పర్యాటక స్వర్గధామం కేరళ అతలాకుతలమైంది. 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రంలో పెను విషాదాన్నే మిగిల్చాయి. వరదల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ వర్ష బీభత్సానికి ఇప్పటి వరకు సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అయితే జంతువుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పెంపుడు జంతువులను జంతు ప్రేమికులు కాపాడే ప్రయత్నం చేస్తున్నా.. అటవీ జంతువులు కాపాడే నాధుడే కరువయ్యాడు. కొన్ని జింకలు సజీవంగా వరదల్లో కొట్టుకుపోతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అసలేం జరుగుతుందో తెలియక ఆ మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి.