి ♦ కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌కు శంకుస్థాపన సాక్షి, అమరావతి: జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్)ను స్థాపించిన పదేళ్లలోనే ప్రజల విశ్వాసాన్ని పొందిందని, ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ ఉందనే ధీమా ప్రజల్లో పెరిగిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కృష్ణా జిల్లా కొండ పావులూ రులో 50 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత సభలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ అనతి కాలంలోనే అతి పెద్ద ఫోర్సుగా అవతరిం చిన ఎన్డీఆర్ఎఫ్ దేశానికే గర్వకారణమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఏపీకి సీఆర్పీఎఫ్ బలగాల ను తరలించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. ఏపీలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ విభాగం ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరువలేనివి.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రెండున్నరేళ్లు అయినా తెలంగాణ, ఏపీ అస్తుల పంపకం తేలలేదని, అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి కొత్తగా కేన్సర్ సంస్థ.. సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 20 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లతో కొత్తగా క్యాన్సర్ సంస్థలను ఏర్పాటు చేçస్తుంటే వాటిలో ఒకటి ఏపీకి కేటాయిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ప్రకాష్ నడ్డా చెప్పారు. విశాఖ చినవాల్తేరు మానసిక ఆస్పత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కేంద్రాన్ని(సీజీహెచ్ఎస్) మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో దశాబ్దాలుగా ఉన్న కిడ్నీ సమస్య మూలాలను తెలుసుకునేందుకు నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నిపుణుల ద్వారా పరిశోధన చేయించనున్నట్టు వెల్లడించారు. అవసరమైతే ఇక్కడ మరో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఢిల్లీలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న టెలీ కన్సల్టెన్సీ, టెలీ మెడిసిన్ విధానాన్ని మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే జోన్లు కూడా త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయన్నారు.